హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో కల్లోలం? రాజీనామా చేసిన మంత్రి విక్రమాదిత్య
x
విక్రమాదిత్య, హిమాచల్ ప్రదేశ్ మంత్రి

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో కల్లోలం? రాజీనామా చేసిన మంత్రి విక్రమాదిత్య

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమితో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా మంత్రి విక్రమాదిత్య సైతం రాజీనామా చేశారు


రాజ్యసభ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని లుకలుక బయటపెట్టాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి అనూహ్యంగా ఓటమి పాలు కావడంతో మంత్రిగా ఉన్న విక్రమాదిత్య రాజీనామా చేస్తున్నట్లు పలు జాతీయా మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.

విక్రమాదిత్య మాజీ సీఎం వీరభద్ర సింగ్, ప్రతిభా సింగ్ కుమారుడు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం చివరిదాకా పోరాడారు.

ప్రస్తుత పరిస్థితుల్లో హిమాచల్ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బయటపడాలని అనుకుంటున్నాని విక్రమాదిత్య వెల్లడించారు. " ప్రస్తుత పరిస్థితుల్లో నేను ప్రభుత్వంలో భాగమవడం అంతమంచి నిర్ణయం కాదనిపిస్తోంది. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను. మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. తదుపరి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాను " అని ప్రకటించారు.
మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్విని ఓడించారు. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు, 25 మంది బీజేపీకి, ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఇరువురు అభ్యర్థులకు 34 ఓట్లు రావడంతో లాటరీ తీశారు. ఇందులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
బలనిరూపణ చేసుకోవాలి: గవర్నర్ ను కోరిన బీజేపీ



హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ లో తన బలాన్ని నిరూపణ చేసుకోవాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ నాయకులు బుధవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కోరారు. తాము సుఖ్ విందర్ సింగ్ సఖూ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.
మంగళవారం స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా, ఆరోగ్య శాఖ కు సంబంధించిన కట్ మోషన్ లో ఓట్ల విభజనను అనుమతించలేదని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. " శాసనసభ లో పరిస్థితిని గవర్నర్ అంచన వేయడానికి మేము ఇక్కడకు వచ్చాం" అని గవర్నర్ తో కలవడానికి ముందు ఠాకూర్ విలేకరులతో అన్నారు. శాసనసభలో నిరసన తెల్పడానికి కూడా తమకు స్వేచ్చ లేదని, తమపై మార్షల్స్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు.


Read More
Next Story