‘‘ఓట్ చోరి కాంగ్రెస్ అంశం మాత్రమే.. ఇండి కూటమిది కాదు’’
x
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

‘‘ఓట్ చోరి కాంగ్రెస్ అంశం మాత్రమే.. ఇండి కూటమిది కాదు’’

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా


దేశంలో ఓటర్ చోరి అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంతో ‘ఇండి’ కూటమికి ఎటువంటి సంబంధం లేదని కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రతిపక్ష కూటమి అయిన ఇండి బ్లాక్ లో ఆయన పార్టీ నేషనల్ కాన్పరెన్స్ పార్టీ కూడా ఉంది.

కాంగ్రెస్ ఓట్ చోరీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్ లేదా ఎస్ఐఆర్) ను తన ప్రచార అంశంగా పెట్టుకుందని, ప్రతి రాజకీయ పార్టీకి తన సొంత ఎజెండాను నిర్దేశించుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు.

‘‘ఇండి బ్లాక్ కు దానితో ఏం సంబంధం లేదు. ప్రతి రాజకీయ పార్టీ తన సొంత ఎజెండాను నిర్దేశించుకునే స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్ ఓట్ చోరీ, ఎస్ఐఆర్ లను దాని ప్రధాన సమస్యలుగా చేసుకుంది. వారికి లేకపోతే మనం ఎవరు చెప్పాలి’’? అని ఒమర్ అన్నారు.

ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా దాదాపు ఆరు కోట్ల సంతకాలను ఆపార్టీ సేకరించిందని, దానిని త్వరలోనే రాష్ట్రపతికి అందజేస్తామని పేర్కొందని ఆయన చెప్పారు.
లైఫ్ సపోర్ట్ వ్యాఖ్యలు..
ఇండి కూటమి లైఫ్ సపోర్ట్ పై ఉందని ఒమర్ చెప్పిన వారం తరువాత మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య అనేక కూటమి భాగస్వాముల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. కొంతమంది నాయకులు ఒమర్ వ్యాఖ్యలతో ఏకీభవించగా, మరికొందరు బహిరంగంగా విభేదించారు. అయితే తమ ప్రతిపక్ష సమూహం బాగుందని ప్రస్తుతం ఆయన అన్నారు.
ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో ఒమర్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇండి కూటమి ప్రస్తుత పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. భాగస్వాముల మధ్య సమన్వయాన్ని పునరుద్దరించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడల్లా కూటమి కొంతకాలం ఫుంజుకున్నట్లు కనిపించిందని, కానీ ప్రతికూల రాజకీయ పరిణామాల తరువాత త్వరగా ఊపు కోల్పోయిందని ఆయన అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, ఇటువంటి ఎదురుదెబ్బలు కూటమిని మరింత బలహీనపరిచాయని ఆయన చెప్పారు.
బీహార్ పరాజయంపై..
ఇండి కూటమి అంతర్గతంగా పొత్తులను కుదుర్చుకోవడం వల్లే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీఏకి వెళ్లాడని తాను నమ్ముతున్నానని ఒమర్ అన్నారు.
బీహార్ లో సీట్ల పంపకంలో హేమంత్ సోరెన్ కు అసలు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇటువంటి తప్పుడు అడుగులు కూటమిలోని అంతర్గత విభేదాలను మరింత పెంచాయని, దాని ఐక్యత గురించి దీర్ఘకాలిక ప్రశ్నలు లేవనెత్తాయన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గందరగోళం, కూటమి పోరుబాట, నాయకత్వంపై గందరగోళం గురించి మాట్లాడుతూ.. పార్లమెంటరీ ఎన్నికల కోసమే దీనిని ఉద్దేశించినట్లు అయితే.. ప్రస్తుతం కూటమిని మూసివేయాలని సూచించారు.
దేశ రాజధానిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఎన్నికల గురించి తాను ఏం మాట్లాడనని కూడా అన్నారు. ఇండి కూటమి ఏర్పాటు సందర్భంలో ఎలాంటి పరిమితి నిర్ణయించలేదని చెప్పారు.
కానీ దాని నాయకత్వ నిర్మాణం, రాజకీయ దిశపై గందరగోళం ఏర్పడిందని అన్నారు. ‘‘ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే ఏర్పడితే ఇక దాన్ని ముగించాలి’’ అని జమ్మూకశ్మీర్ సీఎం అన్నారు.


Read More
Next Story