
ఈ యూట్యాబర్ జ్యోతి మామూలు మనిషి కాదండీ బాబు!
ఈ కేసులో తొవ్వేకొద్ది వెలుగు చూస్తున్న సంచలన విషయాలు
పాక్ గూఢచారిగా అరెస్ట్ అయిన హరియాణా య్యూటబర్ జ్యోతి మల్హోత్రా మామూలు మనిషి కాదు. కేసు లోతుల్లోకి పోయే కొద్ది సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏదో గొట్టం పట్టుకుని మొబైల్ ఆపరేట్ చేసే సాదాసీదా యూట్యూబర్ కాదని తేలింది. ఆమె తన అందాన్ని ఎరగా వేశారని కొందరంటుంటే కాదు ఆమె తెలిసి తెలిసే గూఢచారి పని చేశారని కొందరంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన విషయాలు ఇలా ఉన్నాయి.
ఆమె పాకిస్తాన్ ఎందుకు వెళ్లినట్టు?
పహల్గాం దాడికి ముందు ఆమె పాకిస్తాన్ లో పర్యటించి వచ్చారు. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టైన హరియాణాకు చెందిన ట్రావెల్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణ ముమ్మరమైంది.
ఈమెకి పాకిస్తాన్ తో సత్ సంబంధాలు ఉన్నాయి. 2024 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి మూడు నెలల ముందే జ్యోతి ఆ ప్రాంతాన్ని సందర్శించి వచ్చారు. వీడియోలు తీశారు. స్వదేశానికి సంబంధించిన సమాచారాన్ని పాక్ నిఘా వర్గాలకు అందించారని సమాచారం. ఇప్పుడీ విషయం సంచలనంగా మారింది. చురుగ్గా దర్యాప్తు జరుగుతోంది.
నేరుగా పాక్ హైకమిషన్ తోనే సంబంధాలు...
పాక్ ఐఎస్‌ఐకి చెందిన అనేక కార్యాచరణల్లో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్న ఈ యూట్యూబర్, ‘ట్రావెల్ విత్ జో’ (Travel With Jo) అనే చానెల్‌ను నడుపుతున్నారు. 2023లో పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఆమెకు పాక్ హైకమిషన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న డానిష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తరువాత భారత్‌కి తిరిగొచ్చిన తర్వాత కూడా అతడితో సంబంధాలను కొనసాగించారు. ఆ వ్యక్తి సూచనల మేరకు జ్యోతి, అలీ అహ్సాన్ అనే మరో వ్యక్తిని కలిశారు. అతడే పాక్ నిఘా సంస్థలకు, రక్షణ విభాగ అధికారులకు ఆమెను పరిచయం చేశారని సమాచారం.
కీలక సమాచారం లీక్ అయిందా...
డిఫెన్స్‌తో సంబంధిత నిఘా సమాచారాన్ని జ్యోతి పాక్ అధికారులకు అందించారని అధికారులు భావిస్తున్నారు. ఇది భారత్ రక్షణ వ్యవస్థకు తీవ్ర ముప్పుగా భావిస్తూ విచారణను సుదీర్ఘంగా జరుపుతున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఉద్రిక్తతల సమయంలో కూడా ఆమె ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ అధికారితో టచ్‌లో ఉన్నట్లు కనుగొన్నారు. అతడు ఆమెను ‘హనీ ట్రాప్’ చేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను భారత్‌లో సస్పెండ్ చేశారు.
కిషన్ రెడ్డి కార్యక్రమంలో మల్హోత్రా పాల్గొన్నారా
ఈ కేసుకు సంబంధించి మరో కీలక మలుపు… జ్యోతి 2023 సెప్టెంబరులో హైదరాబాద్‌లో కూడా చురుకుగా కనిపించినట్లుగా తేలింది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద వీడియోలు చేస్తూ చురుగ్గా కనిపించారు. అప్పటి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరైన ఈ కార్యక్రమంలో ఆమె తిరుగాడి చేశారు. ఇప్పుడు ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చుకుని, ఆమె ఎవ్వరిని కలిశారు? అక్కడ ఏమైనా ప్రత్యేక వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు విచారణ చేపట్టినట్లు సమాచారం.
అంతర్జాతీయ ప్రయాణాల మిస్టరీ
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు మాత్రమే కాకుండా, ఒకసారి చైనాకూ వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ప్రయాణాలు త్వరణంగా జరిగిన తీరు, ఆమెతో కాంటాక్టులో ఉన్న అంతర్జాతీయ వ్యక్తుల వివరాలు అన్నీ ప్రస్తుతం నిఘా అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్లేషణ చేస్తున్నాయి.
ఎన్నో అనుమానాలు మరెన్నో ఫోటోలు...
హరియాణాలో అరెస్టు అయిన తర్వాత జ్యోతి వీడియోలు, ఫోటోలు విపరీతంగా వైరల్ కావడం, ఆమె పర్యటనలపై వచ్చిన అనుమానాలు ఈ కేసుకు జాతీయ శ్రద్ధను తీసుకొచ్చాయి. దేశ రక్షణ వ్యవస్థకు ముప్పుగా నిలుస్తూ, సామాన్య పౌరురాలిగా కనిపించే వ్యక్తి అంతర్గతంగా పాక్ కోసం పనిచేస్తూ ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సామాజిక మాధ్యమాల్లో కనిపించే యూట్యూబర్లు, ట్రావెల్ బ్లాగర్లు అందరినీ ఒకే గాట కట్టాల్సిన పని లేదని ఈ ఘటనతో రుజువైంది. విదేశీ నిఘా సంస్థల లక్ష్యంగా మారుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లువెన్సర్ల ముసుగులో నడుస్తున్న మాయాజాలాన్ని వాస్తవంగా పరిశీలించే బాధ్యత ఇప్పుడు దేశ భద్రతా వ్యవస్థలపై ఉంది.
Next Story