ఉచితాలు వద్దు.. అభివృద్ది కావాలంటున్న ఓటర్లు.. ఎక్కడంటే ?
x

ఉచితాలు వద్దు.. అభివృద్ది కావాలంటున్న ఓటర్లు.. ఎక్కడంటే ?

మాకు ఉచితాలు వద్దు.. అవన్నీ తేనే పూసిన కత్తులు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలపై చర్చ పెట్టండని హర్యానా ఓటర్లు కోరుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో..


హర్యానా అసెంబ్లీకి త్వరలో పోలింగ్ జరగబోతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అనేక రకాల హమీలు ప్రకటించాయి. ముఖ్యంగా ఉచిత పథకాలు ప్రకటించి ఓటర్ల దయను పొందడానికి ప్రణాళిక రచించాయి. దీనిపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు

ది ఫెడరల్ హర్యానాలో పెద్ద ప్రాంతంలో మహిళా, పురుష ఓటర్లతో మాట్లాడింది. రెండు పార్టీలు కూడా ఖజానాపై భారం మోపే ఉచిత పథకాలు ప్రకటించడంపై వీరంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని బదులుగా ప్రజలకు భారీగా లబ్ది చేకూర్చే నిజమైన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.
హర్యానా దేశ రాజధానికి దగ్గరలో ఉన్న కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి మెజారిటీ ప్రజలు జీవిస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు వేల గ్రామాల్లో విద్యాసౌకర్యాలు అథమ స్థాయిలో ఉన్నాయని, కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేవని చెబుతున్నారు. వీటికి సరైన నిధులు కేటాయించాలని పేర్కొంటున్నారు. నిరుద్యోగం అధిక స్థాయిలో ఉందని ఉఫాది అవకాశాలు మెరుగుపరచాలని కోరారు.
గణాంకాలు చూస్తే..
హర్యానాలో అక్ష్యరాస్యత అథమ స్థాయిలో ఉందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశంలో అక్ష్యరాస్యత వరుసలో హర్యానా స్థానం 22. మేవాఠ్ ప్రాంతంలో ఇది ఇంకా దిగువ స్థాయిలో ఉందని తెలుస్తోంది..‘‘ ఉద్యోగం, చదువు, ఆరోగ్య రంగాలలో ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది.
ఉద్యోగం, చదువు లేని పేద కుటుంబం ఉచిత విద్యుత్ తో ఏం చేసుకోవాలి. విద్య ద్వారానే యువత భవిష్యత్ బాగువుతుంది’’ అని నూహ్ కు చెందిన ప్రొఫెసర్ ఐజాజ్ అహ్మద్ అంటున్నారు. రాజకీయా పార్టీలు ఓటర్లను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాజీవ్ యాదవ్ అనే ఎన్జీఓ సంస్థ నాయకుడి మాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే హిమాచల్ ప్రదేశ్ లో ఉచిత వాగ్థానాలు( ఉచిత విద్యుత్, ప్రీ డబ్బు అందించడం) అమలు చేసి ప్రస్తుత ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలు..
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న మాజీ సీఎం భూపిందర్ హుడా తన మ్యానిఫెస్టోను విడుదల చేశాడు. ఇందులో అనేక ఉచిత పథకాలకు హమీ ఇచ్చారు. ఇదే బాటలో సీఎం నాయబ్ సింగ్ సైనీ సైతం బీజేపీ మ్యానిఫెస్టోను రూపొందించారు. అయితే వీటన్నింటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారని ఎన్జీఓ సంస్థ నిర్వాహకుడు రాజీవ్ యాదవ్ ప్రశ్న. విద్యా, ఆరోగ్య రంగాలు అత్యంత ముఖ్యమైనవి. వీటికి కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. ఈ పథకాన్నీ తేనేపూసిన కత్తులు అని వ్యాఖ్యనించారు. ‘‘ ఇలాంటి మ్యానిఫెస్టోలు దేశానికి అత్యంత ప్రమాదకరం’’ అని భివానీ నివాసి ప్రమోద్ మెహతా అభిప్రాయపడ్డారు.
హమీలను నమ్మని స్థానికులు..
‘‘ మేము కాంగ్రెస్ ఇస్తున్న హమీలు, అలాగే బీజేపీ ప్రకటించిన తాయిలాలను నమ్మడం లేదు. ఇదే సమయంలో రెండు పార్టీలు అభివృద్ధి విషయాలపై ఎలాంటి ప్రకటన చేయట్లేదు’’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
జింద్ జిల్లాలోని కుంగో గ్రామానికి చెందిన సజ్జన్ కుమార్ ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. ‘‘ స్థానికులమైన మేము రెండు పార్టీలు ఇస్తున్న హమీలను నమ్మడం లేదు’’ అని చెప్పారు. ‘‘ మాకు విద్యా, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో బలమైన సహకారాన్ని, అభివృద్ధిని కోరుకుంటున్నాం.. ఉచిత పథకాలను కాదు. రాజకీయా నాయకులు మమ్మల్ని పిచ్చొళ్లును చేయడానికి చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నొటికొచ్చిన అబద్ధాలను యథేచ్ఛగా ప్రకటిస్తున్నాయి’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విద్యా, ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..
హర్యానా ప్రజలకు ఏమి అవసరమో దానిపైనే రాజకీయ నాయకులు దృష్టి పెడితే బాగుంటుందని చక్రకుండ్ నివాసి గంగారామ్ అన్నారు. ‘‘ రాజకీయ పార్టీలు ఇప్పుడు చేస్తున్న ప్రామిస్ లను అమలు చేస్తాయన్న నమ్మకం మాకు లేదు. ఇలా హమీలు ఇచ్చే బదులు ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, డిస్పన్సరీలను బలోపేతం చేస్తామని హమీ ఇస్తే బాగుంటుంది. ఎన్నికలు మొత్తం ఇదే అంశంపై నడవాలి’’ అని పేర్కొన్నారు.
‘‘ మేము కష్టపడి పన్నులు కడుతున్నాం.. కానీ ప్రభుత్వాలు ఇలా ఉచిత పథకాలతో అంతా చిందరవందర చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఇలాంటి హమీలను ఇవ్వకుండ ఉంటే మంచిది’’ అని ఢిల్లీలో లాయర్ గా విధులు నిర్వహిస్తున్న హర్యానా పౌరుడు సునీల్ శర్మ అభిప్రాయపడ్డారు.
గత చరిత్ర..
ఇప్పుడు బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినట్లయితే వరుసగా రాష్ట్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టిస్తుంది. అదే కాంగ్రెస్ గెలిస్తే దశాబ్ధం తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లు అవుతుంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓ సారి పరిశీలిస్తే... కాంగ్రెస్ 2000 సంవత్సరంలో 21 సీట్లు, 2005 లో 67, 2009 లో 40, 2014 లో కేవలం 15 సీట్లు, 2019 లో 31 సీట్లు సాధించింది.
బీజేపీ 2000 లొ ఆరు సీట్లు, 2005 లొ రెండు సీట్లు, 2009 లో నాలుగు సీట్లు, 2014 లో 47 సీట్లు, 2019 లో 40 సీట్లు సాధించింది. అక్టోబర్ 5న హర్యానాలో ఉన్న 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
కాంగ్రెస్ వాగ్థానాలు..
కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. పది సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకుని ఓట్లుగా మలుచుకోవాలని అనేక వరాలను ప్రకటించింది. అందులో ముఖ్యంగా వితంతువులు, దివ్యాంగులకు, వృద్ధులకు నెలకు రూ . 6 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేలు, అలాగే 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హమీ ఇచ్చింది. ఇదే అంశంపై కాంగ్రెస్ నాయకుడు ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. మా మొదటి లక్ష్యం హర్యానా అభివృద్దే అని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ ఐఎన్ఎల్డీ విమర్శలు..
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ఇరు పార్టీలు ప్రకటిస్తున్న హమీలపై విమర్శలు గుపించారు. రెండు జాతీయ పార్టీలు ఎన్నికలకు ముందే తమ ఓటమిని ప్రకటించాయని పార్టీ పేర్కొంది. రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి వాటిలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని, వీటిపై చర్చ పెట్టకుండా ఉచిత పథకాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని పార్టీ నాయకుడు ప్రతాప్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read More
Next Story