26/11 దాడులపై బాంబు పేల్చిన చిదంబరం
x
చిదంబరం

26/11 దాడులపై బాంబు పేల్చిన చిదంబరం

అమెరికా ఒత్తిడితో పాక్ పై సైనిక చర్య తీసుకోలేదని వివరణ, నిప్పులు చెరిగిన బీజేపీ


భారత ఆర్థిక రాజధాని ముంబై పై 26/11 ఉగ్రవాద దాడికి పాల్పడిన పాక్ పై ఎలాంటి సైనిక చర్య తీసుకోవద్దని తాము నిర్ణయించుకున్నామని మాజీ కేంద్ర మంత్రి, యూపీఏ పాలనలో కీలకంగా వ్యవహరించిన చిదరంబరం చెప్పారు.

ముఖ్యంగా అమెరికా నుంచి భారీ ఒత్తిడి వచ్చిందని, అందుకే తాము ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందని బాంబు పేల్చారు. ఆపరేషన్ సిందూర్ ను మోదీ ప్రభుత్వం పాజ్ చేసిన తరువాత రాహుల్ గాంధీ సహ యూపీఏ లో కీలకంగా వ్యవహరించిన పలు పార్టీలు అమెరికా కారణంగా యుద్ధాన్ని ఆపివేశారని విమర్శలు గుప్పించారు.

అయితే ఇప్పుడు చిదంబరం అప్పటి సంగతి చెప్పడంతో మోదీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన వారి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లు అయింది.

ముంబై పై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి జరిపిన తరువాత అప్పుడు హోంమంత్రిగా ఉన్న శివరాజ్ పాటిల్ ను తప్పించిన మన్మోహాన్ సర్కార్.. చిదంబరానికి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించింది.
ఈ సందర్భంగా అప్పటి పరిస్థితులను చిదంబరం బయటపెట్టారు. ‘‘పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నా మనసులోకి వచ్చింది’’ అని వివరించారు. దాడి ప్రణాళికను విదేశాంగ మంత్రిత్వ శాఖ, సీనియర్ దౌత్యవేత్తలు రూపొందించారు.
26/11 తరువాత అంతర్జాతీయ ఒత్తిడి
ఒక హిందీ వార్తా ఛానెల్ తో మాట్లాడిన చిదంబరం.. యుద్ధం ప్రారంభించవద్దని చెప్పడానికి ప్రపంచం మొత్తం ఢిల్లీకి వచ్చింది’’ అని ఆయన గుర్తు చేశారు. దాడి జరిగిన కొన్ని రోజుల్లోనే అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైస్ భారత్ ను సందర్శించి, సంయమనం పాటించాలని కోరినట్లు చెప్పారు. ‘‘ఇది ప్రభుత్వ నిర్ణయం అని నేను చెప్పాను. మనం ఏదైన ప్రతీకారం తీర్చుకోవాలని నా మనసులో మెదిలింది’’ అని చిదంబరం పేర్కొన్నారు.
దాడి ప్రణాళిక రద్దు..
ప్రతీకారం తీర్చుకునే అవకాశం గురించి ప్రధానమంత్రి, ఇతర కీలక వ్యక్తులతో చర్చించినట్లు చిదంబరం బయటపెట్టారు. ‘‘దాడి జరుగుతున్నప్పుడు కూడా ప్రధానమంత్రి సైనిక ప్రతీకార దాడి గురించి చర్చించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఐఎఫ్ఎస్ ద్వారా ప్రభావితమై, సైనిక దాడికి రాకూడదనే ముగింపుకు వచ్చాము’’ అని ఆయన అప్పటి రహాస్యాలను బయటపెట్టారు.
సీఎస్టీ, తాజ్ మహాల్ ప్యాలెస్, ఒబేరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌజ్ తో పాటు ముంబైలోని పలు ప్రాంతాలలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడులో 175 మంది మరణించారు. ఈ దాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించగా అజ్మల్ కసబ్ ను మాత్రం సజీవంగా పట్టుకున్నారు. ఈ ఉగ్రవాదిని 2012 లో ఉరి తీశారు.
కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు..
చిదంబరం చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించాయి. విదేశీ ఒత్తిడితో కాంగ్రెస్ సంక్షోభాన్ని కూడా విడిచిపెట్టిందని బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇంటర్వ్యూను క్లిప్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘17 సంవత్సరాల తరువాత మాజీ హోంమంత్రి చిదంబంర దేశానికి అసలు విషయాన్ని వెల్లడించారు. 26/11 విదేశీ శక్తుల ఒత్తిడి కారణంగా దేశాన్ని విడిచిపెట్టారు.’’ అన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీ మాట్లాడుతూ.. 2009 లో పాకిస్తాన్ తో షర్మ్ ఎల్ షేక్ సంయుక్త ప్రకటనను ఎత్తి చూపారు. ఇది వివాదాస్పదంగా బలూచిస్తాన్ ప్రస్తావించింది.
‘‘2005-2007 వరకూ భారత్ లో అనేక ఉగ్రవాద దాడులు వరుసగా జరిగాయి. 2007 లో హవానాలో ఉమ్మడి ప్రకటన వచ్చింది. పాకిస్తాన్ కూడా మనలాగే ఉగ్రవాద బాధితురాలిని వారు అన్నారు.
26/11 దాడుల తరువాత తొమ్మిది నెలల తరువాత జూలై 2009 వారు తటస్థ గమ్యస్థానమైన ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్ వద్దకు వెళ్లి ఉగ్రవాదం శాంతి చర్చలను ప్రభావితం చేయదని పాకిస్తాన్ తో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు’’ అని త్రివేది అన్నారు.
సోనియా ప్రభావం ఏంటీ?
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ లేదా అప్పటి ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ చిదంబరం ప్రతీకారం తీర్చుకునే ధోరణిని వద్దన్నారా? అని బీజేపీ నేత ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.
యూపీఏ ప్రభుత్వం కండోలిజా రైస్ ప్రభావంతో వ్యవహరించినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ‘‘యూపీఏ కండోలిజా రైస్ నుంచి ఆదేశాలు ఎందుకు తీసుకుంది? హోంమంత్రి పై సోనియా గాంధీ ఎందుకు నియంత్రణ చేశారు’’ అని ప్రశ్నించారు.
ముంబై దాడుల తరువాత చిదంబరం మొదట్లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడలేదని, పాకిస్తాన్ పై సైనిక చర్య తీసుకోవాలని అనుకున్నారని, ఆయనపై ఇతరులు విజయం సాధించారని అన్నారు. 26/11 సంఘటనే కాకుండా 2007 నాటి సంఝౌత్ ఎక్స్ ప్రెస్ పేలుడులో కూడా కాంగ్రెస్ పాక్ కు క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన ఆరోపించారు.
పదేపదే సరిహద్దు వద్ద దాడులు జరుగుతున్నప్పుడూ యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్ కు మాత్రం అత్యంత అనుకూల దేశంగా హోదా కల్పించిందని, దేశంలో హిందూ ఉగ్రవాదం అనే కల్పిత కథను ప్రొత్సహించిందని ఆయన విమర్శలు గుప్పించారు.
Read More
Next Story