
అఖిలేష్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ
‘‘అఖిలేష్ యాదవ్ దుకాణం మూసివేస్తాం’’
ఎంఐఎం అధినేత ఓవైసీ హెచ్చరిక
శిల్పిసేన్
మహారాష్ట్ర లో స్థానిక సంస్థల ఎన్నికలు సందడిగా సాగుతున్నాయి. మరో వైపు తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు సైతం ఈ ఏడాది జరగబోతున్నాయి. అయితే దేశంలో అతిపెద్ద రాష్ట్రం, అత్యధిక జనాభా గల ఉత్తర ప్రదేశ్ లోను ఎన్నికల సందడి కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ దుకాణం మూసివేస్తామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. బీఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వచ్చిన ఆయన ఈవిధంగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ కు విస్పష్టమైన సందేశం పంపించారు.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ రాజకీయ నాయకులు ఇప్పటికే రంగంలోకి రాజకీయ చదరంగం ప్రారంభించారు. తమ ఎత్తులను ప్రారంభించడానికి వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు.
ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో సీమాంచల్ ప్రాంతంలో మంచి ప్రదర్శన జరిగిన తరువాత ఓవైసీ ఇప్పుడు తన దృష్టి యూపీ వైపు సారించారు. బీఎంసీ(బృహన్ ముంబై ) ఎన్నికల్లో ఓవైసీ తన పూర్తి శక్తిని ప్రచారం కోసం వినియోగించుకున్నారు.
ఆయన బహిరంగ సభలు పెద్ద ఎత్తున జనాన్ని ఆకర్షిస్తున్నాయి. ముస్లిం ఓటర్లకు సంబంధించిన అంశాలను తన ప్రసంగాలలో ఎక్కువగా లేవనెత్తడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ముంబైలోని బీఎంసీ ప్రచార వేదిక నుంచి మాట్లాడుతూ.. ఓవైసీ సమాజ్ వాదీ పార్టీ ముస్లిం ఓటర్ల స్థావరాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు.
అఖిలేష్ ను నేరుగా సవాల్ చేస్తూ.. అఖిలేష్ దుకాణాన్ని మూసివేస్తామని ఓవైసీ అన్నారు. తన ప్రచారం ప్రసంగాలలో మాట్లాడుతూ.. ‘‘జాగ్రత్తగా వినండి. ముస్లిం రాజకీయ నాయకత్వం ముందుకు సాగుతుంది. మైనారిటీ రాజకీయ నాయకత్వం తెరపైకి వచ్చిన రోజు, అఖిలేష్ యాదవ్ దుకాణం మూసివేయబడుతుందని అబు అసిమ్, అఖిలేష్ యాదవ్ కు తెలుసు’’ అని హెచ్చరించారు.
ఓవైసీ ఇక్కడితో ఆగలేదు. అఖిలేష్ రాజకీయా ఆధిపత్యాన్ని అంతం చేస్తామని మరోసారి అన్నారు. ఎంఐఎం చీఫ్ వ్యాఖ్యలను పరిశీలిస్తే..2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిలకు ముందు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలనే దాని లక్ష్యాన్ని స్ఫష్టం తెలియజేస్తోంది. ఇందుకోసం ముస్లిం ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఉత్తర ప్రదేశ్ లో ముస్లింలు సమాజ్ వాదీ పార్టీ సంప్రదాయంగా మద్దతు ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో వారు ఎస్పీకి వారు మద్దతు ఇచ్చారు. అందుకే పార్టీకి గణనీయమైన స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకుంది.
సమాజ్ వాదీ పార్టీ కూడా తన పాత ఫార్మూలా అయిన ఎం+ వై(ముస్లింలు, యాదవ్) ను పక్కన పెట్టి పీడీఏ( వెనకబడిన తరగతులు, దళితులు, ముస్లింలు) వంటి వారిని చేరదీస్తోంది. ఇదే సమయంలో ముస్లింలు కూడా ఎస్పీకి అండగా నిలిచారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- ఎస్పీ కూటమి విజయంలో ముస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విజయాన్ని తిరిగి సాధించాలని భావిస్తే దానికి ముస్లింల మద్దతు అవసరం.
అఖిలేష్ వైఖరిపై ప్రశ్నలు..
ఇటీవల కాలంలో అఖిలేష్ రాజకీయ విధానం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విమర్శకులు అన్ని వర్గాలను చేర్చుకునే ప్రయత్నంలో ముస్లింలను పక్కన పెడుతున్నారని వాదిస్తున్నారు. అనేక సున్నితమైన విషయాలపై ఆయన వైఖరి సరిగా లేదని ఆరోపణలు ఉన్నాయి.
లవ్ జిహాద్ వివాదంలో బరేలీలో హింస తరువాత రాంపూర్ ఎంపీ ఆజంఖాన్ ను కలవడానికి అఖిలేష్ ను బరేలీ విమానాశ్రయంలో దిగాడు. అయితే ఆయన బరేలీలో ఉన్న ఏ ముస్లిం నాయకుడిని కలవలేదు.
అదేవిధంగా ఆజంఖాన్, ఇర్పాన్ సోలంకి వంటి నాయకులపై చర్య తీసుకునే సమయంలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బలంగా వ్యతిరేకించలేదని విమర్శలు ఉన్నాయి.
కాలక్రమేణా ఈ నాయకులు ఎస్పీ చీఫ్ తో తాము కొనసాగుతున్నామని సంకేతాలు ఇచ్చారు. అఖిలేష్ మద్దతు ఇస్తున్నప్పుడూ చట్టపరమైన అడ్డంకులు ఉదహరించారు.
అయితే సమాజ్ వాదీ పార్టీ సవరించిన వ్యూహంతో అఖిలేష్ కార్యక్రమాలు అన్ని పీడీఏ కేంద్రంగానే ఉన్నాయి. ముస్లిం ఓటర్ల గురించి ప్రత్యేకంగా ప్రకటన ఏం రాలేదు. ఇది కూడా రాజకీయ వ్యూహాన్ని బయటకు తెలుస్తుంది.
ఎస్పీ- కాంగ్రెస్ కు మద్దతు..
లోక్ సభ ఎన్నికల సమయంలో అఖిలేష్ పీడీఏ నినాదం ఇస్తునే ముస్లింలకు తక్కువ టికెట్లు ఇచ్చారు. మొరాదాబాద్ లో ఎస్టీ హసన్ కు టికెట్ నిరాకరించి, బదులుగా రుచి వీరాను పోటీకి దింపాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
జైలులో ఉన్న నాయకుడు ఆజంఖాన్ ఆదేశం మేరకు టికెట్ కేటాయించారని చెప్పుకున్నప్పటికీ హసన్ మద్దతుదారులు ఆ నిర్ణయాన్ని నిరసించారు. ఒక ముస్లిం నాయకుడిని తొలగించడంపై సాధారణ ముస్లింలలో కూడా విస్తృత చర్చ జరిగింది.
అయినప్పటికీ ఎన్నికల సమయంలో ముస్లిం ఓటర్ల అఖిలేష్ కు మద్దతుగా నిలిచారు. లోక్ నీతి సీఎస్డీఎస్ డేటా ప్రకారం.. 92 శాతం ముస్లిం ఓటర్లు లోక్ సభలో ఎన్నికల్లో ఎస్పీ- కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడం చుట్టూ రేకేత్తిన వివాదం కూడా కీలక పాత్ర పోషించింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముస్లిం ఓటర్లను తన శిబిరంలోకి ఆకర్షించాలని ఓవైసీ ఇప్పుడు కోరుకుంటున్నారు. అందుకే అఖిలేష్ కు ఆయన నేరుగా సవాల్ చేస్తున్నారు. అఖిలేష్ వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడదని, ముస్లిం రాజకీయ నాయకత్వం ముందుకు రావాలని ఆయన గట్టిగా వాదిస్తున్నారు.
ముస్లింల వాటా..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత యూపీపై ఎంఐఎం దృష్టి పెడుతుందని, బీజేపీని ఓడించడమే ఎంఐఎం లక్ష్యమని పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ అసిమ్ వకార్ అన్నారు.
అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వారు ఒకటి చెబుతున్నారు.. మరొకటి చేస్తున్నారు. దళితులకు వారి వాటా దక్కుతోంది.. అగ్రవర్ణ ఓటర్లు బీజేపీకి సపోర్టు చేస్తున్నారు.. ముస్లింలు మాత్రం అనాథలా మారారని చెప్పారు.
ఎస్పీకి ఎంఐఎం గురించి ఆందోళన లేదు..
ఓవైసీ ప్రకటనపై ఎస్పీ స్పందించింది. బీజేపీకి బీ టీంగా పనిచేస్తున్నారనే అపవాదు ఆ పార్టీకి ఉందని ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చంద్ అన్నారు. మేము ఓవైసీ గురించి ఆందోళన చెందడం లేదని అన్నారు. బీజేపీతోనే ఎంఐఎం ఉందని తాము నమ్ముతున్నామని చెప్పారు.
‘‘అతను 2022 లో కూడా యూపీలో పోటీ చేసి ఏం సాధించలేకపోయాడు. బీహార్ లో విజయం సాధించడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అక్కడ పీడీఏ సరిగా ఫర్ పామ్ చేయలేదు’’ అన్నారు.
ఓవైసీ+మాయవతి కలుస్తారా?
ఉత్తర ప్రదేశ్ లో ఓవైసీ అసాధారణమైన ఫలితాలను సాధించలేకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చారిత్రాత్మకంగా ఉత్తరప్రదేశ్ లో ముస్లిం ఓటింగ్ సరళి ప్రకారం.. ఓటర్లు బీజేపీని ఓడించడానికి ఉత్తమ స్థానంలో ఉన్న అభ్యర్థికి మద్దతు ఇస్తారని తెలుస్తోంది.
అయితే ఓవైసీ కొన్ని సీట్లపై ఫలితాలను ప్రభావితం చేయగలడని విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయవతి మద్దతు ఆయనకు లభిస్తే సమీకరణం కొంతవరకు మారవచ్చు.
ఇటీవల ఓవైసీ మాయావతిని ప్రశంసించడంతో ఈ అవకాశం అందరి దృష్టిని ఆకర్షించింది. మాయావతి తన లక్నో ర్యాలీ ద్వారా రాజకీయ పునరాగమనం సాధ్యమవుతుందని సంకేతాలిచ్చారు. ముస్లింలకు మద్దతు ఆమెకు ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో ప్రయోజనం చేకూరుస్తుంది. బీఎస్పీ ప్రస్తుత పరిమితి స్థానాన్ని బట్టి చూస్తే అటువంటి అవకాశం కనిపిస్తోంది.
Next Story

