మూడు రోజుల్లో ప్రధాని పేరు చెప్తాం: జైరాం రమేష్
x

మూడు రోజుల్లో ప్రధాని పేరు చెప్తాం: జైరాం రమేష్

2004 లో లాగే ఈసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా ప్రధాని పేరును ప్రకటిస్తామని అన్నారు.


లోక్ సభ ఎన్నికల్లో ఇండి కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని, ఐదు సంవత్సరాలకు ఒకరే ప్రధానిగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఇండి కూటమి గెలిస్తే ఐదు ఏళ్లలో ఐదుగురు ప్రధానులు అని ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మూడు రోజుల్లో ప్రధాని పేరును ఇండి కూటమి ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. ఆరో విడత ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. దేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చివరి దశ ఎన్నిక జూన్ 1న జరగనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ర్యాలీలలో ఇండి కూటమి లక్ష్యంగా పదే పదే విమర్శలు గుప్పించారు, అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు కావాలని ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
జూన్ 4న ఇండియా కూటమికి "స్పష్టమైన, నిర్ణయాత్మకమైన మెజారిటీ" లభిస్తుందని, 2004లో లాగానే 20 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం అవుతుందని రమేష్ ధీమా వ్యక్తం చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికలలో 'ఇండియా షైనింగ్' ప్రచారం జరిగినప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ అధికారంలోకి వచ్చిందని, బిజెపిని గద్దె దింపిందని గుర్తు చేశారు.
"2004లో ఇదే విధమైన ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా చేస్తున్నారు. అప్పట్లో మేము అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లో మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా ప్రకటించాం. నేను ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే"ఈసారి మూడు రోజులు కూడా ఉండవు," అని రమేష్ చెప్పారు "ప్రభుత్వాన్ని నడపడానికి ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు ప్రధానమంత్రిగా ఉంటాడు" అని అన్నారు.
ప్రధాని అభ్యర్థిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఇండి కూటమి సభ్యులే ఎంపిక చేస్తారని తెలిపారు. మన దేశంలో ఎన్నికలు అందాల పోటీ కాదని, మన దేశంలో ఎన్నికలు పార్టీల మధ్య జరుగుతాయని, మన ప్రజాస్వామ్యం, పార్టీ కేంద్రీకృతమైందే తప్ప వ్యక్తి కేంద్రీకృతం కాదని రమేష్ అన్నారు.
"ఇందువల్ల ఎవరు ప్రధానమంత్రి అవుతారనేది తప్పు ప్రశ్న. ఏ కూటమి అధికారంలోకి వస్తుందనేది సరైన ప్రశ్న" అని పంజాబ్- హర్యానా ఉమ్మడి రాజధానిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
హర్యానాలోని మొత్తం 10 స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనుండగా, పంజాబ్‌లోని 13 స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఏకైక స్థానానికి జూన్ 1న పోలింగ్ జరగనుంది. “ ఇప్పటి అందుతున్న ముందస్తు అంచనాల ప్రకారం చూస్తే, మొదటి రెండు దశల (ఏప్రిల్ 19) పోలింగ్ తరువాత ఇండి కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించబోతోంది" అని రమేష్ చెప్పారు.
428 స్థానాలకు ఐదు దశల పోలింగ్ పూర్తయింది. ఏప్రిల్‌లో జరిగిన మొదటి రెండు దశల ఎన్నికల తరువాత, దక్షిణ భారతదేశంలో, బిజెపి తుడిచిపెట్టుకుపోయిందని, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో దాని ఆధిక్యం సగానికి తగ్గిందని స్పష్టమైంది. , జైరాం పేర్కొన్నాడు.
2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్, ఇండి కూటమి పనితీరు చాలా మెరుగుపడిందని ఆయన అన్నారు.ఏప్రిల్ 19 తర్వాత ప్రధానమంత్రి తన ప్రసంగాల్లో ఉపయోగించే భాషలో మార్పు వచ్చిందని రమేష్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 19 నుండి మోదీ మొత్తం ప్రచారం అంతా హిందూ-ముస్లిం విద్వేశాలపై ఆధారపడి ఉందని అన్నారు. వికసిత భారత్, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, ఎస్సీలు,ఎస్టీలు, ఓబీసీ సమస్యల గురించి మాట్లాడటం లేదని అన్నారు.
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్‌ ముద్ర ఉందని, మత ప్రాతిపదికన కాంగ్రెస్‌ రిజర్వేషన్లు కల్పిస్తుందని ప్రధాని మోదీ బూటకపు ప్రకటనలు చేశారని రమేష్‌ అన్నారు.
Read More
Next Story