‘ఎస్ఐఆర్’ పై ప్రతిపక్ష, అధికార పక్షాలు ఏమన్నాయి?
x
‘సర్’ పై లోక్ సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

‘ఎస్ఐఆర్’ పై ప్రతిపక్ష, అధికార పక్షాలు ఏమన్నాయి?

పాత వాదనే వినిపించిన కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వాలు


పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి ‘సర్ లేదా ఎస్ఐఆర్ లేదా ప్రత్యేక ఎన్నికల జాబితా’ సవరణపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సభలో ప్రతిష్టంభన ఏర్పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సంస్కరణ పేరిట విస్తృత చర్చ జరుపుతామని ప్రకటించింది. మంగళవారం సభలో ఎన్నికల అంశంపై వాడీవేడీ చర్చ జరిగింది.

ఈ అంశంపై నిన్న లోక్ సభ చర్చ ప్రారంభించగానే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా కేంద్రంపై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాయి. అయితే ఎప్పటి లాగే కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వం విపక్ష కాంగ్రెస్ సహ మిగిలిన ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చింది. గందరగోళంగా ఉన్నఈ ప్రక్రియను మరింత గజిబిజిగా మార్చే ప్రయత్నం కేంద్రం చేస్తుందని తక్షణమే అర్థమయింది.
ఎన్నికల సంఘం రాజ్యాంగబద్దమైనది: కేంద్రం
లోక్ సభలో దాదాపు ఎనిమిది గంటల పాటు ‘సర్’ పై చర్చ జరిగింది. ఇందులో కేంద్రం మునుపటి వాదనకే కట్టుబడి ఉంది. బీహార్ లో ‘సర్’ ప్రారంభించిన తరువాత ఎలాంటి వైఖరిని ప్రకటించిందో సభలో దానినే కొనసాగించింది.
ఈ ప్రక్రియ పూర్తిగా ఎన్నికల కమిషన్ అధికార పరిధిలోకి వస్తుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం జవాబుదారీ కాదని స్పష్టం చేసింది. అలాగే చొరబాటుదారులను తొలగించడానికి, ఓటర్ల జాబితాను శుద్ధి చేయడానికి అవసరమని పేర్కొంది. గత పార్లమెంట్ సెషన్ ఇలాగే వృథా చేశారని కేంద్రం విపక్షాలపై మండిపడింది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజీవ్ రంజన్ సింగ్ లాలన్, నిషికాంత్ దూబే, పీపీ చౌదరి, సంజయ్ జైస్వాల్ వంటి ఎంపీలు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ఇచ్చిన సూచనలతో వీరు సభలో గట్టిగా తమ వాదనలు వినిపించారు. ఇటీవల బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సహ ఇండి కూటమిలో మిగిలిన పక్షాలు ఎస్ఐఆర్ లేదా సర్ పై చేసిన విషప్రచారాన్ని ప్రజలు అంగీకరించలేదని, దీనికి ప్రజా ఆమోదం లభించిందని చెప్పారు.
నెహ్రూ... ఇందిరా గాంధీ
ఎన్నికల్లో దుర్వినియోగం అనేది తాము ఓడిపోయినప్పుడు మాత్రమే విపక్షాలకు కనిపిస్తాయని, అప్పుడే ఎన్నికల యంత్రాంగం పై నిందలు వేస్తారని ఎన్డీఏ విరుచుకుపడింది. కేంద్రం ప్రభుత్వం ఇదే అంశంపై ఇందిరాగాంధీ అంశాన్ని కూడా లేవనెత్తింది.
లోక్ సభ ఎన్నికల్లో అధికారాన్ని దుర్వినియోగపరిచినందుకు అలాహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసిందని, దానితో రాజ్యాంగాన్ని రద్దు చేసి అత్యవసర పరిస్థితి విధించారని విమర్శించారు.
చరిత్రలో మరింత వెనక్కి వెళ్లి జవహర్ లాల్ నెహ్రూ ఎన్నికను కూడా బయటకు తెచ్చారు. నిజమైన ఓట్ చోరి నెహ్రూ చేశారని, ఆయను అప్పటి రాష్ట్ర పీసీసీలో ఒక్కరు కూడా ప్రధానిగా ఎన్నుకోలేదని అయినప్పటికీ ఓట్ చోరి ద్వారా ప్రధానిగా పగ్గాలు చేపట్టారని సంజయ్ జైస్వాల్ విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఇతర వ్యక్తులు సర్ గురించి లేదా ఈసీ గురించి ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత క్షీణిస్తున్న సమయంలో వస్తున్న ప్రశ్నలకు కేంద్రం నిజానికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ వాటిని లోక్ సభలో కేంద్రం పంచుకోవడానికి ఇష్టపడట్లేదు. బదులుగా ఎదురు దాడి వ్యూహంతో ముందుకు వచ్చింది.
భవిష్యత్ పరిష్కరాలు ఏంటీ?
ప్రతిపక్షాలు ఎన్నికల్లో విశ్వసనీయతను పెంచడానికి కొన్ని పరిష్కారాలతో ముందుకు వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వాటిని క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో ఓట్ చోరీ ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఇది దేశ ప్రజాస్వామ్య విధానాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోల్ ప్యానెల్ లో దాచడానికి ఏం లేకపోతే రాజకీయ పార్టీలకు మెషిన్ రీడబుల్ ఓటర్ జాబితాను ఎందుకు అందించడం లేదు.
కేంద్రం రహస్యంగా ఆమోదించిన చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్లకు ఎందకు రక్షణ కల్పించారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిన 45 రోజుల దాకా పుటేజీ అందుబాటులో ఉంటుంది.
అభ్యర్థులకు ఏమైన అనుమానాలు ఉంటే ఆ లోపు వాటిని తీసుకోవచ్చు. కానీ దీనిని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారు. రాజకీయా పార్టీలు ఈవీఎంల నిర్మాణాన్ని పరిశీలించడానికి అనుమతించాలని రాహుల్ గాంధీ గట్టిగా డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు నగదు బదిలీలు..
ఈ అంశంపై మిగిలిన విపక్షాలు కూడా ఇవే డిమాండ్లు వినిపించాయి. ప్రధానమంత్రి మరో క్యాబినేట్ మంత్రి(ప్రస్తుం హోంమంత్రి) లోక్ సభ లో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేలా తీసుకొచ్చిన 2023 చట్టాన్ని మార్చాలని మరోక కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. దీనిలోకి రాజ్యసభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తికి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అధికారం పక్షం ఎగతాళి చేసింది.
బీహార్ లో ఇటీవల జరిగినట్లుగా ఎన్నికలకు ముందు ప్రజలకు ముందస్తు నగదు బదిలీలను నిలిపివేయాలని చండీగఢ్ ఎంపీ డిమాండ్ చేశారు. ఇది చట్టవిరుద్దం, రాజ్యాంగ విరుద్దమని, అలాగే సర్ ను కూడా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. రాంపూర్ లోక్ సభ స్థానం, ఫరూఖాబాద్, మిల్కిపూర్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటర్లను బెదిరించిందని, ఈసీ ద్వారా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తన ఆరోపణలకు రుజువులతో కూడిన అఫిడవిట్లు దాఖలు చేసినట్లు, కానీ వాటికి ఇప్పటిదాకా సమాధానాలు రాలేదని పేర్కొన్నారు.
సూటిగా ప్రశ్నలు..
ఎన్సీపీ- ఎస్పీ గ్రూప్ కు చెందిన సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, డీఎంకేకు చెందిన దయానిధి మారన్ సహ అనేకమంది ఎంపీలు సూటిగా ప్రశ్నలు, నిర్ధిష్ట సూచనలతో ముందుకు వచ్చారు.
‘‘చొరబాటుదారులు రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను’’ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని అందుకే సర్ చేపడుతున్నట్లు ఎన్నికల సంఘం చెబుతున్నట్లు ప్రభుత్వం స్ఫష్టం చేసింది.
అయితే సర్ ముగిసిన బీహార్ లో ఎంతమంది చొరబాటుదారులను గుర్తించారని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను మీడియా పదేపదే ప్రశ్నించిన దీనికి ఆయన సమాధానం ఇవ్వలేదు. నిషికాంత్ దూబే వంటి బీజేపీ ఎంపీలు చర్చలలో ఎటువంటి వాస్తవాలు చెప్పలేదు.
దీనికి బదులుగా బీహార్, బెంగాల్, జార్ఖండ్ లలో ముస్లింలు, హిందువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి మంగళవారం లోక్ సభలో జరిగిన చర్చల్లో ప్రతిపక్షాలు రాజీపడ్డాయి. వారు ఎన్నికల వ్యవస్థపై స్వగతంగా మారాయి. దీనికి కేంద్రం ధిక్కార స్వరంతో స్పందించింది.
Read More
Next Story