మాక్ డ్రిల్ అంటే ఏంటీ? మే 7న ఏం జరగబోతోంది?
x
శిక్షణలో ఉన్న సైన్యం

మాక్ డ్రిల్ అంటే ఏంటీ? మే 7న ఏం జరగబోతోంది?

రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంశాఖ


దేశం యుద్ధం ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో మే 7 న మాక్ డ్రిల్ లు నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్రాలకు ఆదేశాల జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ రోజు మధ్యాహ్నం హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం నిర్వహించింది.

జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1971 తరువాత కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది.
మే 7న జరగనున్న మాక్ డ్రిల్స్ పై కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి సివిల్ డిఫెన్స్ డీజీ , ఎన్ డీఆర్ఎఫ్ డీజీ సహ అనేకమంది ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు.
‘‘244 జిల్లాలో పౌర రక్షణ కోసం జరుగుతున్న సన్నాహాలను హోం కార్యదర్శి సమీక్షిస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ అధిపతులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.’’ అని జాతీయ మీడియా పేర్కొంది.
ఈ కసరత్తులు యుద్ధం సంభవించినప్పుడూ ఎలా మలుచుకోవాలో ప్రజలకు అవగాహాన కల్పిస్తుంది. ఇందులో భాగంగా వైమానిక దాడుల సైరన్లు మోగుతాయి. నగరాల్లో లైట్లు నిలిపివేయడం, ప్రాథమిక చికిత్సలు, అత్యవసర బృందాలుగా ఏర్పడటం వంటివి ఇందులో వివరిస్తారు.
మాక్ డ్రిల్ అంటే ఏంటీ?
సాధారణంగా పౌర సంసిద్దతలను పరీక్షించడానికి ఒక మాక్ డ్రిల్ ను ప్లాన్ చేస్తారు. ఈ కసరత్తు తక్షణ సంఘర్షణకు సంకేతం కాదని, విస్తృత పౌర రక్షణ ప్రయత్నాల్లో భాగమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కసరత్తు పౌర రక్షణ నియమాలు, 1968 కిందకు వస్తుంది. ఈ వివరాలను హోంశాఖ స్పష్టంగా పేర్కొంది. అయితే మన మాక్ డ్రిల్స్ పై పాక్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
సంక్షిప్తంగా పౌర రక్షణ మాక్ డ్రిల్ అనేది యుద్దం, క్షిపణి దాడులు, వైమానిక దాడులు వంటి అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో పరీక్షించడానికి ఉద్దేశించిన ఒక సన్నద్దత కార్యక్రమం.
మాక్ డ్రిల్ లో ఏమి జరగుతుంది..
మొదట సరిహద్దుకు దగ్గర ఉన్న నగరాలు, దాడులకు ఆస్కారం ఉన్న నగరాల్లో వెంటనే లైట్లు ఆర్పివేస్తారు. కంట్రోల్ రూములు, షాడ్ కంట్రోల్ రూములు కార్యచరణ పరీక్షించడానికి భారత వైమానిక దళంతో హాట్ లైన్, రేడియో కమ్యూనికేషన్ లింకులు నిర్వహిస్తారు.
శత్రుదాడి జరిగినప్పుడూ తమను తాము రక్షించుకోవడానికి పౌరులు, విద్యార్థులు మొదలైన వారికి పౌర రక్షణ అంశాలపై శిక్షణ ఇవ్వబడుతుంది. పౌర రక్షణ సేవలు, ముఖ్యంగా వార్డెన్ సేవలు, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ వంటి వాటిని అప్రమత్తం చేస్తారు.
క్రాష్ బ్లాక్ అవుట్ చర్యలు..
కొన్ని కీలక ప్రాంతాలలో కీలక భారీగా పెంచిన వృక్షాలు వాటి భౌతిక స్వరూపాలను బయటకు తెలియజేయడంలో అడ్డుపడుతుంటాయి. ఈ డ్రిల్ లో ప్రణాళికలు రచించడం, రిహార్సల్, బంకర్లు, కందకాలు వంటి వాటిని శుభ్రపరుస్తారు.
అత్యవసర బృందాలు నిజ సమయంలో పనిచేస్తాయి. యుద్దం లాంటి అత్యవసర పరిస్థితులకు సిద్దం కావడానికి ప్రజా శిక్షణా సమావేశాలు నిర్వహించబడతాయి.
డ్రిల్ లక్ష్యం..
ఈ కసరత్తులు భయాందోళనలు తగ్గించడం, గందరగోళాన్ని నివారించడం, అవగాహాన, సంసిద్దతను పెంచడం ద్వారా పౌరుల ప్రాణాలను కాపాడుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. శత్రుదాడి జరిగినప్పుడూ పౌరులను రక్షించడంలో కూడా ఇది సాయపడుతుంది.
‘‘వివిధ పౌర రక్షణ చర్యల కార్యచరణ సామర్థ్యాన్ని, కార్యాచరణ సమన్వయాన్ని అంచనా వేయడానికి ఈ పౌర రక్షణ డ్రిల్స్ ముఖ్య లక్ష్యం’’ అది హోంశాఖ తెలిపింది.
ఎన్ని జిల్లాల్లో చేయబోతున్నారు..?
దేశంలోని 244 జిల్లాలోని పౌర రక్షణ జిల్లాల్లో మే 7న ఈ మాక్ డ్రిల్ కసరత్తులు నిర్వహించాలని హోంశాఖ నిర్ణయించింది. దేశంలోని రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య వంటి సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న ఈ జిల్లాలు బహుళ ప్రమాద దృశ్యాలను అనుకరిస్తూ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇందులో దేశంలోని ప్రాంతాలను మూడు విభాగాలు విభజించారు. కేటగిరి వన్ లో ఢిల్లీ తోపాటు, ముంబై, గుజరాత్ వంటి సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి.
ప్రస్తుత భౌగోళిక- రాజకీయ కోణంలో ఇది కొత్త, సంక్షిష్టమైన ముప్పులను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కచ్చితమైన పౌర రక్షణ సంసిద్దతను నిర్వహించడం మంచి చర్య అని డైరెక్టరేట్ జనరల్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డ్స్ నుంచి వచ్చిన సమాచారం పేర్కొంది.
ఈ కసరత్తులు పెద్ద నగరాల మొదలు గ్రామస్థాయి వరకూ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కంట్రోలర్ వివిధ జిల్లా అధికారులు, పౌర రక్షణ వార్డెన్లు, హోమ్ గార్డ్స్, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, పాఠశాల, కళాశాల విద్యార్థులు చురుకుగా పాల్గొనబోతున్నారు.
భారత్ ఏం ప్రకటించింది..
ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు, అందులో కేవలం హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కుట్రలో భాగస్వాములైన వారిని భూమి చివరల వరకూ వెంటాడి, వారి ఊహకు సైతం అందని విధంగా శిక్ష విధిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Read More
Next Story