కొత్త మంత్రిమండలితో పాత సందేశం ఇస్తున్నారా?
x

కొత్త మంత్రిమండలితో పాత సందేశం ఇస్తున్నారా?

కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అయితే మంత్రులుగా మెజారిటి పాత వారినే ఆయన తన టీంలోకి చేర్చుకున్నారు.


దేశంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇంతకుముందు ప్రధాని పదవికి వరుసగా మూడు సార్లు ప్రమాణస్వీకారం చేసిన నెహ్రూ రికార్డును ఆయన సమం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరాక బీజేపీ మిత్రపక్షాలకు ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుందనే ఊహగానాలను పటాపంచలు చేస్తూ కమల దళమే ఎక్కువ సంఖ్యలో, కీలకమైన మంత్రిత్వ శాఖలను తన దగ్గరే పెట్టుకునే సాంప్రదాయం కొనసాగించింది.

పెద్ద సంఖ్యలో..
70 మందికి పైగా ఎంపీలు ఆదివారం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌డిఎ మిత్రపక్షాలకు చెందిన కనీసం 11 మందికి ఇందులో కేబినోట్ హోదా దక్కింది. కేవలం ఎన్సీపీ చీలిక పార్టీకి మాత్రమే ఇందులో చోటు దక్కలేదు. 2019 లో దాదాపు 53 మంది నేతలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య పెరిగింది.
“మంత్రి మండలిలో బీజేపీకి అత్యధిక సంఖ్యలో మంత్రులు ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA). అయితే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని విపక్ష ఇండి కూటమి దింపుడుకళ్లేం ఆశలు పెట్టుకుందని అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రతిపక్ష కూటమి కలిసి ఉండబోతుందో లేదో స్ఫష్టత లేదని ” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి RP సింగ్ ది ఫెడరల్‌తో అన్నారు.
“ప్రతిపక్షం గందరగోళంలో ఉంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంపై మాకు ఇండి కూటమి నుంచి ఎలాంటి పాఠాలు అవసరం లేదు. NDA ఎల్లప్పుడూ తన జాతీయ విధులను నిర్వహిస్తుంది. ఇప్పుడు కూడా అది ఐక్య రాజకీయ శక్తిగా మిగిలిపోయింది, అయితే ప్రతిపక్ష కూటమి విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. రాబోయే రోజుల్లో, దేశంలోని ప్రజలు ఎన్డీయే ఎలా కలిసి ఉందో చూస్తారు కానీ ప్రతిపక్ష కూటమి విచ్ఛిన్నమవుతుంది, ” అని సింగ్ అన్నారు.
రాష్ట్రానికి.. కేంద్రం
ఆసక్తికరమైన విషయమేమిటంటే, బిజెపికి చెందిన అత్యధిక కేంద్ర మంత్రులను పునరావృతం చేయడం ద్వారా మోదీ కొనసాగింపు సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. కొత్తగా చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. వీరు తొలిసారిగా కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ సీనియర్‌ నేతలైన చౌహాన్‌, ఖట్టర్‌లను కేబినెట్‌లోకి తీసుకోవడం, ఆయా రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్‌ నేతలంతా ఇప్పుడు తమ స్థావరాన్ని ఢిల్లీకి మార్చుకున్నట్లు అయింది. ప్రధాని మోదీ అభిమతం కూడా అదే. జాతీయ ప్రభుత్వంలో వీరి సేవలను గణనీయంగా ఉపయోగించుకోవాలని ఆయన వాంఛగా ఉందనేది సుస్పష్టం.
JD(U) అరంగేట్రం..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య ఉన్న విభేదాలు సమసిపోయినట్లు కనిపిస్తున్నాయి. దాదాపు దశాబ్ధం తరువాత ఈ బీహార్ పార్టీ కేంద్రమంత్రి వర్గంలో చేరింది.
మోదీ మంత్రి మండలిలో సభ్యుడిగా సీనియర్ నేత లాలన్ సింగ్‌ను నితీష్ కుమార్ ఎంపిక చేశారు. ఈ ఎంపిక ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే బీహార్‌లోని బీజేపీ నాయకులకు, జేడీయూ మధ్య సంబంధాలు క్షీణించడానికి ప్రధాన కారణం లాలన్ సింగ్ అని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయినప్పటికీ నితీష్ ఆయన్నే ఎంపిక చేశారు. మరోవైపు మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక బీహర్ కు మంచి ప్రయోజనం కలుగుతుందని సీనియర్ జేడీయూ నాయకులు భావిస్తున్నారు. తమ స్థాయిలో ఒక కేంద్ర మంత్రి ఉండటం వల్ల మంచి సమన్వయం, చర్చలకు అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.
‘‘రాబోయే రోజుల్లో బీహార్ యావత్ దేశానికి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ JD(U) నాయకులు ఉండటం వల్ల బీహార్ ప్రజలకు మెరుగైన నిధులు అంది అభివృద్ధి పరుగులు తీస్తుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్ ప్రజలకు సరైన దిశలో ఇది మంచి ముందడుగు” అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ నిషాద్ ది ఫెడరల్‌తో అన్నారు.
నాయుడు సమక్షంలో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడం కేంద్రంలో ప్రాంతీయ పార్టీ పునరాగమనాన్ని సూచిస్తుంది. దాదాపు ఆరేళ్లుగా బీజేపీ నాయకత్వానికి, నాయుడుకు మధ్య ఉన్న రాజకీయ పోరుకు ఇది తెరపడింది.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం అంగీకరించకపోవడంతో 2018లో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. మరో వైపు బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీశ్‌కుమార్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి మరోసారి బీజేపీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీ పునర్వ్యవస్థీకరణ
మోదీ 3.0 ప్రభుత్వంలో చేరడానికి బిజెపి నాయకత్వం నుంచి ఎవరికి పిలుపు వస్తుందనే ఊహాగానాలకు ముగింపు పలికారు, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ ఆశ్చర్యకరంగా పిలుపురాలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కొందరు సీనియర్ నాయకులు లేకపోవడం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరిగి కేబినెట్ మంత్రిగా రావడం, రాబోయే రోజుల్లో పార్టీ పెద్ద సంస్థాగత మార్పుకు సిద్ధంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.
నడ్డా పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుండడంతో, బిజెపి నాయకత్వం కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంది. ప్రస్తుతం ఠాకూర్, ఇరానీలను పార్టీ పాత్రకు బలోపేతానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఆందోళనలు..
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పనితీరుపై ఆ పార్టీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పద్దెనిమిది మంది కేంద్ర మంత్రులు ఎన్నికలలో ఓడిపోయారు. దశాబ్దంలో మొదటిసారిగా, బిజెపి సొంతంగా మెజారిటీని పొందలేకపోయింది. అయితే, పార్టీ సంస్థలో మార్పులు, దానికి సంబంధం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
'మంత్రి మండలి నుంచి ప్రముఖ నేతలను తప్పించడం ప్రధాని మోదీకి కొత్త కాదు. జేపీ నడ్డాను పార్టీలోకి పంపినప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉన్నారు. అదేవిధంగా, మాజీ కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, పురుషోత్తం రూపాలా, రాజీవ్ ప్రతాప్ రూడీ వంటి వారందరినీ ప్రభుత్వం కాకుండా పార్టీ కోసం పని చేయాలని కోరారు, ”అని మధ్యప్రదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ డైరెక్టర్ యతీంద్ర సింగ్ సిసోడియా ది ఫెడరల్‌తో అన్నారు.
Read More
Next Story