వైట్ కాలర్ టెర్రర్: సోషల్ మీడియాను ఉపయోగించిన తీవ్రవాదులు
x
జేకేలో పహరా కాస్తున్న భద్రతా దళాలు

వైట్ కాలర్ టెర్రర్: సోషల్ మీడియాను ఉపయోగించిన తీవ్రవాదులు

2019 నుంచి జేఎం ఉగ్రవాదులతో టచ్ లో ఉన్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యుల్


ఎర్రకోట పేలుడుతో సంబంధం ఉన్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ పై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ చేస్తున్నారు. ఈ తీవ్రవాదంతో సంబంధం ఉన్న వైద్యులు 2019 నుంచి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా రాడికలైజ్ అవుతున్నారని అధికారులు గుర్తించారు.

పాకిస్తాన్ తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి పనిచేస్తున్న హ్యండ్లర్ల ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు గుర్తించారు. కేవలం ఉన్నత విద్యావంతులైన నిఫుణులను పూర్తిగా డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి ఉగ్రవాదులుగా మార్చారని తెలిపారు.

బ్రెయిన్ వాష్ చేయడం..
డాక్టర్ ముజమ్మిల్ గనై, డాక్టర్ ఆదిల్ రాథర్, డాక్టర్ ముజఫర్ రాథర్, డాక్టర్ ఉమర్ ఉన్ నబీ వంటి ఉగ్రవాద సెల్ సభ్యులు మొదట సరిహద్దు అవతల ఉన్న హ్యండ్లర్లు గుర్తించారు. వారు ఫేస్ బుక్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఎక్స్ లో నిర్వహించిన చర్చాలలో పాల్గొనేలా చేశారు. ఇందులో పాల్గొన్న ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నవంబర్ 10 న ఢిల్లీలో పేలుడుకు పాల్పడ్డాడు.
ఉగ్రవాద హ్యండ్లర్లు వెంటనే వైద్యుల బృందాన్ని వెంటనే టెలిగ్రామ్ గ్రూపులోకి మార్చారు. అక్కడే బ్రెయిన్ వాష్ ప్రారంభించారని అధికారులు గుర్తించారు. ఎర్రకోట పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గనై, అదీల్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఇందులోని కీలక సభ్యుడైన ముజఫర్ ఈ సంవత్సరం ఆగష్టులో ఆప్ఘనిస్తాన్ కు పారిపోయాడు. అతని బహిష్కరణ ప్రక్రియను ఇప్పటికే జేకే పోలీసులు ప్రారంభించారు. ఈ కేసు ద్వారా మొత్తం ఉగ్రవాద మాడ్యూల్ ను పూర్తిగా ఛేదించడానికి వీలు కల్పించింది.
ఉగ్రవాద దాడుల కోసం ఐఈడీ బాంబుల తయారీకి యూట్యూట్ వీడియోలను విస్తృతంగా ఉపయోగించారు. విచారణ సమయంలో విశ్లేషించిన డిజిటల్ పరికరాల ప్రకారం ప్రాథమిక హ్యండ్లర్లు గా ఉకాసా, ఫైజాన్, హష్మీగా గుర్తించాయి. వీరు భారత్ లో ఉండకుండా విదేశాలలో ఉండి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
వీరు పాక్ కేంద్రంగా ఉన్న జైష్ ఏ మహ్మద్(జేఎం) లో కీలక సభ్యులుగా ఉన్నారు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థలలో చేరాలని వైద్యులు తమ అభిప్రాయాలను వారి ముందు వ్యక్తం చేశారని, కానీ వీరిని భారత్ లోనే ఉండి విధ్వంసం సృష్టించాలని నూరిపోసినట్లు సమాచారం.
ఉగ్రవాద మాడ్యూల్ ఛేదన..
జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఉత్తర ప్రదేశ్, హర్యానాలోని వారి సహచరులతో కలిసి నిర్వహిస్తున్న వైట్ కాల్ ఉగ్రవాద మాడ్యుల్ ను నిర్వహించిన వైద్యుల గుట్టును రట్టు చేశారు. ఇది ఏకంగా ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చేరింది. అక్కడ ఉగ్రవాదులు నిల్వచేసిన 2900 కిలోల పేలుడు పదార్థాల జాడను వారు కనుగొన్నారు.
అక్టోబర్ 18-19 మధ్య రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనగర్ సమీపంలో జేఎం పోస్టర్లు కొంతమంది అతికించారు. వీటిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్ కు చేరింది.
శ్రీనగర్ పోలీసులు ఈ విషయాన్ని కేవలం సంఘటనగా కాకుండా తీవ్రమైన సమస్యగా గుర్తించారు. సీనియర్ సూపరిడెంటెండ్ జీవీ సందీప్ నేతృత్వంలోని బృందం లోతుగా దర్యాప్తు ప్రారంభించింది.
డిజిటల్ ప్లాట్ ఫాం లో నియమాకాలు..
2018 లో సోషల్ మీడియా రాడికలైజేషన్ పద్దతిలో ఉగ్రవాద గ్రూపులు వ్యూహాత్మక మార్పును తీసుకొచ్చాయి. భద్రతా చర్యలు పెంచడం వల్ల ప్రత్యక్షంగా కలుసుకోవడం కష్టంగా మారడంతో డిజిటల్ ప్లాట్ ఫాంలో ద్వారా కార్యకలాపాలు నిర్వహించారు. తరువాత టెలిగ్రామ్ యాప్ ద్వారా మోసపూరిత, మార్పు చేసిన కంటెంట్ నూ చూపించి వారిని ఉగ్రవాదులుగా మార్చారు.
Read More
Next Story