‘‘అమెరికా ఇచ్చిన మిలియన్ డాలర్లు, దేశంలో ఎవరికి అందాయి?’’
x

‘‘అమెరికా ఇచ్చిన మిలియన్ డాలర్లు, దేశంలో ఎవరికి అందాయి?’’

ప్రధాని ఆర్థిక సలహామండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్


భారత్ లో ఓటర్ల సంఖ్యను మెరుగుపరచడానికి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ 21 మిలియన్ డాలర్లను అందించినట్లు ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ బయటపెట్టిన నేపథ్యంలో భారత సీనియర్ అధికారి స్పందించారు. ఈ డబ్బంతా దేశంలో ఎవరికి అందిందని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు లో ప్రశ్నించారు.

‘‘భారత్ లో ఓటర్ల సంఖ్యను మెరుగుపరచడానికి యూఎస్ ఇచ్చిన 21 మిలియన్ డాలర్లు ఎవరికి అందాయో తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ ఆర్ధిక సలహామండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ ఎక్స్ లో పోస్టు చేశారు.

డోజ్ ప్రకటన..
బిలియనీర్ ఎలోన్ మస్క్ నేతృత్వంలోని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియేన్సీ(డీఓజీఈ, డోజ్) పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి జరుగుతున్న అనేక చెల్లింపులను నిలిపివేసినట్లు ప్రకటించిన తరువాత సన్యాల్ ఈ పోస్ట్ చేశారు.
భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి 21 మిలియన్ డాలర్లను, బంగ్లాదేశ్ లో రాజకీయ దృశ్యాన్ని బలోపేతం చేయడానికి 29 మిలియన్ డాలర్లు, నేపాల్ లో ఆర్థిక సమాఖ్యవాదాన్ని ప్రొత్సహించడానికి 20 మిలియన్ డాలర్ల వెచ్చినట్లు డోజ్ వెల్లడించింది.
అతిపెద్ద కుంభకోణం..
‘‘యూఎస్ పన్ను చెల్లింపుదారుల చెల్లించిన మొత్తాన్ని కింది వాటిపై ఖర్చు చేయబోతున్నారు. అయితే అవన్నీ రద్దు చేస్తున్నాం’’ అని డోజ్ కమిటీ ప్రకటించింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక చెల్లింపులను జాబితా చేస్తున్నామని అన్నారు. బంగ్లాదేశ్, నేపాల్ లకు చేసినట్లుగా చెబుతున్న చెల్లింపులపై సన్యాల్ సందేహాలను లేవనెత్తుతూ ‘‘యూఎస్ఏఐడీ మానవ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం’’ అని చమత్కరించారు.
మీడియాకు ఎందుకు..
మరోక పోస్టులో భారత ప్రధాన మీడియాను సన్యాల్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. యూఎస్ ఎయిడ్ ఇచ్చిన డబ్బుతోనే వారు పని చేస్తున్నారా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయ జోక్యం చేసుకోవడానికి యూఎస్ ఎయిడ్ నుంచి వచ్చిన నిధులను డోజ్ బయటకు తీయడం వారికి ఇబ్బందిగా కనిపిస్తుందని అన్నారు.
బీజేపీ ప్రతిస్పందన..
డోజ్ ఇచ్చిన సమాచారంతో బీజేపీ కూడా కాంగ్రెస్, అప్పటి యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ‘‘ ఓటర్ల ఓటింగ్ 21 మిలియన్ డాలర్లు ఇవ్వడం కచ్చితంగా దేశ ఎన్నికల ప్రక్రియలో బాహ్య శక్తుల జోక్యం. దీనివల్ల ఎవరికి లాభం? కచ్చితంగా అధికారిక పార్టీకి అయితే కాదు.’’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.
భారత ఎన్నికల్లో ప్రభావితం చేయడానికి అమెరికా పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని అన్నారు.
అంతకుముందు ప్రతి లోక్ సభ సమావేశాలకు ముందు అమెరికా నుంచి ఏదో ఒక నివేదిక అందేదని, దాన్ని తీసుకుని విపక్షాలు సభలో గందరగోళం సృష్టించేవని అంతకుముందు బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఆరోపించారు. రెజిమ్ ఛేంజ్ పాలసీలో భాగంగా దేశంలో అధికార పార్టీని మార్చడానికి ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో కొన్ని ఆరోపణలు వినిపించాయి.
Read More
Next Story