మన తదుపరి ప్రధాని ఎవరంటే.. అరవింద్ కేజ్రీవాల్ జోస్యం..
x

మన తదుపరి ప్రధాని ఎవరంటే.. అరవింద్ కేజ్రీవాల్ జోస్యం..

బీజేపీలో మోదీ అమలు చేస్తున్న 75 ఏళ్ల రిటైర్ మెంట్ నిబంధన, ప్రధాని మోదీ విషయంలో అమలవుతుందని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేేపీ నేతలు తన వ్యాఖ్యలకు


బీజేపీ లో అధికారికంగా అమలు చేస్తున్న 75 ఏళ్ల వయస్సు నిబంధనలు మోదీ విషయంలో అమలు చేసి, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను ప్రధాని చేసే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తను అమలు చేసిన నియమాలు తనకు మాత్రం వర్తించబోవని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారని, ఇదే రూల్ ను బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీపై ఉపయోగించారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. మోదీ సెప్టెంబర్ 2024తో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారని అన్నారు.

75 ఏళ్లు నిండిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ప్రధాని మోదీ ఏమీ మాట్లాడలేదని, ‘ఒకే నాయకుడు, ఒకే దేశం’ అనే ఆలోచనతో ప్రతిపక్ష నేతలను జైలుకు పంపుతున్నారని ఆయన విమర్శించారు. చాలామంది భారతీయ జనతాపార్టీ నాయకులు తన వ్యాఖ్యలకు మద్ధతుగా వస్తున్నారని, అయితే మోదీ మాత్రం తన 75 ఏళ్ల రిటైర్ మెంట్ నిర్ణయం పై మాత్రం పెదవి విప్పడం లేదన్నారు.
(ఎల్‌కె) అద్వానీజీ పదవీ విరమణ చేసిన నియమం ఆయనకు వర్తించదని ప్రధానే స్వయంగా చెప్పాలని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. త్వరలో బీజేపీ నుంచి ఆయన రిటైర్మెంట్ ఖాయమని, తదుపరి నాయకుడు ఎవరో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు.
'వన్ నేషన్, వన్ లీడర్ తో' ఒకవైపు ప్రతిపక్ష నేతలందరినీ జైలుకు పంపిస్తూనే, మరోవైపు, తన సొంత పార్టీ నాయకులందరి రాజకీయాలను నాశనం చేస్తున్నాడని నేను శనివారం చెప్పాను. ఆయన పార్టీ శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, రమణ్ సింగ్, (ఎంఎల్) ఖట్టర్ సాహబ్‌లను రాజకీయాల నుండి తొలగించారు" అని కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తర్వాతి స్థానంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
'మోదీజీకి 75 ఏళ్ల పాలన వర్తించదని ఆయన పార్టీ నేతలంతా శనివారం అన్నారు. కానీ మోడీజీని తొలగించబోమని ఒక్క నాయకుడు కూడా చెప్పలేదు. కాబట్టి గత 24 గంటల్లో ఒక విషయం ధృవీకరించబడింది. వచ్చే రెండు నెలల్లో యోగీజీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ప్రశ్నకు కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ఢిల్లీలో బీజేపీ అన్ని స్థానాలను కోల్పోతుందని, వాతావరణం అలానే ఉందన్నారు.
అయితే అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఇంతకుముందే హోంమంత్రి అమిత్ షా ఖండించారు. బీజేపీలో ఎటువంటి గందరగోళం లేదని అన్నారు. వచ్చే పది సంవత్సరాలు ప్రధాని పదవి మోదీదే అని ప్రకటించారు.


Read More
Next Story