స్టీవ్ జాబ్స్ భార్యను కాశీ విశ్వేశ్వరుడిని ఎందుకు తాకనివ్వలేదు?
x

స్టీవ్ జాబ్స్ భార్యను కాశీ విశ్వేశ్వరుడిని ఎందుకు తాకనివ్వలేదు?

విదేశీయులను తాకనివ్వకూడదని ప్రోటోకాల్ కారణంగా చెబుతున్న పలువురు


ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళ లో పాల్గొనేందుకు వచ్చిన దివంగత ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావేల్ జాబ్స్ ఆదివారం కాశీలోని విశ్వనాథుడిని దర్శించుకున్నారు. అయితే ఆమెకు కాశీ విశ్వనాథ్ శివలింగాన్ని తాకడానికి అనుమతించలేదు. ఆమె తిరిగి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి అమెరికా వెళ్లబోతోంది. అప్పటి వరకూ ప్రయాగ్ రాజ్ లోని నిరంజిని అఖారా శిబిరంలో ఉండటానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

ప్రోటోకాల్..
దేశంలోని కొన్ని సంప్రదాయాలు ఉన్నాయని, వాటిని పాటించడం మన కర్తవ్యమని ఆధ్యాత్మిక నాయకుడు స్వామి కైలాసానంద గిరి మహారాజ్ వివరించారు. లారెన్స్ తనను గురువుగా, తండ్రిగా భావిస్తోందని ఆయన చెప్పారు. మన దేశ సంప్రదాయాలు, మతపరమైన ఆధ్యాత్మిక విషయాలను ఆమె నేర్చుకోవాలని అనుకుంటోందని పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయాలను ప్రపంచం అంగీకరిస్తోందని చెప్పారు.
కాశీ విశ్వేశ్వరుడని హిందువులు తప్ప ఇతరులు ఎవరూ తాకకూడదనే సంప్రదాయం ఉంది. దాన్ని ఇప్పుడూ ఆలయ అధికారులు పాటించారు. ఇవన్నీ ఆలయ ప్రోటోకాల్ అని స్వామి కైలాసనంద గిరి తెలిపారు. కుటుంబం మొత్తం విశ్వనాథుడిని దర్శనం చేసుకుని అభిషేకం, పూజలు చేసుకున్నారని తెలిపారు.
ఆధ్యాత్మిక ప్రపంచం..
లారెన్స్ ఈ విషయాన్ని పెద్దగా తీసుకోవడం లేదని ఆలయ సంప్రదాయాలను ఆమె గౌరవిస్తారని గంగలో స్నానం చేయడానికి యోచిస్తున్నారని మహారాజ్ పేర్కొన్నారు. ఈ పరిణామాలకు గుర్తుగా తనకు ‘ కమలా ’ అనే ఆధ్యాత్మిక పేరు పెట్టినట్లు తెలిపారు.
లారెన్స్ దేశ సంప్రదాయ దుస్తులను ధరించి ఉండగా, సాంప్రదాయ వాద్యాలతో ఆమె శిబిరానికి స్వగతం పలికారు. సాంప్రదాయ కుల్హాద్ లో టీ అందించగా తాను స్వీకరించారు. తరువాత వ్యాసానంద గిరి మహారాజ్ పట్టాభిషేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
కుంభమేళా ప్రధాన స్నాన ఆచారాలు జనవరి 14న (షామీ స్నాన్), జనవరి 29 మౌనీ అమావాస్య, ఫిబ్రవరి 3 బసంత్ పంచమీ జరుగుతోంది. చివరి రోజు ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళాతో ముగుస్తుంది.
స్టీవ్ జాబ్స్ దేశ అనుభవం..
ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1970ల కాలంలో దేశంలో పర్యటించారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు ఎదురైన కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ఇక్కడకు వచ్చేవారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి ఇష్టంగా వెళ్లేవారు. బాబా 1973లోనే మరణించినప్పటికీ ఆ ఆశ్రమంలోనే అతను ఎక్కువగా గడిపేవాడు. ఆ అనుభవం అతడిని చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది. జాబ్స్.. సరళత దృష్టిని ఆపిల్ డిజైన్, ఫిలాసఫీ ప్రధాన సూత్రాలుగా పేర్కొన్నాడు.
తరువాత తన జీవిత చరిత్రను రాసిన వాల్టర్ ఐజాక్సన్ తో చెబుతూ.. ‘‘ నేను నేర్చుకున్న అంతర్ దృష్టి భారత్ లోని ప్రజలు కేవలం స్వచ్ఛమైన హేతుబద్దమైన ఆలోచనాపరులు మాత్రమే కాదు. గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులకు కేంద్రం.’’. ఆయన భారత్ నుంచి తిరిగి వచ్చిన తరువాత జాబ్స్ తన స్నేహితుడు స్టీవ్ వోజ్నియాక్ తో కలిసి 1976 లో ఆపిల్ కంప్యూటర్ ను స్థాపించారు.
Read More
Next Story