‘మధ్య ప్రదేశ్ బాస్మతి పండించాలంటే.. పాకిస్తాన్ అనుమతి కావాల్సిందేనా’
దౌత్య ఉద్రికత్తలతో అపరిష్కృతంగా బాస్మతి జీఐ ట్యాగ్
సురేంద్ర సింగ్ ప్రసాద్
భారత్ లో బాస్మతి రైస్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో చేరడానికి మధ్య ప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలకు సంవత్సరాలుగా అనేక అడ్డంకులు ఎదురువుతున్నాయి. భౌగోళిక సూచిక వస్తేనే మధ్యప్రదేశ్, మిగిలిన రాష్ట్రాల కూటమిలో చేరి, ఆ పంట పండించడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రమైనప్పటికీ మిగిలిన కేంద్రం నుంచి దానికి ఎలాంటి సహకారం అందట్లేదు. దీనికి పాకిస్తాన్ తో 2008 లో చేసుకున్న ఒప్పందమే కారణం.
మోహన్ యాదవ్ ప్రభుత్వం జీఐ ట్యాగ్ లో న్యాయమైన వాటా కోసం దూకుడుగా లాబీయింగ్ చేస్తోంది. అయితే ఇంతకుముందు పాలనలో ఉన్న నరేంద్ర సింగ్ తోమర్, శివరాజ్ సింగ్ చౌహన్ వంటి వారి వల్ల ఈ పని విజయవంతం కాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ చేస్తుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఈ విషయం అపరిష్కృతంగా ఉంది.
ప్రస్తుతం ఏడు రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ జియో ట్యాగ్ కింద బాస్మతి రైస్ ను పండించే ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. ఈ కూటమిలోకి మధ్యప్రదేశ్ ను రానివ్వడం లేదు.
అనేక సవాళ్లు..
బాస్మతి బియ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒక మధ్యప్రదేశ్ ను చేర్చడం అయితే.. రెండో పాకిస్తాన్ నుంచి. అక్కడ కూడా బాస్మతి బియ్యం బాగా పండిస్తారు. పాకిస్తాన్ కూడా వేరే ప్రాంతాల్లో బాస్మతిని పండించి జీఐ ట్యాగ్ కోసం ప్రయత్నిస్తోంది. వాటిని భారత్ అడ్డుకుంటూ వస్తోంది.
పాక్ లోని 14 జిల్లాల్లో బాస్మతి బియ్యం సాగు కాస్త, ప్రస్తుతం 44 జిల్లాల విస్తరించాలని ప్రణాళికలు వేస్తోంది. దీనికోసం ఆ దేశం ఈయూకు జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసింది. 2022 లోనే ఇలా దరఖాస్తు చేయగా, న్యూఢిల్లీ అడ్డుకుంది. పాకిస్తాన్ వచ్చిన చిక్కమేమిటంటే.. అది నేరుగా ఏ పనిచేయదు. దొంగదెబ్బ తీయడమే దాని లక్ష్యం. అది దాని దరఖాస్తులను ఎప్పుడూ బయటపెట్టదు. ప్రస్తుతం చేసిన దరఖాస్తు కూడా ఈయూనే బయటపెట్టింది. తరువాత భారత్ న్యాయపరమైన పరిష్కారాన్ని కోరింది.
పాకిస్తాన్ కు బ్రేకులు..
పాకిస్తాన్, ఈయూకు చేసిన దరఖాస్తులో ఓ వింతవాదన ప్రతిపాదించింది. పీఓకేలోని కొన్ని జిల్లాలను కూడా ఇందులో చేర్చడంతో వివాదం మొదలైంది. అది మాదేశం కాదని పాకిస్తాన్ చాలా సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా ప్రకటనలు చేసింది.
దానికి విరుద్దంగా బాస్మతి సాగురైస్ పంట విషయంలో దరఖాస్తు చేయడంతో దాని బండారం బయటపెట్టింది. అలాగే 14 జిల్లాల నుంచి 44 జిల్లాలకు విస్తరించాలనే ప్రతిపాదన చేసింది. వాటికి కూడా జీఐ ట్యాగ్ ఇవ్వాలని కోరింది. అలాగే బలూచిస్థాన్ ప్రాంతాన్ని కూడా ఇందులో చేర్చింది.
అయితే ఈ దరఖాస్తుపై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బాస్మతి సాగు రైస్ జాబితాలోకి మధ్య ప్రదేశ్ ను చేర్చినట్లు అయితే అప్పుడు పాకిస్తాన్ చేసిన దరఖాస్తుకు కూడా అనుమతి లభించే అవకాశం ఉంది.
అదనంగా జీఐ ట్యాగ్ లో వేరే రాష్ట్రాలను చేరిస్తే దాని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే ఎంపీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దానిని మద్రాస్ హైకోర్టుకు రిఫర్ చేసింది.
ఉమ్మడి కృషి..
బాస్మతి సాగుపై ఉన్న సమస్యను పరిష్కరించుకోవడానికి 2008 లో భారత్- పాకిస్తాన్ అధికారులు మాట్లాడుకున్నారు. దీనిపై పాకిస్తాన్ లో 14 జిల్లాలకు, మన దేశంలో ఏడు రాష్ట్రాలకు పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాయి.
అలాగే బాస్మతి రైస్ ను పండించడానికి జీఐ ట్యాగ్ కోసం ఇరు దేశాలు సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవాలని సమావేశం తీర్మానించుకున్నాయి. అయితే తరువాత దౌత్య ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇది అలాగే ఉండిపోయింది.
గత ఏడాది శివరాజ్ సింగ్ చౌహన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన తరువాత మధ్య ప్రదేశ్ బాస్మతి బియ్యానికి జిఐ ట్యాగ్ ను పొందే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ రెండు సార్లు సమావేశం అయి, తన అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేసింది.
మధ్య ప్రదేశ్ పోరాటాలు..
నరేంద్ర సింగ్ తోమర్, మోదీ 2.0 టర్మ్ లో వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలోనే బాస్మతి రైస్ ఉత్పత్తికి సంబంధించి జీఐ ట్యాగ్ విషయంలో చర్చలు జరిగాయి. అయితే అవేవీ చివరి వరకూ రాలేదు. ఈ సమస్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా ఐఏఆర్ఐకి చేరింది.
చర్చలు కొనసాగుతున్నాయి. మధ్య ప్రదేశ్ గతంలో మేథో సంపత్తి అప్పిలేట్ బోర్డు, ద్వారా జీఐ గుర్తింపును కోరింది. అయితే దీనిని భారత్, పాకిస్తాన్ రెండు వ్యతిరేకించాయి. తరువాత మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తీర్పు మాత్రం అనుకూలంగా రాలేదు.
చివరకు కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా వాదనలు వినిపించాయి. వాటి మొత్తం భూభాగాల్లో పంటను ఏకరీతిగా పండించనప్పటికీ బాస్మతి ప్రాంతాలుగా పేర్కొన్నారు. అయితే ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు చేరింది.
Next Story