
సోనమ్ వాంగ్ చుక్
సోనమ్ వాంగ్ చుక్ ను ఎందుకు అరెస్ట్ చేశామంటే?
నేపాల్, అరబ్ విప్లవం తరహ ఉద్యమాలు చేయాలని యువతను రెచ్చగొడుతున్నాడని ప్రభుత్వం ఆరోపణ
లఢక్ కు రాష్ట్ర హోదా ఇచ్చి, ఆరో షెడ్యూల్ లో చేర్చాలని సామాజిక కార్యకర్త ముసుగులో అరాచకాలు సృష్టించడానికి వ్యూహం పన్నిన సోనమ్ వాంగ్ చుక్ ను జాతీయ భద్రతా చట్టం కింద(ఎన్ఎస్ఏ) కింద అరెస్ట్ చేయడాన్ని కేంద్రం సమర్థించుకుంది.
నేపాల్ ఆందోళన, అరబ్ విప్లవాల తరహాలో లఢక్ లో కూడా ఉద్యమం తీసుకురావాలని వాంగ్ చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో స్థానిక యువత హింసాత్మక ఘటనలకు దిగింది. ఇందులో నలుగురు వ్యక్తులు చనిపోయారు. దాదాపు 80 మందికి గాయాలయ్యాయి. దీనిపై కేంద్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలు తీసుకుని వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసింది. ఈ ఆందోళనలలో 40 మంది విదేశీయులు ఉన్నారని కూడా కొన్ని జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.
లఢక్ పాలన కేంద్రమైన లేహ్ లో శాంతిని పునరుద్దరించడానికి అతను విరుద్దంగా వ్యవహరించకుండా నిరోధించడానికి వాంగ్ చుక్ ను రోజు ప్రారంభంలోనే నిర్భంధించడం ముఖ్యమని ప్రభుత్వం పేర్కొంది.
‘‘ఈ రోజు సెప్టెంబర్ 26న లేహ్ లోని ఉలే టోక్పో గ్రామానికి చెందిన వాంగ్ చుక్ ను ఎన్ఎస్ఏ కింద అదుపులోకి తీసుకున్నారు. వాంగ్ చుక్ రాష్ట్ర భద్రతకు హాని కలిగించే, శాంతి, ప్రజా పాలన నిర్వహణకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనేక సార్లు గమనించాము’’ అని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ లఢక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వం- ఫై పవర్ కమిటీ మధ్య సమావేశాలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయని, ఈ విషయం వాంగ్ చుక్ కు కూడా తెలుసని, అయితే ఈ విషయం తెలిసి కూడా సెప్టెంబర్ పది నుంచి గుప్త సందేశాల ద్వారా తన నిరాహార దీక్ష కొనసాగించాడని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
‘‘యువతను రెచ్చగొడుతూ వరుస ప్రసంగాలు చేయడం, నేపాల్ ఆందోళనలు, అరబ్ ఆందోళనలు వాటి గురించి మాట్లాడుతూ, యువతను తప్పుదారి పట్టించే వీడియోలు చూపిస్తూ సెప్టెంబర్ 24 నాటి హింసాత్మక ఘటనలకు ప్రేరేపించాడు. అక్కడ సంస్థలు, భవనాలు, వాహానాలను ఆందోళనకారుల ముసుగులో అసాంఘిక శక్తులు నిప్పు పెట్టాయి. తరువాత పోలీస్ లపై కూడా వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు.
ఈ అంశంపై ప్రభుత్వం చర్చలు ప్రారంభించినప్పుడు అతను నిరాహార దీక్ష చేసి రాజకీయంగా ఎదగడానికి దానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేశాడని ఆ ప్రకటనలో ప్రభుత్వం ఆరోపించింది. శాంతియుతంగా ఉండే లేహ్ పట్టణంలో సాధారణ పరిస్థితులను పునరుద్దరించడం ముఖ్యమని ఆ ప్రకటన పేర్కొంది.
‘‘వాంగ్ చుక్ ప్రజాశాంతి భద్రతల నిర్వహణకు హాని కలిగించే విధంగా వ్యవహరించకుండా నిరోధించడం కూడా చాలా ముఖ్యం. అతని రెచ్చగొట్టే ప్రసంగాలు, వీడియోల నేపథ్యంలో విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అతడిని లేహ్ లో ఉంచడం మంచిది కాదు’’ అని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వాంగ్ చుక్ ను ఎన్ఎస్ఏ కింద అదుపులోకి తీసుకుని రాజస్థాన్ లోని జోధ్ పూర్ జైలుకు తరలించింది.
Next Story