చంద్రబాబు అండ్ కో ఎన్డీయేలోకి తిరిగొస్తారా
x
ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం చంద్రబాబునాయుడు

చంద్రబాబు అండ్ కో ఎన్డీయేలోకి తిరిగొస్తారా

ఒకరకంగా చెప్పాలంటే అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రతిష్టాపన నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఇది ఎన్డీయేలోకి కొత్త మిత్రులను తెస్తుందా?


ఇదే సమయంలో పాత మిత్రులు తిరిగి ఎన్డీఏలోకి చేరడానికి సిద్దం అన్నట్లు సంకేతాలు ఇచ్చారు.బీజేపీ దశాబ్దాలుగా చెబుతున్న రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక హమీలను రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చింది. వీటిని న్యాయ స్థానాలు సైతం ఆమోదించాయి. ఎన్నికల ప్రచారంలో వీటిని ప్రధానంగా ప్రస్తావించి ఓట్లను రాబట్టుకోవాలని అవి ఆశిస్తున్నాయి.

ఇప్పుడు ఇక హిందూ చైతన్యం శ్రీరాముడి ఆలయ రూపంలో అయోధ్యలో నిలుచుని ఉంది. ఈ సందర్భం బీజేపీకీ కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఓట్లను రాలుస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ఇప్పుడు కనపరిచిన ప్రభావం కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. బీజేపీకి సంబంధించిన 1300 మంది ఎమ్మెల్యేలు, 290 ఎమ్మెల్సీలు, 384 మంది పార్లమెంట్ సభ్యులు( లోక్ సభ, రాజ్యసభ) రామాలయ ప్రతిష్టాపన సందర్భంగా వారి వారి నియోజకవర్గాల్లో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.

చాలా ప్రాంతాల్లో అన్నదానాలు, స్వీట్ల పంపిణీ, ర్యాలీల నిర్వహణ, సామూహికంగా లైవ్ టెలీకాస్ట్ నిర్వహించడం వంటి పనులు చేశారు. తద్వారా హిందూ వారసత్వానికి తామే ప్రతినిధులం అప్రకటితంగా చెప్పినట్లు అయింది. మిగిలిన భాగస్వామ్య పక్షాలు వీటిని బహిష్కరించడంతో వీరికి అదనపు లబ్ధి చేకూరింది.

"బీజేపీ చిరకాల లక్ష్యాలలో రెండు నెరవేర్చాం. దేశాన్ని విడదీస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేశాం. 1989 లో హమీ ఇచ్చిన రామమందిరాన్ని నిర్మించాం. అయితే దీనిని మాత్రం ఎన్నికల హమీగా చూడకూడదు. నిన్న జరిగింది శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ట మాత్రమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి తిరిగి ప్రాణం పోసింది. దీనికి విధి ప్రధాని నరేంద్ర మోడీ ని ఎన్నుకుంది. ఇదీ చారిత్రాత్మక క్షణం. భారతీయులు నిజంగా సంతోషించాల్సిన సమయం " అని బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు వినయ్ సహస్ర బుద్దే అన్నారు.

మిగిలిన పక్షాలు వస్తాయా?

అయోధ్య కార్యక్రమం ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడానికి ఓ వేదికగా ఉపయోగపడింది. ఇప్పటికే ఉన్న భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్న బంధం మరింత బలపడిందని చెప్పవచ్చు. ఇంతకు ముందు ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి పక్కన నిలుచున్నారు. అయితే తిరిగి ఎన్డీఏ గూటికి చేరడానికి తన ప్రయత్నాలు అయోధ్య వేదిక గా మొదలు పెట్టారు. కార్యక్రమంలో కర్నాటక నుంచి జేడీ(ఎస్), ఆంధ్ర నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం హజరయ్యారు.

ఆంధ్ర విషయంలో ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కేంద్ర నాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీటిని ఎలా అధిగమిస్తారో చూడాలి. అలాగే పాత మిత్రుడు శిరోమణి అకాలీదళ్ నేతలు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేశారు. " ఇదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సంతోషించాల్సిన రోజు. భారతీయులకు నేను అభినందనలు తెలుపుతున్నా" అంటూ ఆ పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ అన్నారు.

అయితే దేశంలో తిరిగి యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు లా కమిషన్ కూడా చర్చలు ప్రారంభించింది. దీనిపై ఎన్డీఏలోని కొన్ని మిత్రపక్షాలకు ఇబ్బంది గా మారి అవి బీజేపీతో కొనసాగే విషయంలో పునరాలోచన చేయవచ్చు. యూసీసీ సమస్య ఇంతకుముందు కూడా ఎన్డీఏ చీలికకు దారితీసింది. అప్పుడు మోడీ రంగంలోకి దిగి తిరిగి వారిని సముదాయించారు. అందరితో విస్తృత సంప్రదింపులు జరిగిన తరువాతనే దీనిని అమలు చేస్తామని హమీ ఇచ్చారు.

సీట్ల సంఖ్యను దాటవచ్చు

రామమందిర ప్రారంభోత్సవం తో ఉత్తరాదిన బీజేపీ బలపడిందని సెంటర్ ఫర్ దీ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్ నీతి ప్రొఫెసర్ , కో డైరెక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. " 2019 లో బీజేపీ 303 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు దాని బలం విపరీతంగా పెరిగినట్లు కనిపిస్తోంది. కారణం మీ కళ్ల ఎదుటే ఉంది, దక్షిణాదిలో సైతం ఈ ప్రభావం ఉంటుంది. శ్రీరామ మందిర ప్రారంభోత్సవ వల్లే ఇదంతా" అని ఆయన అన్నారు.

నిజమే దేశంలో రాముడంటే జాతీయ చైతన్యం, శ్రీరాముడంటే చట్టం, విశ్వాసం, దేశానికి పునాదీ. శ్రీరాముడంటే దేశపు ఆలోచన, కీర్తి, ప్రతిష్ట, నాయకుడంటే శ్రీరాముడే. ఆయన శాశ్వతుడు. రాముడిని ఎవరైతే గౌరవిస్తారో, దాని ప్రభావం సంవత్సరాలు లేదా శతాబ్దాలు కాదు.. వేల సంవత్సరాల వరకు ఉంటుంది. " రామో విగ్రహ: వాన్ ధర్మ: సాధు సత్య పరాక్రమ:, రాజా సర్వస్య లోకస్య, దేవానిమివ వాసవ:" అని రాక్షసుడైన మారీచుడు రావణుడితో చెప్పిన మాటలు. దీనర్థం "ధర్మానికి రూపం ఇస్తే అది రాముడిలా ఉంటుందని".

Read More
Next Story