‘‘రైతులను పక్కనపెట్టి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోం’’
x
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్

‘‘రైతులను పక్కనపెట్టి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోం’’

అమెరికాతో జరుగుతున్న చర్చలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన


దేశ రైతుల, మత్స్యకారులు, చిన్నమధ్యతరహ పరిశ్రమల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోమని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

అయితే అమెరికాతో వాణిజ్య చర్చలు మాత్రం సజావుగా సాగుతున్నాయని మాత్రం చెప్పారు. చర్చలకు గడువు మాత్రం లేదని గోయల్ వివరించారు. భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాలను సంబంధించి భారత్ ఏదైనా శుభవార్త ఆశించగలదా? అని విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘చర్చలు మంచి వాతావరణంలో సాగుతున్నాయని నేను నమ్ముతున్నాను. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందాలు, వాణిజ్య చర్చలు ఎప్పుడూ గడువుపై ఆధారపడి ఉండేవని నేను చాలాసార్లు చెప్పాను’’ అని గోయల్ అన్నారు.

భారత్ లోని రైతులు, మత్స్యకారులు, చిన్న తరహా పరిశ్రమల రంగం వంటి దేశాల ప్రయోజనాలను పూర్తిగా పరిష్కరిస్తే తప్ప ఎటువంటి ఒప్పందం కుదరదు. చర్చలు ఇప్పటి వరకూ బాగానే సాగుతున్నాయి. చర్చలు కొనసాగుతున్నాయి. మేము ఒక నిర్ణయానికి వచ్చినప్పుడూ మీకు కచ్చితంగా తెలియజేస్తాము’’ అని కేంద్రమంత్రి అన్నారు.
వ్యవసాయ రంగంలో రాయితీ కావాలి
భారత్ వ్యవసాయ రంగంలో అమెరికా ప్రవేశించాలని కోరుకుంటున్న తరుణంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ నేతృత్వంలోని భారత అధికారిక బృందం ఈ వారం వాషింగ్టన్ లో తన అమెరికా కౌంటర్ పార్ట్ తో వాణిజ్యచర్చలు జరిపింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భారత్, అమెరికా నాయకులు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు.
2025 లో అక్టోబర్- నవంబర్ నాటికి ఒప్పందం మొదటి దశ పూర్తి చేయాలని ఇరు దేశాల నాయకులు భావించారు. ఇప్పటి వరకూ రెండు దేశాల మధ్య ఐదు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. గత నెలలో గోయల్ అమెరికాలో వాణిజ్య చర్చల కోసం న్యూయార్క్ వెళ్లారు.
సుంకాలు- వాణిజ్యం
అమెరికా- భారత్ మధ్య ట్రంప్ రాకతో వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో 25 శాతం, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లేదని సాకుతో మరో 25 శాతం మొత్తం 50 శాతం సుంకాలను న్యూఢిల్లీపై ట్రంప్ విధించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని వైట్ హౌజ్ ఆరోపణ.
భారత్- అమెరికా సంబంధాలు..
రెండు రోజుల క్రితం ట్రంప్ వైట్ హౌజ్ లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ తనతో మాట్లాడరని, రష్యా నుంచి ఆయిల్ కొనబోవడం లేదనే హమీ తనకు లభించిందని చెప్పారు. ఈ సందర్భంలో వాణిజ్య ఒప్పందం లో సానుకూల స్పందన వస్తుందని అంతా ఆశించారు.
యూఎస్ కు చెందిన దక్షిణ, మధ్య ఆసియా ఇంచార్జ్ యూఎస్ అసిస్టెంట్ ప్రతినిధి బ్రెండన్ లించ్ సెప్టెంబర్ 16న న్యూఢిల్లీలో భారత ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఒప్పందం పరస్పర ప్రయోజనం ముగింపు కోసం చర్చలు జరపాలని నిర్ణయించారు.
భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికానే..
ప్రస్తుతం భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికానే. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత 191 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేరుకునేలా లక్ష్యంగా నిర్ణయించారు.
2024-25 వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెరికా భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 131.84 బియలిన్ల గా ఉంది. ఇందులో భారత్ నుంచి 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉంది.
భారత్ మొత్తం వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 18 శాతం, దిగమతులలో6.22 శాతం, దేశం మొత్తం వస్తువుల వ్యాపారంలో 10.73 శాతం వాటా ఉంది.
Read More
Next Story