
రాహుల్ గాంధీ
ఇక పై కీలక అధికారులు 20 ఏళ్ల తరువాత కానీ పుస్తకాలు రాయద్దు?
కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో కీలక నిబంధనలు..
కొన్ని రోజులుగా మాజీ ఆర్మీ అధికారి జనరల్(రిటైర్డ్) మనోజ్ ముకుంద్ నరవాణే రాసి, ఇంకా ప్రచురణకు నోచుకుని పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పదవీ విరమణ తర్వాత పుస్తకం రాయడానికి ముందు, అధికార పదవులు నిర్వహించిన సైనిక అధికారులతో సహా సీనియర్ ప్రభుత్వ అధికారులకు 20 సంవత్సరాల కూలింగ్- పీరియడ్ ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది.
హిందూస్తాన్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, శుక్రవారం (ఫిబ్రవరి 14) జరిగిన క్యాబినెట్ సమావేశంలో నరవాణే పుస్తకం వివాదం చర్చకు వచ్చింది. అధికారులను ఉటంకిస్తూ నివేదిక, సమావేశంలో అనేక మంది మంత్రులు పుస్తకాన్ని రాయడానికి ముందు అధికార పదవులు నిర్వహించిన వ్యక్తులకు కూలింగ్ ఆఫ్ వ్యవధి ఉండాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని పేర్కొంది.
నివేదికలో ఉటంకించినట్లుగా, 20 సంవత్సరాల కూలింగ్-ఆఫ్ వ్యవధిని తప్పనిసరి చేస్తూ అధికారిక ఉత్తర్వు త్వరలో జారీ చేయబడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశం క్యాబినెట్ అధికారిక 27-పాయింట్ల ఎజెండాలో భాగం కాదని, సాధారణ చర్చలో భాగంగా తలెత్తిందని వారు పేర్కొన్నారు.
ఎప్ స్టీన్ వివాదం..
క్యాబినెట్ సమావేశంలో ఎప్స్టీన్ ఫైల్స్ వివాదంపై అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన పలు అంశాలను కూడా చర్చకు వచ్చాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆరోపణలకు ప్రతిస్పందించడానికి బదులుగా ప్రభుత్వం ఈ అంశంపై తన వైఖరిని కొనసాగించాలని మంత్రులు పేర్కొన్నారని కూడా తెలిపింది.
ప్రతిపక్షం అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి - జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య సంబంధాన్ని వివాదంగా మార్చడానికి ప్రయత్నించింది.
అయితే హార్డీప్ సింగ్ పూరి ప్రతిపక్షాలు వివాదాలపై స్పందించారు. ఎప్స్టీన్‌తో తన సంభాషణలు ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌స్టిట్యూట్ అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్నాయని పూరి వివరణ ఇచ్చారు. తాను ఎప్స్టీన్ ప్రైవేట్ ద్వీపమైన లిటిల్ సెయింట్ జేమ్స్‌కు ఎప్పుడూ ప్రయాణించలేదని పేర్కొన్నారు. తనతో ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని వివరించారు.
నరవణే వివాదం ఎలా మొదలైంది..
ఫిబ్రవరి 2న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దిగువ సభలో ఇంకా ప్రచురించబడని పుస్తకంలోని భాగాలను ఉదహరించాలని ప్రయత్నించిన తర్వాత నరవణే పుస్తకంపై వివాదం తలెత్తింది. ఇంకా విడుదల కానీ పుస్తకం ఎలా సభలోకి తెస్తారని అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే తరువాత రాహుల్ గాంధీ పుస్తకం వివిధ ఆన్ లైన్ ప్లాట్ ఫాం లలో ఉనికిలో ఉందని లోక్ సభకు తెచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో PDF వెర్షన్ విస్తృతంగా ఉందని సభలో చెప్పారు.
ప్రచురణకర్త ఏం అన్నారు..
అయితే తాము పుస్తకాన్ని ఎలాంటి ప్రచురణ చేయలేదని పుస్తక ప్రచురణ కర్త అయిన పెంగ్విన్ రాండమ్ హౌజ్ ఇండియా తెలిపింది. చట్టవిరుద్దంగా పుస్తకం పంపిణీ జరిగితే అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించి పుస్తకాన్ని వెనక్కి రప్పిస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న పుస్తకం కాపీలు ఏవైనా ఉంటే(ఆన్ లైన్, ఆఫ్ లైన్, పీడీఎఫ్ ఇతర మార్గాలు) అది కాపీరైట్ ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. వెంటనే దాన్ని నిలిపివేస్తామని తెలిపింది.
ఈ వివాదంపై ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్, ఇతర ఫార్మాట్‌లలో మాన్యుస్క్రిప్ట్ చట్టవిరుద్ధంగా చెలామణి అయిందని పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
నరవణే ఏం చెప్పారు..
పుస్తకం స్థితిపై పెంగ్విన్ సంస్థ చేసిన ప్రకటనను రిటైర్డ్ జనరల్ కూడా ధృవీకరించారు. తన పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదని చెప్పారు. పుస్తకం ప్రచురించబడలేదు.
ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో "ప్రచురించబడలేదు, పంపిణీ చేయబడలేదు, విక్రయించబడలేదు లేదా ప్రజలకు అందుబాటులో ఉంచబడలేదు" అనే తన ప్రచురణకర్త వైఖరికి మద్దతు ఇచ్చారు.
ఈ వివాదం ప్రధాన అంశం ఆగస్టు 31, 2020న పాంగోంగ్ త్సో దక్షిణ ఒడ్డున ఉన్న కైలాష్ శ్రేణిలో జరిగిన పరిణామాల గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు సరిగా తీసుకోలేదని విమర్శలు ఉన్నట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే వీటిని ప్రభుత్వం ఖండిస్తోంది. ఈ పుస్తకానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా అనుమతి ఇవ్వలేదు.
Next Story

