భారత సంకల్పబలానికి చిహ్నం ‘‘ఆపరేషన్ సిందూర్..
x

భారత సంకల్పబలానికి చిహ్నం ‘‘ఆపరేషన్ సిందూర్"..

ఉగ్రవాదాన్ని ఎన్నటికీ ఉపేక్షించమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.


Click the Play button to hear this message in audio format

“ఆపరేషన్ సిందూర్’’ను కేవలం ఒక సైనిక చర్యగా చూడకూడదని, అది భారతదేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పబలానికి చిహ్నం” అని పేర్కొన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్. లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ & టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉగ్రవాదంపై భారత వైఖరి ఎంత కఠినంగా ఉంటుందో “ఆపరేషన్ సిందూర్’’ ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఉగ్రమూకలు ఏ మూలన దాకున్నా..ఎవరి ప్రోద్బలంతో పనిచేస్తున్నా.. అంత చూస్తామని విషయాన్ని రుజువు చేసిందన్నారు. యూరి ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ ఇప్పుడు పహెల్గామ్ ఘటన తర్వాత ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)తో భారత్ బలగాలు మరోసారి సత్తా చాటాయని చెప్పారు.

‘శాంతిపక్షానే భారత్’..

భారత్(India) ఎప్పుడూ పౌరులను లక్ష్యంగా చేసుకోదని, కేవలం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం దాడులు చేసిందని చెప్పుకొచ్చారు. కానీ పాకిస్తాన్(Pakistan) మాత్రం పౌర నివాస ప్రాంతాలు, దేవాలయాలు, చర్చిలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. భారత సైన్యం ప్రభావం పాక్ సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా, పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండికి కూడా తాకిందన్నారు. ఫహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతిదాడిగా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టామని చెప్పారు. భారత్‌ ఎప్పుడూ శాంతికే ప్రాధాన్యం ఇస్తుంది. కానీ దాడులకు తెగబడితే మాత్రం ధీటుగా జవాబిస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్‌ను దేశమంతా అభినందిస్తోందని చెప్పారు. ఇది కేవలం సైనిక చర్య కాదని, భారత్ ఉగ్రవాదంపై ఎలాంటి శక్తినైనా ధైర్యంగా ఎదుర్కొగలదని చెప్పే సంకేతమని అన్నారు. ఇదే సమయంలో భారత్–పాకిస్తాన్ భూమి, వాయు, సముద్ర మార్గాల్లో ఎటువంటి దాడులూ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నాయని మంత్రి తెలిపారు.

బ్రహ్మోస్ కేంద్రం ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ..

బ్రహ్మోస్ ఫెసిలిటీ కేంద్రం దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్తకు మరో మైలు రాయి అని చెప్పారు. జాతీయ సాంకేతిక దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించడం శుభపరిణామమన్నారు. భారత-రష్యా సాంకేతిక సహకారంతో తయారయ్యే బ్రహ్మోస్.. కేవలం ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులలో ఒకటే కాదని, ఇది భారత దళాల శక్తికి సంకేతమని పేర్కొన్నారు.

భారత్ ప్రపంచంలో శక్తిమంత దేశాల్లో ఒకటిగా ఎదుగుతోందని భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాటలను రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేశారు.

రక్షణ పారిశ్రామిక కారిడార్‌గా (UPDIC)ఉత్తరప్రదేశ్..

UPDICలో ఇప్పటికే ₹34,000 కోట్ల పెట్టుబడితో 180 ఎంఒయూస్‌లకు ఒప్పందం కుదిరిందని, ఇందులో రూ. 4వేల కోట్లు ఇప్పటికే పెట్టుబడిగా వెచ్చించామని చెప్పారు. లక్నోలో టిటానియం, సూపర్ అలాయ్ ప్లాంట్ల నిర్మాణం మొదలవుతుందని, మరో 7 కీలక ప్రాజెక్టులు వస్తాయని చెప్పారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. యూపీని రక్షణ ఉత్పత్తి కేంద్రంగా తయారుచేస్తుందన్నారు. “మేక్ ఇన్ ఇండియా – మేక్ ఫర్ ద వరల్డ్” నినాదంతో భారత్ ముందుకెళ్తుందన్నారు. స్వదేశ అవసరాలకు సరిపడే ఉత్పత్తులనే కాకుండా ప్రపంచ దేశాలకు ప్రధాన రక్షణ సరఫరాదారుగా ఎదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

యూపీ సీఎం యోగి ఏమన్నారంటే..

ఉగ్రవాదాన్ని భారత్ భరించదన్న సందేశాన్ని "ఆపరేషన్ సిందూర్"తో ప్రపంచానికి చాటి చెప్పిందని యూపీ(UP) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పేర్కొన్నారు. 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో బూస్టర్, ఎవియోనిక్స్, రామ్‌జెట్, ప్రొపలెంట్ సెగ్మెంట్లను ఇంటిగ్రేట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు కేశవ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్, DRDO చైర్మన్ డా. సమీర్ వి కామత్, బ్రహ్మోస్ డీజీ డా. జైతీర్థ్ జోషి పాల్గొన్నారు.

Read More
Next Story