
మళ్లీ పెగాసస్ దుమారం: ఇద్దరు జర్నలిస్ట్ ల ఫోన్లలో ఆనవాళ్లు
జర్నలిస్టులు సిద్దార్థ్ వరదరాజన్, ఆనంద్ మంగ్నాలే ఫోన్ లలో స్పైవేర్ ఆనవాళ్లు ఉన్నాయని ఓ నివేదిక బయటపడింది.
అక్టోబర్ లోనే స్పాన్సర్డ్ హ్యాకింగ్ హెచ్చరిక సమాచారం పంపించిదని దాని ఆధారంగా ల్యాబ్ లో పరీక్షచేయగా ఆధారాలు దొరికాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్- వాషింగ్టన్ పోస్ట్ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
నివేదిక ప్రకారం ది వైర్ వ్యవస్థాపక ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్, ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లు ఈ ఏడాది అక్టోబర్ లో హ్యక్ గురైందని అనుమానం వచ్చినట్లు వెల్లడించారు.
నివేదిక ఫలితాలు
ఆమెస్ట్నీ ప్రకారం ఇండియాలో స్టాక్ మ్యానిపులేషన్ గురించి పని చేస్తున్నప్పుడు ఆనంద్ తన ఫోన్ హ్యక్ కు గురైందని అనుమానించారు. ఆనంద్ మంగ్నాలే, వరదరాజన్ ఫోన్ లు ఇంతకుముందు కూడా పెగాసెస్ బారిన పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఆనంద్ మంగ్నాలే పై పెగాసస్ దాడికి పాల్పడిన వ్యక్తి సమాచారం.. సిద్దార్థ్ వరదరాజన్ ఫోన్ లో సైతం గుర్తించినట్లు నివేదిక ప్రకటించింది.
బాధితుల ఫోన్లను ల్యాబ్ లో పరిశీలించినప్పుడు అటాకర్ చిరునామా సైతం గుర్తించింది. ఫోన్ లో దొరికిన డిజిటల్ నమూనాలు అన్నీ పెగాసస్ మాతృసంస్థ ఎన్ఎస్ఓ(NSO) గ్రూప్ కు సంబంధించినవనే తేలింది. ఇవన్నీ ఎన్ఎస్ఓ (NSO)బ్లాస్ట్ పాస్ దోపిడీకి అనుగుణంగా ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు విలేకరులు తమ ఫోన్లు హ్యకింగ్ కు గురి అవుతున్నాయనే అనుమానం రాగానే వాటిని ఆమ్నెస్టీకి అందజేసినట్లు సమాచారం.
అక్టోబర్ లోనే యాపిల్ సంస్థ నుంచి పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు హ్యకింగ్ అలర్ట్ లు వచ్చాయి. తదనంతరం యాపిల్ సంస్థ దీనిపై వివరణ ఇస్తూ 150 దేశాలకు ఇటువంటి సందేశాలు వెళ్లాయని వివరణ ఇచ్చింది. అయితే దీనిపై వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ప్రభుత్వమే ఆపిల్ కంపెనీపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రకటన ఇప్పించదని ఆరోపించింది.
పెగాసస్ స్పైవేర్ అంటే ఏమిటీ
ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసస్ సాంకేతికతను అభివృద్ది చేసింది. ఈ సంస్థ కేవలం ప్రభుత్వాలకు మాత్రమే స్పైవేర్ ను విక్రయిస్తుంది. ప్రైవేట్ సంస్థలకు విక్రయించదు. ఒప్పందాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. దీని పని విధానం కనుగొనే టేక్నాలజీ ఇప్పటివరకు రాలేదని చాలా మంది సాంకేతిక నిఫుణులు చెబుతున్నారు.
శత్రువు ను గుర్తించిన తరువాత ఇదీ తన పని ప్రారంభిస్తుంది. ముందు టార్గెట్ వ్యక్తి ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో పంపిస్తారు. తరువాత సమాచారం మొత్తం సేకరించి, అందిస్తుంది. అంతేకాక సీక్రెట్ గా కెమెరా, మైక్రోఫోన్ ఆన్ లో ఉండి, మాట్లాడుతున్న సమాచారం మొత్తం అందించగలదు. ఫోన్ మొత్తం కొత్త సాప్ట్ వేర్ వేసిన కూడా దీనిని ఆపకుండా నిరోధించలేం.
2017లో భారత్ పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం దీన్ని ధృవీకరించలేదు.. ఖండించలేదు.