‘అద్భుత పనితనం, ఉత్సాహం దేశానికి అతిపెద్ద బలం’
‘‘ వివిధ రంగాల్లో అద్భుతంగా పనిచేస్తున్న మనవాళ్ల భాగస్వామ్యం.. దేశాన్ని అభివృద్ధి చేయాలనే వారి ఉత్సాహం మనకు అతిపెద్ద బలం’’ - మోదీ.
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే దేశానికి అతిపెద్ద బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఏడో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన సమాఖ్యకు సందేశం పంపారు. దేశం పట్ల ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఆశావాదం, విశ్వాసం దేశ బలానికి ప్రతిబింబం అని అందులో పేర్కొ్న్నారు.
‘‘భారతదేశం అపారమైన అవకాశాలున్న దేశం. వివిధ రంగాల్లో అద్భుతంగా పనిచేస్తున్న మనవాళ్ల భాగస్వామ్యం.. దేశాన్ని అభివృద్ధి చేయాలనే వారి ఉత్సాహం మనకు అతిపెద్ద బలం’’ అని పేర్కొన్నారు మోదీ.
సాంకేతికత వినియోగంపై దృష్టి సారించి.. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం చెప్పుకోదగ్గ విజయాలలో ఒకటని అన్నారు.
JITO ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (JIIF) తన వార్షిక ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్‌ను జూలై 6-7 తేదీల్లో 'ఆలోచనలు ప్రభావితం చేయడం: ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను పెంపొందించడం' అనే థీమ్‌తో నిర్వహించింది.
రెండు రోజుల ఈవెంట్‌లో విజయ్ శేఖర్ శర్మ (Paytm), ఆదిత్ పాలిచా (జెప్టో), సంజీవ్ బిఖ్‌చందానీ (ఇన్‌ఫోడ్జ్) సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) అనుబంధ సంస్థ అయిన JIIF 80 కంపెనీలలో రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. 25 మందికి పైగా జైన్ పారిశ్రామికవేత్తలను తయారుచేసింది.