ప్రతిపక్షాల వ్యక్తిగత దాడులపై ప్రధాని మోదీ ఏమన్నారు?
x

ప్రతిపక్షాల 'వ్యక్తిగత దాడుల'పై ప్రధాని మోదీ ఏమన్నారు?

మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు. 10 ఏళ్లుగా రూ. 34 లక్షల కోట్లు స్వాధీనం చేసుకోగా.. తమ హయాంలో ఈడీ రూ. 2,200 కోట్లను స్వాధీనం చేసుకుందని చెప్పారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం (మే 28) ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. దూషించే హక్కు వారికి ఉందని, గత 24 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నారని చెప్పారు. మంగళవారం ఆయన ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

"పార్లమెంటులో మా పార్టీ సభ్యుడు లెక్కలు వేసి 101 సార్లు నిధించారని చెప్పారు. ఎన్నికలు వచ్చినా లేదా లేకపోయినా, ఈ వ్యక్తులు (ప్రతిపక్షాలు) నిందించే హక్కు తమకు మాత్రమే ఉందని నమ్ముతారు” అని తనపై వ్యక్తిగత దాడులపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు

'ఏజెన్సీల దుర్వినియోగం లేదు'

తమను అణిచివేసేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారనే ప్రతిపక్ష నేతల ఆరోపణలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. అవినీతిని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు. 10 ఏళ్లుగా రూ. 34 లక్షల కోట్లు స్వాధీనం చేసుకోగా.. తమ హయాంలో గత 10 ఏళ్లలో ఈడీ రూ. 2,200 కోట్లను స్వాధీనం చేసుకుందని చెప్పారు. 2,200 కోట్లు దేశానికి తిరిగి తెచ్చిన వ్యక్తిని నిందించడం మాని గౌరవించాలి అని పేర్కొన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరులో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలపై మోదీ సమాధానమిస్తూ..ప్రతిపక్షాలు తమ వద్ద ఉన్న ఆధారాలను అడగాలని కోరారు. దర్యాప్తు సంస్థల పనిలో ప్రభుత్వం జోక్యం కూడదని కూడా చెప్పారు.

ఎవరు జైలుకు వెళ్లాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణపై ప్రధాని ప్రశ్నించగా.. ఈ వ్యక్తులు రాజ్యాంగాన్ని చదివితే బాగుంటుందని, దేశ చట్టాలను చదివితే బాగుంటుందని, నేను ఏమీ చెప్పనవసరం లేదన్నారు.

Read More
Next Story