ఎగ్జిట్ పోల్స్:  మూడోసారి అధికారం కమలదళానిదే..
x

ఎగ్జిట్ పోల్స్: మూడోసారి అధికారం కమలదళానిదే..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని మెజారిటీ పోల్ సంస్థలు అంచనా వేశాయి. ఎన్నికల్లో నినాదం ఇచ్చినట్లుగా బీజేపీ ఈసారి 400 సీట్ల..


పద్దెనమిదో లోక్ సభ ఎన్నికలు శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిశాయి. దాంతో సాయంత్రం ఆరు గంటలకు దేశంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. అన్ని సంస్థలు దాదాపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. వరుసగా మూడో సారి ప్రధాని నరేంద్ర మోదీ గద్దెనెక్కుతారని ప్రకటించాయి. ప్రతిపక్షాలన్నీ జట్టుకట్టి ఇండి కూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన వాటికి అధికారం అందని ద్రాక్షగా మిగులుతుందని తేల్చాయి.

2019తో పోల్చితే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పనితీరు మెరుగుపడుతుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈసారి పార్టీ 350 సీట్లకు మించి పెరగవచ్చని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వంద 100 నుంచి 150 సీట్ల వరకూ సాధిస్తుందని అంచనా వేశాయి.
బీజేపీకి 350 ప్లస్ సీట్లు వస్తాయని..
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా 543 మంది సభ్యుల లోక్‌సభలో బిజెపి నేతృత్వంలోని కూటమికి 361-401 సీట్లు ఇవ్వగా, ప్రతిపక్ష ఇండి కూటమికి 131-166 సీట్లు వస్తాయని అంచనా వేసింది, ABP-C ఓటర్ ఎన్డీఏకు 353-383 సీట్లు వస్తుందని అంచనా వేసింది. ఇండి కూటమి 152-182 సీట్లకే పరిమితం అవుతుందని తేల్చింది.
టుడేస్ చాణక్య భారతీయ జనతా పార్టీకి 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. బీజేపీ సొంతంగా 335 సీట్లు, ఎన్డీయేకు 400 ప్లస్ సీట్లు సాధిస్తుందని పేర్కొంది. ప్రతిపక్ష కూటమికి 107 సీట్లు వస్తాయని, అధికార, ఇండి అలయోన్స్ ప్లస్- మైనస్ 11 సీట్లు తక్కువ లేదా ఎక్కువ రావచ్చని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ '400 సీట్ల' నినాదాన్ని ఇచ్చింది.
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, వరుసగా మూడోసారి ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించి మొదటి ప్రధాని నెహ్రూ సరసన ప్రస్తుత ప్రధాని మోదీ చేరతారు. టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్డీఏకు 358 ఇండి కూటమికి 152 సీట్లు వస్తాయంది.



ఎన్డీయే 2019లో సాధించిన 353 సీట్లను అధిగమిస్తుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 53, మిత్రపక్షాలకు 38 సీట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు 'ఇండి' కూటమిని ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయింది.
దక్షిణ భారతదేశంలో..
తమిళనాడు, కేరళలో ఎన్డీయే ఖాతా తెరిచి కర్ణాటకను క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది, అయితే బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర హర్యానా వంటి రాష్ట్రాల్లో దాని సంఖ్య తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఉత్తరప్రదేశ్ మాత్రం బీజేపీకి కంచుకోటగా ఉంటుందని పోల్ స్టర్లు భావిస్తున్నారు.
బీజేపీకి సొంతంగా 306-315 సీట్లు వస్తాయని, దాని కూటమి 355-370 సీట్లు సాధిస్తుందని న్యూస్ 18 అంచనా వేసింది. ప్రతిపక్ష కూటమికి 125-140 సీట్లు గెలుస్తారంది.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 322-340 సీట్లు, కాంగ్రెస్‌కు 60-76 సీట్లు, కాంగ్రెస్ మిత్రపక్షాలకు 71-90 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ పోల్ 543 స్థానాలున్న లోక్‌సభలో అధికార కూటమి 359 సీట్ల వరకు గెలుస్తుందని, ప్రతిపక్ష ఇండియా కూటమి 154 సీట్లను కైవసం చేసుకుంటుందని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ పోల్ ఎన్డీఏకు 353-368 సీట్లు, ప్రతిపక్షాలకు 118-133 సీట్లు వస్తాయని వెల్లడించింది.
జన్ కీ బాత్ సర్వేలో అధికార ఎన్డీయేకు 362-392 సీట్లు, ప్రతిపక్ష కూటమికి 141-161 సీట్లు వచ్చాయి. ఇండియా TV-CNX వారికి వరుసగా ఎన్డీఏకు 371-401, ఇండి కూటమికి 109-139 సీట్లు వస్తాయంది. న్యూస్ నేషన్ 342-378 సీట్లు ఎన్డీఏకు 153-169 సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి వస్తాయంది.
'ఎగ్జిట్ పోల్స్‌ను తయారు చేశారు': కాంగ్రెస్
ఏడో, చివరి దశ ఓటింగ్ శనివారం ముగిసిన తర్వాత, ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకునేందుకు ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేశారని, వారి " ప్రతిపక్షాల తిరోగమన రాజకీయాలను ఓటర్లు తిరస్కరించారు, అవకాశ వాద ఇండియా కూటమి " విఫలమైందని మోదీ అన్నారు. ".
అయితే, ఎగ్జిట్ పోల్స్‌ను తాము నమ్మట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రధాని మోదీ వాటిని మానిపులేట్ చేశారని విమర్శించింది. ఇవన్నీ ఆయన ఆడుతున్న మైండ్ గేమ్ గా అభివర్ణించింది. వాస్తవ ఫలితాలు భిన్నంగా వస్తాయని ధీమా వ్యక్తం చేసింది.
ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ, "జూన్ 4న నిష్క్రమణ ఖాయమైన వ్యక్తి ఈ ఎగ్జిట్ పోల్స్‌ను రూపొందించారని విమర్శించారు. ఇండి కూటమి కచ్చితంగా కనీసం 295 సీట్లు సాధిస్తుంది, ఇది స్పష్టమైన, నిర్ణయాత్మక మెజారిటీ " అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విపక్షాల ఇండి కూటమి సమావేశం అనంతరం విలేకరులతో చెప్పారు.
‘‘మా నేతలందరితో మాట్లాడి ఈ లెక్కకు వచ్చాం.. ఇది ప్రజల సర్వే.. జనాలు మా నేతలకు ఈ సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ సర్వేలు ఉన్నాయి, వాళ్ల మీడియా మిత్రులు కూడా లెక్కలు పెంచి బయటపెడతాం.. అందుకే మేము వాస్తవికత గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను, ”అని ఖర్గే చెప్పాడు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమ పార్టీ 370కి పైగా లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమర్థత, శక్తిమంతమైన, అభివృద్ధి చెందిన, స్వావలంబనతో కూడిన భారత్‌కు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారని, బుజ్జగింపులు, బంధుప్రీతి, అవినీతిని తిరస్కరించారని అన్నారు. ఎన్డీఏ కూటమికి 400కు పైగా స్థానాలు వస్తాయన్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read More
Next Story