
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు కారణాలేంటి?
రాష్ట్రపతి పాలనపై ఫోరమ్ ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ పీస్ ఎలా స్పందించింది? ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ స్పందనేమిటి?
రాష్ట్రంలో రెండేళ్లుగా కొనసాగుతున్న ఘర్షణల కారణంగా సీఎం బీరెన్ సింగ్ (C M Biren Singh) ఫిబ్రవరి 9 (ఆదివారం)న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 13 (గురువారం)న రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అధికారులు కూడా రాష్ట్రపతి పాలనకు మద్దతు పలికారు. రాజకీయ జోక్యం లేకుండా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ చర్య దోహదపడుతుందని కొంతమంది ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
లూటీకి గురైన ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు, సాయుధ గుంపులను నిర్మూలించేందుకు రాష్ట్రపతి పాలన అవసరమని మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా (Governor Ajay Kumar Bhalla) కూడా అభిప్రాయపడ్డారు,’’ అని The Federalకు సమాచారం అందింది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2027 వరకు గడువు ఉన్న మణిపూర్ అసెంబ్లీని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
స్వాగతించిన ఫోరమ్..
రాష్ట్రపతి పాలనను ఫోరమ్ ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ పీస్ స్వాగతించింది. "మెతేయి - కుకి-జో వర్గాల మధ్య చర్చలకు మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉంది," అని ఫోరమ్ కన్వీనర్ అషాంగ్ కసర్ తెలిపారు. నాగాలు, పంగాల్ (మెతేయి ముస్లింలు) అనే రెండు నిష్పక్షపాత సమాజాలతో ఏర్పడిన ఈ ఫోరం.. రెండు వర్గాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నిస్తోంది. ఇటు కుకి-జో సమాజం కూడా రాష్ట్రపతి పాలనను స్వాగతించింది. ఇక తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది.
"సీఎం మార్పు కంటే రాష్ట్రపతి పాలనే మాకు మేలు. మేము మెతేయిలపై నమ్మకం కోల్పోయాం,’’ ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
"రాష్ట్రపతి పాలన కుకి-జో సమాజానికి ఒక ఆశాకిరణం, ఇది మా రాజకీయ పరిష్కారానికి ఒక అడుగు దగ్గరగా తీసుకువెళ్తుందని మేము విశ్వసిస్తున్నాం," అని ఫోరమ్ పేర్కొంది.
"రాష్ట్రపతి పాలనతో అల్లర్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తద్వారా రాజకీయ చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది," అని ఒక ప్రకటనలో పేర్కొంది.