Priyanka | బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు అండగా నిలవాలి
వయనాడ్ నుంచి పార్లమెంటు సభ్యురాలిగా గెలిచిన ప్రియాంకగాంధీ వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
వయనాడ్ నుంచి పార్లమెంటు సభ్యురాలిగా గెలిచిన ప్రియాంకగాంధీ వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పార్లమెంటులో ఏర్పాటుచేసిన రెండు రోజుల ప్రత్యేక చర్చ కార్యక్రమంలో ఆయన ఘాటైన ప్రసంగం చేశారు.
దాడులు జరగకుండా చూడాలి..
బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వంతో చర్చించి వారిపై దాడులు జరగకుండా చూడాలని కోరుతూ మంగళవారం ఆమెతో పాటు, ఇతర ప్రతిపక్ష సభ్యులు టోట్ బ్యాగ్‌లతో కనిపించారు. “బంగ్లాదేశ్ కే హిందూ ఔర్ ఇసైయోం కే సాథ్ ఖడే హో” (బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రైస్తవులకు అండగా నిలవడం) అనే సందేశం ఉన్న క్రీమ్ కలర్ బ్యాగ్‌లను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
పాలస్తీనా బ్యాగుతో..
అంతకుముందు ‘పాలస్తీనా’ అని ఆంగ్లంలో రాసి ఉన్న బ్యాగుతో ప్రియాంక కనిపించారు. ఇజ్రాయెల్ దాడులతో దుర్భర పరిస్థితులను అనుభవిస్తోన్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఆమె ఆ బ్యాగును తీసుకువచ్చారు. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. ఆమె ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని యూనియన్ ఎంఓఎస్ ఎస్పీ సింగ్ భాగెల్ విమర్శించారు.
పాలస్తీనా ఎంబసీ ఛార్జ్ డి అఫైర్స్ అబేద్ ఎల్రాజెగ్ అబు జాజర్ డిసెంబర్ 11న ప్రియాంకను ఆమె నివాసంలో కలిశారు. వయనాడ్‌లో గెలుపొందినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. పాలస్తీనా స్వాతంత్ర్యం కోసం తన మద్దతు ఉంటుందని ప్రియాంక తనకు హామీ ఇచ్చారని జాజర్ చెప్పారు.
టీ షర్టులతో నిరసన..
గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్ష ఎంపీలు కొన్ని రోజుల క్రితం “మోదీ-అదానీ ఏక్ హైన్” (మోదీ, అదానీ ఒక్కటే) అనే సందేశంతో కూడిన జాకెట్లు, టీ షర్టులు ధరించిన విషయం తెలిసిందే.