తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసిస్తూ రాహుల్ గాంధీ లేఖ..
x

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసిస్తూ రాహుల్ గాంధీ లేఖ..

‘‘కాంగ్రెస్ పార్టీ, పాలిత రాష్ట్రాలు కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయి. గిగ్ వర్కర్ల సంక్షేమానికి చట్టం తీసుకువచ్చిన మొదటి రాష్ట్రం రాజస్థాన్.’’- రాహుల్


తెలంగాణ ప్రభుత్వం చిరుద్యోగుల సంక్షేమానికి చట్టం తీసుకురావడం పట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ముసాయిదా చట్టం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.

రాహుల్ గాంధీ రేవంత్‌కు రాసిన లేఖలో ‘‘గిగ్ (అసంఘటిత) వర్కర్ల సంక్షేమం కోసం మీరు చట్టం తీసుకురావలనుకోవడం శుభ పరిణామం. అయితే ముసాయిదా చట్టం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంప్రదింపులు జరపాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా చట్టం పటిష్టంగా, ప్రభావవంతంగా, అర్థవంతంగా ఉంటుంది. ఈ రంగం కోసం భవిష్యత్తు నిబంధనలను రూపొందించడంలో కూడా ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ఈ సంప్రదింపుల ప్రక్రియలో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నా. సుస్థిరమైన గిగ్ ఎకానమీని నిర్మించడంలో తెలంగాణ ముందుంటుందని నమ్మకం ఉంది.’’ అని పేర్కొన్నారు.

భారత జాతీయ కాంగ్రెస్ కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని, వారి సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించడానికి కట్టుబడి ఉందని రాహుల్ లేఖలో రాసుకొచ్చారు. కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఈ దిశగా అనేక చర్యలు తీసుకున్నాయని, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల సంక్షేమానికి చట్టం చేసిన మొదటి రాష్ట్రమని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ పంపిన లేఖను నవంబర్ 11న రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. "ప్రియమైన రాహుల్ గాంధీ గారికి.. మేమంతా మీ దార్శనికత, ఆలోచనల నుంచి ప్రేరణ పొందాం. తెలంగాణలో కుల గణన మిమ్మల్ని గర్వించేలా చేసింది. ఇది మాకు మరింత శక్తినిస్తుంది" అని కోట్ చేశారు.

Read More
Next Story