‘హత్రాస్ బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచాలి’
x

‘హత్రాస్ బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పెంచాలి’

హత్రాస్ తొక్కిసలాటలో బాధితులకు పరిహారాన్ని పెంచడంతో పాటు ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు.


హత్రాస్ తొక్కిసలాటలో బాధితులకు పరిహారాన్ని పెంచడంతో పాటు ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. వీలైనంత త్వరగా పరిహార పంపిణీ చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం యోగికి రాసిన లేఖలో కాంగ్రెస్ మాజీ చీఫ్ విజ్ఞప్తి చేశారు.

మంగళవారం హత్రాస్‌లో స్వయం ప్రకటిత బాబా భోలే 'సత్సంగం' తొక్కిసలాటలో మొత్తం 121 మంది ఉన్నారు. వీటిలో ఎక్కువగా మహిళలు మరణించారు. శుక్రవారం ఉదయం హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట బాధితులను రాహుల్ పరామర్శించారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ఆదిత్యనాథ్ గతంలో ప్రకటించారు. దుర్ఘటనపై విచారణ జరిపేందుకు, తొక్కిసలాట వెనుక 'కుట్ర' ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు యోగి సర్కారు బుధవారం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

‘ఓదార్చేందుకు మాటలు రాలేదు..’

"దుర్ఘటన బాధాకరం. బాధిత కుటుంబాలను కలిసినపుడు వారిని ఓదార్చేందుకు నాకు మాటలు రాలేదు. పోయిన ప్రాణాన్ని తీసుకురావడం ఎవరివల్లకాదు. కానీ సాధ్యమయినంత వరకు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తాం.” అని రాహుల్ హిందీలో తన లేఖలో పేర్కొన్నారు. "పాలన లోపం వల్లే ఘటనకు కారణమని రాహుల్ ఆరోపించారు. దోషులకు ‘కఠిన శిక్ష’ విధించడం కూడా అవసరమన్నారు.

"ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడం మనందరి బాధ్యత. ఈ విషయంలో మీకు సాధ్యమైన సహాయాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా, నేను అందుబాటులో ఉన్నాం.”అని రాహుల్ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు, ఇద్దరు మహిళలు, ముగ్గురు సీనియర్ సిటిజన్‌లతో సహా తొమ్మిది మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. వీరితో సత్సంగానికి చెందిన "చాలా మంది గుర్తుతెలియని సేవాదార్లు (వాలంటీర్లు)" నిందితులుగా పేర్కొన్నారు.

Read More
Next Story