17 రోజులు.. 30 పుణ్యక్షేత్రాలు..
x

17 రోజులు.. 30 పుణ్యక్షేత్రాలు..

‘‘శ్రీ రామాయణ యాత్ర’’ను ప్రారంభించిన IRCTC.. ఏసీ బోగీల్లో ప్రయాణం.. స్టార్ హోటళ్లలో బస, భోజనం..


Click the Play button to hear this message in audio format

ఉత్తర్ ‌ప్రదేశ్‌(Utter Pradesh) లోని అయోధ్య(Ayodhya) రామాలయానికి పెరుగుతోన్న ప్రజాదరణ దృష్ట్యా.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) "శ్రీ రామాయణ యాత్ర" పేరుతో ప్రత్యేక రైలు నడపబోతుంది. 17 రోజుల పాటు సాగే ఈ రైలు యాత్రలో 30 పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తారు. జూలై 25న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. అయోధ్య నుంచి ప్రారంభమై నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి మీదుగా రామేశ్వరం చేరుకుని తిరిగి అక్కడి నుంచి ఢిల్లీకి వస్తుంది.


టికెట్ ధరలు..

త్రీటైర్ ఏసీ బోగీలో ఒక్కో ప్రయాణికుడికి రూ.1,17,975, 2 టైర్ ఏసీలో రూ.1,40,120, 1టైర్ ఏసీలో రూ.1,66,380, 1 ఏసీ కూపేకి రూ.1,79,515గా టికెట్ ధర నిర్ణయించారు. 1AC, 2AC, 3AC ప్రయాణికులకు త్రీస్టార్ హోటళ్లలో భోజన (శాఖాహారం మాత్రమే), వసతి కల్పిస్తారు. భక్తుల భద్రత దృష్ట్యా.. ప్రతి బోగీలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బందిని ఉంచుతారు.

తొలుత ఢిల్లీ నుంచి అయోధ్యకు..

ఢిల్లీ నుంచి బయలుదేరిన రైలు మొదటగా అయోధ్య చేరుకుంటుంది. శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కీ పైడి (సరయు ఘాట్)ల దర్శనం కల్పిస్తారు. తర్వాత నందిగ్రామ్‌లోని భారత్ మందిర్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బీహార్‌లోని సీతామర్హి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సీతాదేవి జన్మస్థలం, జనక్‌పూర్ (నేపాల్)లోని రామ్ జానకి ఆలయాలని రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తారు. తర్వాత రైలు బక్సర్‌‌ చేరుకుంటుంది. రామరేఖ ఘాట్‌, రామేశ్వరనాథ్ ఆలయం చూయిస్తాం. తరువాత వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, తులసీ మందిర్, సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ దేవాలయాలను తీసుకెళ్తాం. గంగా హారతి కూడా చూయిస్తాం.

తర్వాతి రెండు రోజులు రోడ్డు మార్గం గుండా ప్రయాగ్, శ్రింగ్‌వర్‌పూర్, చిత్రకూట్‌కు తీసుకెళ్తాం. చిత్రకూట్ నుంచి రైలు మహారాష్ట్ర వైపు వెళ్తుంది. నాసిక్‌ చేరుకున్న తర్వాత త్రయంబకేశ్వర్ ఆలయం, పంచవటి చూయిస్తాం. తర్వాత కృష్ణింధ నగరంగా భావిస్తున్న హంపికి రైలు చేరుకుంటుంది. హనుమంతుడి జన్మస్థలంగా పరిగణించే ఆంజనేయ కొండ, విఠల, విరూపాక్ష ఆలయానికి తీసుకెళ్తాం. చివరగా రైలు రామేశ్వరం చేరుకుంటుంది. రామనాథస్వామి ఆలయం, ధనుష్కోటి చూయిస్తాం. అక్కడి నుంచి రైలు ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతుంది." అని IRCTC ప్రకటన విడుదల చేసింది.

Read More
Next Story