
Rainfall | 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదు
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 41.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 101 ఏళ్ల క్రితం డిసెంబర్‌లో ఒకసారి అత్యధిక వర్షపాతం రికార్డు అయ్యిందని IMD వెల్లడించింది.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 41.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. డిసెంబర్ మాసంలో ఇంతటి భారీ వర్షపాతం మునుపెన్నడూ నమోదు కాలేదు. 101 ఏళ్ల క్రితం డిసెంబర్‌లో ఒకసారి మాత్రమే అత్యధిక రోజువారీ వర్షపాతం రికార్డు అయ్యిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. 1923 డిసెంబర్ 3న అత్యధిక వర్షపాతం 75.7 మిల్లీమీటర్లుగా రికార్డు అయ్యిందని IMD పేర్కొంది.
కాగా శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 12.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువ. ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్డ్ జారీ చేసింది IMD. గాలి నాణ్యత కూడా కాస్త మెరుగుపడింది. ఉదయం 9 గంటలకు AQI 152గా నమోదయిందని CPCB తెలిపింది.
AQI స్కేల్ ప్రకారం:
0 నుంచి 50 వరకు 'మంచిది' (good).
51 నుంచి 100 వరకు 'సంతృప్తికరమైనది' (satisfactory).
101 నుంచి 200 వరకు 'మధ్యస్థ' (moderate).
201 నుంచి 300 వరకు 'అధ్వానం' (poor).
301 నుంచి 400 వరకు 'మరీ అధ్వానం' (very poor).
401 నుంచి 500 వరకు 'తీవ్రం' (severe)