‘అగ్నివీర్’ లకు రిజర్వేషన్ ప్రకటించిన మరో రాష్ట్రం
x

‘అగ్నివీర్’ లకు రిజర్వేషన్ ప్రకటించిన మరో రాష్ట్రం

అగ్నివీర్ లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తామని తాజాగా రాజస్థాన్ ప్రకటించింది. ఇంతకుముందే కొన్ని రాష్ట్రాలు కూడా అగ్నివీర్ లకు..


అగ్నివీర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. జైలు, ఫారెస్ట్ గార్డులు, రాష్ట్ర పోలీసు ఉద్యోగాల నియామకంలో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రకటించారు.

శనివారం (జూలై 27) ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి ఒక ప్రకటనలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శర్మ అగ్నివీర్స్ కోసం ఈ ప్రకటన చేశారు. "దేశ సరిహద్దులను అంకిత భావం, దేశభక్తితో రక్షించే అగ్నివీరుల కోసం రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు, జైలు గార్డు, ఫారెస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్లలో రిజర్వేషన్ కల్పించింది" అని ప్రకటన పేర్కొంది.
"ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, దేశానికి సేవ చేసిన తర్వాత అగ్నివీర్లకు రాష్ట్రంలో పనిచేసే అవకాశం లభిస్తుంది" అని శర్మ పేర్కొన్నట్లు ప్రకటనలో పేర్కొంది. అయితే, అగ్నివీర్లకు ఈ సేవల్లో రిజర్వేషన్ శాతం ఎంత మేరకే కేటాయిస్తారో మాత్రం ఈ ప్రకటనలో వెల్లడించలేదు.
ఆర్మీ, నేవీ, వైమానిక దళంలో 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న యువకుల నియామయం కోసం 2022 లో కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. యుద్దరంగంలో ఎప్పుడు యువరక్తం ఉండేలా చూసుకోవడానికి భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన యువకులను రిక్రూట్ చేసుకుంటారు. ఈ పథకం కింద రిక్రూట్ అయిన వారిని అగ్నివీర్లు అంటారు.
వారి నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రతి బ్యాచ్ నుంచి రిక్రూట్ అయిన వారిలో 25 శాతం మందికి రెగ్యులర్ సర్వీస్ అందించబడుతుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు లేదా పారామిలటరీ బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ పోలీసు బలగాలలో పదవీ విరమణ చేసిన అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ కోసం ఇలాంటి ప్రకటనలు చేశాయి. ఈ పథకాన్ని రద్దు చేస్తామని విపక్షాలు ఇప్పటికే ప్రకటిస్తున్నాయి. కానీ 2024 ఎన్నికల్లో విపక్షాలు అన్ని కలిపి 230 సీట్లకే పరిమితం అయ్యాయి.
Read More
Next Story