మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం: జనరల్ ద్వివేదీ
x

మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం: జనరల్ ద్వివేదీ

దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సైన్యం తిప్పికొట్టగలదని కొత్తగా నియామకం అయిన జనరల్ ద్వివేది అన్నారు. వైమానిక దళం, నేవితో కలిసి పని చేస్తామని అన్నారు.


దేశం ఎదుర్కొంటున్న అన్ని భద్రతా సవాళ్లను భారత సైన్యం తిప్పికొట్టగలదని కొత్త చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించారు. ప్రపంచంలోని అతి పెద్ద సైన్యంలో ఒకటైనా భారత కాల్భానికి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన మాట్లాడారు. తమ మొదటి ప్రాధాన్యం వైమానికదళం, నావికాదళంతో కలిసి పని చేయడమని చెప్పారు.

సౌత్ బ్లాక్‌లో గార్డ్ ఆఫ్ హానర్‌ను స్వీకరించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. సైన్యం "అద్వితీయమైన కార్యాచరణ సవాళ్లను" ఎదుర్కొంటోందని, సైనికులకు అత్యాధునిక ఆయుధాలను సన్నద్ధం చేయడం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. భారత సైన్యం పూర్తి సామర్థ్యంతో ఉందని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉందన్నినేను పౌరులకు హమీ ఇస్తున్నాను అని జనరల్ చెప్పారు.
ఆధునిక ఆయుధాలు
స్వావలంబనను పెంపొందించడానికి స్వదేశీ-నిర్మిత మిలిటరీ హార్డ్‌వేర్‌ను చేర్చడాన్ని ప్రోత్సహిస్తామని ఆర్మీ చీఫ్ ప్రతిజ్ఞ చేశారు. "భౌగోళిక-రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వీటికి తోడు సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది" అని ఆయన అన్నారు. " వీటిని ఎదుర్కోవడానికి మన సైనికులను అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికతతో నిరంతరం సన్నద్ధం చేయడం, మా యుద్ధ-పోరాట వ్యూహాలను అభివృద్ధి చేయడం చాలా కీలకం." అని వివరించారు.
భారత సైన్యం మార్పు బాటలో పయనిస్తోందని, మిలటరీ హార్డ్‌వేర్‌లో స్వావలంబన సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు జనరల్ ద్వివేది తెలిపారు. "దీనిని సాధించడానికి, మేము స్వదేశీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తాము. మన దేశంలో తయారు చేయబడిన గరిష్ట యుద్ధ వ్యవస్థలు, పరికరాలను ప్రవేశపెడతాము" అని ఆయన చెప్పారు.
నేవీ, వైమానిక దళంతో మిళితం..
" నావికాదళం, వైమానిక దళం తో పూర్తి స్థాయిలో కలిసిపోతామని, దేశంలోని సంఘర్షణలన్నింటికి సమాధానం ఇస్తామని ద్వివేది చెప్పారు. 2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్నా లక్ష్యాన్ని సాధించడానికి తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు.
సైన్యంలోని సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించడానికి, మాజీ సైనికులకు వారి కుటుంబాలకు పూర్తి సాయాన్ని అందించడానికి తాను కట్టుబడి ఉన్నానని ఆర్మీ చీఫ్ చెప్పారు. జనరల్ ద్వివేది ఫిబ్రవరి 19 నుంచి ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేశారు. అతను అంతకుముందు 2022-24లో నార్తర్న్ కమాండ్‌కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి, జనరల్ ద్వివేది 1984లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్‌లోకి ప్రవేశించారు.
Read More
Next Story