సంజయ్‌కు మరణ శిక్ష పిటీషన్‌ను తిరస్కరించిన కోల్‌కతా హైకోర్టు
కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ ఘటనలో నిందితుడికి మరణ శిక్ష విధించాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశాయి.
కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్‌లో గతేడాది ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు ఇటీవల ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే తీర్పును సవాల్ చేస్తూ సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి.
జస్టిస్ దేవాంగ్సు బసాక్, మొహమ్మద్ సబ్బార్ రషీదీతో కూడిన ధర్మాసనం పిటీషన్‌ను విచారించించి. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ పిటీషన్‌ను మాత్రం విచారణకు స్వీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Hospital), ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేయడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తర్వాతి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోల్‌కతా హైకోర్టు సూచనతో కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారు. అక్టోబర్ 7న సీబీఐ(CBI) ట్రయల్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. జనవరి 20న ట్రయల్ కోర్టు రాయ్‌ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. ఈ శిక్షపై సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా హైకోర్టులో అప్పీలు చేశాయి. మరణదండన విధించాలని కోరాయి. జనవరి 27న ఈ రెండు అప్పీల్స్‌పై ఉత్తర్వుల్ని రిజర్వ్ చేసిన హైకోర్టు .. తాజాగా ఈ తీర్పును వెలువరించింది. ఇప్పటికే హైకోర్టు (Calcutta High Court) ఆదేశాల ప్రకారం బాధితురాలి తల్లిదండ్రులు, నిందితుడి కుటుంబం తాము నియమించిన న్యాయవాదుల ద్వారా కోర్టులో హాజరయ్యారు.