బీహార్ ఎన్నికలు: మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్..
x

బీహార్ ఎన్నికలు: మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్..

పాట్నాలో ప్రకటించిన కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్..


Click the Play button to hear this message in audio format

బీహార్‌(Bihar)లో ప్రతిపక్ష భారత కూటమి(I.N.D.I.A Alliance) తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ(RJD) నాయకుడు తేజస్వి యాదవ్‌(Tejashwi Yadav) పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ గురువారం ప్రకటించారు. రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే‌ కూడా తేజస్వికి మద్దతు పలికారని చెప్పారు.

ఇండియా బ్లాక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేష్ సాహ్ని ఉప ముఖ్యమంతి పదవి చేపడతారని, ఆయనతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తామని చెప్పారు.


'కూటమిలో చీలిక లేదు'

కూటమిలో చీలికలు వచ్చాయన్న వార్తలను గెహ్లాట్ కొట్టిపడేశారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. మహాఘట్‌బంధన్ బీజేపీ(BJP), జేడీ(యూ)‌లకు వ్యతిరేకంగా బలంగా పోరాడుతుందన్నారు.

కాంగ్రెస్(Congress) తన కూటమి భాగస్వామిని ఒప్పించడానికి గెహ్లాట్‌ను బుధవారం పాట్నాకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్విని కలవడానికి పంపారు. ఆసక్తికర విషయం ఏమిటంటే కూటమిలో ఐక్యత ఉందని కాంగ్రెస్ ప్రకటించుకున్నప్పటికీ, పాట్నాలో విలేకరుల సమావేశం జరిగిన వేదిక వద్ద ఉన్న బ్యానర్‌లో ఇండియా బ్లాక్ అగ్ర నాయకుల ఫోటోలు కనిపించలేదు. బ్యానర్‌లో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పెద్ద ఫోటో మాత్రమే ఉంది.

243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.

Read More
Next Story