న్యూస్ క్లిక్ పై రూ. 184 కోట్ల జరిమానా
x
ప్రబీర్ పుర్కాయస్థ

న్యూస్ క్లిక్ పై రూ. 184 కోట్ల జరిమానా

ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు న్యూస్ క్లిక్ పై ఆరోపణలు


Click the Play button to hear this message in audio format

న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’, దాని ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.184 కోట్ల ఫెమా జరిమానా విధించిందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. ఈ పోర్టల్ యాజమాన్యంలోని కంపెనీ PPK న్యూస్‌క్లిక్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ కు రూ.120 కోట్ల జరిమానా విధించబడిందని, రూ.64 కోట్ల ఉల్లంఘనలకు పుర్కాయస్థకు కూడా అదే ఉత్తర్వు జారీ చేసినట్లు తెలిపాయి.

ఈ సంస్థలు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలను "ఉల్లంఘిస్తున్నట్లు" రెండు అంశాలను గుర్తించినట్లు తెలిపాయి. సేవలు, ఎగుమతులను తప్పుగా చూపిస్తున్నట్లు, దీని ద్వారా నిధులను తప్పుగా ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది.

మనీలాండరింగ్ ఆరోపణలపై 2021 సెప్టెంబర్‌లో దేశ రాజధానిలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఉన్న న్యూస్‌క్లిక్ ప్రాంగణంపై ED మొదటిసారి దాడి చేసింది. ఈ కేసులో 25 మందికి పైగా వ్యక్తుల వాంగ్మూలాలను ఏజెన్సీ నమోదు చేసింది, వాటిలో పుర్కాయస్థ కూడా ఉన్నారు.

పోర్టల్, దాని ప్రమోటర్లు తప్పు చేశారని ఆరోపించడానికి బిజెపి 2023లో న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనాన్ని ఉటంకించింది. ఈ పోర్టల్ చైనా ప్రభుత్వ మీడియా సంస్థలతో దగ్గరగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.

అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘం నుంచి నిధులు తీసుకున్న గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగమని ఆ వార్తా కథనం పేర్కొంది. 2009లో స్థాపించబడిన పోర్టల్ తన వెబ్‌సైట్‌లో భారత్, ఇతర ప్రాంతాల నుంచి ప్రగతిశీల ఉద్యమాలపై దృష్టి సారించి వార్తలను కవర్ చేయడానికి అంకితమైన స్వతంత్ర మీడియా సంస్థ అని పేర్కొంది.

Read More
Next Story