అయ్యప్ప స్వామి దర్శనానికి ఆధార్ కార్డు తప్పనిసరి
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు. ఆన్‌లైన్‌లో పాటు రియల్ టైమ్ స్పాట్ బుకింగ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. స్పాట్ బుకింగ్ కింద 10 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకోసం ఆధార్ కార్డు చూపాల్సి ఉంటుంది.
మూడు చోట్ల స్పాట్ బుకింగ్ కేంద్రాలు
భక్తుల కోసం రియల్ టైమ్ ఆన్‌లైన్ స్పాట్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చారు. మూడు ప్రదేశాల్లో (వండిపెరియార్-పుల్మేడు, ఎరుమేలి-సత్రం, పంప) వద్ద బుకింగ్‌లు చేసుకోవచ్చు.
రోజూ 80 వేల మంది భక్తులకు దర్శనం..
"రోజుకు 80వేల మంది భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారి 70వేలు కాగా మిగతా 10వేల మంది స్పాట్ బుకింగ్ చేసుకున్న వారు ఉంటారు. వీరందరిని వారికి కేటాయించిన సమయంలోనే ఆలయంలోకి అనుమతిస్తాం" అని ప్రశాంతన్ చెప్పారు. మిత్రులు లేదా సహచరులతో కలిసి వచ్చిన వారంతా క్యూలో లైన్‌లో నిలుచోకుండా.. వారిలో ఒకరు మాత్రమే క్యూలో నిలుచుని మిగతా వారి వివరాలు నమోదు చేయించవచ్చని తెలిపారు. దర్శన తేదీని మార్చుకోవాలనుకునే భక్తులు ఇతరులకు అవకాశం కల్పించేందుకు తమ బుకింగ్‌ను రద్దు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల ప్రమాద బీమాకు బోర్డు హామీ ఇచ్చింది.