భారత్ కు చేరిన రెండో ఎల్పీజీ ట్యాంకర్
x
ముంద్రా పోర్టుకు చేరిన నందాదేవి ఎల్పీజీ ట్యాంకర్

భారత్ కు చేరిన రెండో ఎల్పీజీ ట్యాంకర్

ఉదయం ముంద్రా పోర్టుకు చేరిన నందాదేవి, పశ్చిమాసియాలోనే ఉన్న మరో 22 నౌకలు


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలోని కీలకమైన హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన భారత ఎల్పీజీ ట్యాంకర్ బుధవారం గుజరాత్ లోని ముంద్రా పోర్టు కు చేరింది. ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ముడిచమురు, గ్యాస్ సరఫరాను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఇంకా చిక్కుకుపోయిన మిగిలిన 22 భారతీయ నౌకల సురక్షితంగా ప్రయాణించడానికి వీలుగా భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపు ప్రయత్నాలు చేస్తోంది.

నందా దేవి అనే పేరుగల ఈ ఎల్పీజీ ట్యాంకర్ ఉదయం సుమారు 2.30 గంటలకు గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరుకుందని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు.

నౌక నుంచి నౌకకు బదిలీ

శివాలిక్ పేరుతో ఉన్న మరో ఎల్పీజీ ట్యాంకర్ సోమవారం ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఈ రెండు నౌకలు దేశంలో ఒక రోజు వంట గ్యాస్ అవసరానికి సమానమైన సుమారు 92,712 టన్నుల ఎల్‌పిజిని తీసుకువచ్చాయి. "ఆ రెండు నౌకలు (ఎల్‌పిజి) దించడం ప్రారంభించాయి.
ప్రస్తుతం, నందా దేవి మాతృ నౌక నుంచి మరో నౌకకు - షిప్-టు-షిప్ బదిలీ చేస్తోంది," అని సిన్హా మీడియా సమావేశంలో చెప్పారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారతీయ నౌకలకు సంబంధించిన ఎలాంటి ప్రమాదాలు జరగలేదని సిన్హా తెలిపారు.
రెండు ఎల్‌పిజి క్యారియర్లు మార్చి 13న తమ ప్రయాణాన్ని ప్రారంభించి, మార్చి 14 తెల్లవారుజామున హార్ముజ్ జలసంధిని దాటాయి. దీంతో యుద్ధ ప్రాంతం గుండా సురక్షితంగా ప్రయాణించిన భారత జెండా నౌకల సంఖ్య నాలుగుకు చేరింది.

మరో 22 భారతీయ నౌకలు..

ప్రస్తుతం 611 మంది నావికులతో కూడిన 22 భారత జెండా నౌకలు పశ్చిమ గల్ఫ్‌లోనే ఉన్నాయని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డిజి షిప్పింగ్) సమన్వయంతో కార్యకలాపాలను పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు. పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలమార్గమైన హార్ముజ్ జలసంధిని ఇజ్రాయెల్, అమెరికా దాడి తరువాత ఇరాన్ మూసివేసింది.
యుద్ధం ప్రారంభ సమయంలో జలసంధికి పశ్చిమ వైపున 24, తూర్పు వైపున 4 మొత్తం 28 భారత కలు ఉండేవి. ప్రస్తుతం, 22 నౌకలు పశ్చిమ వైపున, రెండు తూర్పు వైపున ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న నౌకలలో, టెర్మినల్‌పై దాడి జరిగినప్పటికీ యూఏఈలోని ఫుజైరా పోర్టు నుంచి సురక్షితంగా బయలుదేరిన 'జగ్ లాడ్కి' అనే ముడి చమురు ట్యాంకర్, సుమారు 80,800 టన్నుల ముర్బన్ ముడి చమురుతో మంగళవారం భారతదేశానికి చేరుకోనుంది. నౌకలోని 22 మంది భారతీయ నావికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఒమన్ నుంచి ఆఫ్రికాకు గ్యాసోలిన్‌ను తీసుకువెళ్తున్న 'జగ్ ప్రకాష్' అనే మరో ట్యాంకర్, జలసంధిని సురక్షితంగా దాటి టాంజానియాకు వెళ్తోంది.
మిగిలిన నౌకల సురక్షితంగా ప్రయాణించడానికి భారత అధికారులు సంబంధిత భాగస్వాములందరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని అధికారులు తెలిపారు. హార్ముజ్ జలసంధికి పశ్చిమ వైపున మిగిలి ఉన్న 22 భారత జెండా నౌకలలో, ఆరు ఎల్‌పిజి క్యారియర్లు, ఒకటి ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జి) ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, ఒకటి రసాయన ఉత్పత్తులను రవాణా చేస్తుండగా, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్లు ఉన్నాయి. అదనంగా, ఒక నౌక డ్రెడ్జర్, మరొకటి సరుకు లేకుండా ఖాళీగా ఉంది. మూడు సాధారణ నిర్వహణ పనుల కోసం డ్రై డాక్‌లో ఉన్నాయి. షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ రెండు ఎల్‌పిజి ట్యాంకర్ల సిబ్బందితో వీడియో ద్వారా సంభాషించారని సిన్హా తెలిపారు.


Read More
Next Story