‘ఓటమిని ఈసీ మీదకు నెట్టాలని చూస్తున్నారు.’
x

‘ఓటమిని ఈసీ మీదకు నెట్టాలని చూస్తున్నారు.’

రాహుల్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న అమిత్ షా.. హస్తం పార్టీ హామీలపై ఎలా స్పందించారు? గెలుపుపై ఆయన చెబుతున్న లెక్కలేంటి?


ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు) విషయంలో ఎన్నికల కమిషన్‌పై చేస్తున్న విమర్శలను షా తోసిపుచ్చారు. ఈవీఎం విధానం అనుసరించిన తెలంగాణ, పశ్చిమ సహా బెంగాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ ఓటమిని ఈసీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

“ఆ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయని ఒప్పుకుంటే.. ఈ ఎన్నికలు కూడా న్యాయబద్ధంగా జరిగినవే. ఓటమికి ముందుగానే ముందుగానే సాకులు వెతుకుతూ.. జూన్ 6న వెకేషన్‌కు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు షా.

‘‘ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోయినప్పుడల్లా సాకులు వెతుకుతారు. రాహుల్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు.. పోలింగ్ ప్రక్రియను ఈసీ సరిగా నిర్వహించలేదన్న అవాస్తవాన్ని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఎన్నికలకు ముందు పోల్ వాచ్‌డాగ్ కోసం సాంప్రదాయ సర్వసభ్య సమావేశంలో ప్రతిపక్ష పార్టీ అలాంటి అనుమానాలేమి లేవని చెప్పారు. ఈవీఎంలలో రిగ్గింగ్ జరిగే అవకాశం లేదు. వారు రిగ్గింగ్ చేసే ఎన్నికలను కోరుకుంటున్నారు.’’

UCC గురించి..

బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మిత్రపక్షాలతో మరోసారి విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి తెస్తామని షా చెప్పారు. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దాని వల్ల ఖర్చు తగ్గుతుందన్నారు.

‘‘UCC 1950ల నుంచి BJP ఎజెండాలో ఉండడం వల్ల BJP పాలిత ఉత్తరాఖండ్‌లో దాన్ని అమలులోకి వచ్చింది.

యూనిఫాం సివిల్ కోడ్ ఒక సామాజిక, చట్టపరమైన సంస్కరణ అని విశ్వసిస్తున్నా.'' అని అన్నారు.

‘400 మార్క్‌ దాటుతుంది’

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నాటికి తమ కూటమి 400 సీట్ల మార్కును అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు షా. లోక్‌సభ ఎన్నికలతో పాటు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌లో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

పార్టీ పూర్తిగా మోదీ మీద ఆధారపడి ఉందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. పేదల సంక్షేమం, సురక్షిత దేశం, ఆర్టికల్ 370 రద్దు, దేశవ్యాప్తంగా ఏకరూప చట్టం (యుసిసి), మహిళా రిజర్వేషన్ మోదీ అమల్లోకి తెచ్చారు. దాంతో సహజంగానే ఆయనకు ప్రజాదరణ బలపడుతుందన్నారు.

మోదీ మాటే.. మా మాట..

మతపరమైన కోటా, సంపద పునర్విభజన విషయంలో కాంగ్రెస్‌పై మోదీ దాడిని షా సమర్థించారు. ‘ముస్లిం రిజర్వేషన్ విషయంలో ప్రధాన ప్రతిపక్షం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వారు సత్యాన్ని ముక్కలు చేస్తే, వాటిని ఒకచోట చేర్చి ప్రజలకు తెలియజేస్తున్నాం. అది మా కర్తవ్యం. ’ అని చెప్పారు.

"రాహుల్ ఎక్స్‌రే ప్రసంగాన్ని మీరు విని అర్థం చేసుకుని ఉండవచ్చు. మీరు దానిని సమానంగా పంపిణీ చేయాలనుకుంటే, మీరు ఎవరికి పంపిణీ చేస్తారు? మైనారిటీలు వారి ప్రాధాన్యత అని మన్మోహన్ సింగ్ అన్నారు.’’ అని గుర్తు చేశారు.

‘అది కేవలం ప్రజాకర్షక హామీ’

పేద కుటుంబంలోని మహిళలకు రూ.లక్ష ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, అధికారంలోకి రావడానికి ప్రజాకర్షక హామీలు గుప్పించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.

‘‘రెండు మూడు రాష్ట్రాల్లో వారు అధికారంలో ఉన్నారు. అక్కడ కనీసం ఈ హామీనైనా నెరవేర్చాలి. రూ.లక్ష గురించి మాట్లాడేవారు.. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రూ. 1,500 ఇవ్వడం ప్రారంభించండి. జనం నమ్ముతారు.” అన్నారు

అమిత్ షా ధీమా..

పశ్చిమ బెంగాల్‌లో 24 నుండి 30 సీట్లు, ఒడిశాలో 16-17 మధ్య వస్తాయని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కూటమితో జతకట్టిన ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 17 స్థానాలను కైవసం చేసుకోనుంది. మూడు రాష్ట్రాల్లో వరుసగా 42, 21, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో 75 సీట్లను తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. ఆంధ్రాలో కూడా తమ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో అవినీతి, ఆవు, బొగ్గు అక్రమ రవాణా, చొరబాటు సమస్యలపై మమతా ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆమె బుజ్జగింపు రాజకీయాలు అక్కడ పనిచేయవన్నారు. ఆమె పాలనాతీరును సందేశ్‌ఖలీ ఘటన బట్టబయలు చేసిందన్నారు.

దక్షిణంపైనే గురి..

ఇప్పటివరకు పార్టీ పెద్దగా ముందుకు సాగలేకపోయిన రెండు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో బిజెపి పాగా వేసేందుకు మోడీ నాయకత్వం వహించారని, ఈ ఎన్నికలలో ఆ రాష్ట్రాల్లో తమ పార్టీ ఓట్ల శాతం పెరుగుతుందని షా పేర్కొన్నారు.

Read More
Next Story