ఆ ముగ్గురిని తొలగించిన లా కాలేజీ యాజమాన్యం
x

ఆ ముగ్గురిని తొలగించిన లా కాలేజీ యాజమాన్యం

కోల్‌కతా సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రాపై ఇప్పటికే పలు కేసులు..


Click the Play button to hear this message in audio format

కోల్‌కతాలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి (Gang rape) పాల్పడ్డ ముగ్గురిపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. నిందితుల్లో ఒకరు కాంట్రాక్టు లెక్చరర్ మోనోజిత్ మిశ్రా కాగా.. మరో ఇద్దరు సీనియర్ విద్యార్థులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ. మిశ్రా నియామకాన్ని రద్దు చేసిన కాలేజీ మేనేజ్‌మెంట్.. మిగతా ఇద్దరిని కాలేజీ నుంచి తొలగించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కుమార్ దేబ్ అధ్యక్షతన జరిగిన కళాశాల పాలకమండలి సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులంతా పోలీసు కస్టడీలో ఉన్నారు.

"మిశ్రా కాంట్రాక్టు రద్దు చేశాం. మిగతా ఇద్దరి విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించాం. సాధ్యమైనంత త్వరలో కాలేజీ(Law College)లో ఆరోగ్యకర వాతావరణం తీసుకువస్తాం. పరీక్షల షెడ్యూల్‌లో మార్పు ఉండదు. ప్రస్తుతానికి క్యాంపస్‌ మూసివేస్తున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు మాత్రం తెరిచి ఉంటుంది. విద్యార్థులు తమ ఎగ్జామినేషన్ ఫారాలను పూరించడానికి రావచ్చు. సెక్యూరిటీ సిబ్బందిని అలాట్ చేసిన ఏజెన్సీకి కూడా షోకాజ్ నోటీసు ఇచ్చాం. " అని పాలకమండలి చైర్మన్ దేబ్ తెలిపారు.

ఇకనుంచి క్యాంపస్‌లో మహిళా గార్డులు కూడా..

బాధితురాలు, ఆమె కుటుంబం అంగీకరిస్తే పాలకమండలే వైద్య ఖర్చులను మేమే భరిస్తుంది. కాలేజీ లోపల మరిన్ని CCTV కెమెరాలు అమరుస్తాం. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని తొలగించి కొత్తవారిని నియమిస్తాం " అని పాలకమండలి టీచింగ్ స్టాఫ్ ప్రతినిధి హరిపాద బానిక్ తెలిపారు. క్యాంపస్‌లో మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. నిందితులను కాలేజీ నుంచి బహిష్కరించడమే కాకుండా.. నేరస్థులకు కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నాం" అని కళాశాల వైస్-ప్రిన్సిపాల్ నైన ఛటర్జీ పేర్కొన్నారు.

కాలేజీ రికార్డుల ప్రకారం.. మిశ్రా 2013లో కాలేజీలో చేరాడు. అదే ఏడాది కాళీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపాడన్న ఆరోపణతో కాలేజీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత కొంతకాలం కనిపించకుండా పోయాడు. తరువాత 2017లో, 2022లో కాలేజీలో మళ్లీ అడ్మిషన్ పొందాడు. తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (TMCP) నిర్వహించే కార్యక్రమాల్లోనూ తరుచుగా పాల్గొనేవాడు. ‘‘డిసెంబర్ 2016లో బయటి వ్యక్తులను తీసుకొచ్చి కళాశాల ప్రాంగణాన్ని ధ్వంసం చేయించాడని మాజీ విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా కస్బా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది’’ అని మాజీ విద్యార్థి టైటాస్ మన్నా స్థానిక వార్తా ఛానెల్‌కు చెప్పారు.

Read More
Next Story