గాయని ‘చిత్ర’ వీడియో పై అభ్యంతరం వ్యక్తం చేసిన రచయిత్రి
x

గాయని ‘చిత్ర’ వీడియో పై అభ్యంతరం వ్యక్తం చేసిన రచయిత్రి

దేశమంతా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన అక్షతల పంపిణీ జరుగుతోంది. ఈ కార్యక్రమం కేరళలో రాజకీయ వేడిని రాజేసింది.


ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన అక్షితలు స్వీకరించిన అనంతరం గాయని కేఎస్ చిత్ర సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. "శ్రీ రామచంద్ర ప్రభుకు అంకితమైన భజనలు, కీర్తనలు పఠించాలని ఆకాంక్షించారు. ప్రాణ ప్రతిష్ట సమయంలో ప్రతి ఇంటిలో ఐదు దీపాలు వెలిగించి శ్రీరాముడి అనుగ్రహం పొందండి" అని వీడియోలో ప్రజలను కోరారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

వీరిలో ప్రముఖ మలయాళ రచయిత్రి ఇందుమీనన్, నేపథ్య గాయని పుష్పవతి పొయ్యప్పదత్ ఉన్నారు. " రామమందిర నిర్మాణం అనేకమంది ఊచకోతతో సంబంధం ఉన్న అంశం, దాని ఆమోదించడం అంటే క్రూరత్వాన్ని అంగీకరించినట్లు" అని ఇందుమీనన్ రాసుకొచ్చారు. అయితే గాయని చిత్ర భావప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తున్నాని అందులో వివరించే ప్రయత్నం చేశారు.

గాయని పుష్ఫవతి " అక్షితలు అంటే బాధలేనిది అనే అర్థం అని, అయితే రామమందిరాన్ని మాత్రం కొట్లమందిని బాధపెట్టి నిర్మించారు, అందుకే సంఘ్ పరివార్ అక్షితలు తీసుకోవడానికి నిరాకరించాను" అని పోస్టులో రాసుకొచ్చారు.

తిప్పికొట్టిన వీహెచ్ పీ

గాయని చిత్రకు వీహెచ్ పీ మద్దతు ప్రకటించింది. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పాల్పడుతున్నాయని ఆరోపించింది. " చిత్రతో సహ రామమందిరానికి మద్దతిస్తున్నఅందరికీ వీహెచ్ పీ సంఘీభావం తెలియజేస్తుంది. ఇదీ హిందువులపై దాడిగానే పరిగణిస్తుంది, భారత్ ను తమ దేశంగా భావించే వారు చిత్రకు రక్షణగా నిలబడాలని" వీహెచ్ పీ రాష్ట్ర అధ్యక్షుడు విజి తంజీ పిలుపునిచ్చారు. కాగా, శ్రీ రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన అక్షతలను కేరళలోని సంఘ్ పరివార్ కార్యకర్తలు ఇంటికి పంచే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా గాయని కేఎస్ చిత్ర, నటుడు మోహన్ లాల్, దిలీప్, దర్శకుడు జోషి, శ్రీనివాసన్ ను కలిసి అక్షింతలను అందజేశారు.

కేరళలో హిందుత్వానికి పెరుగుతున్న మద్దతు

కేరళలో ఆర్ఎస్ఎస్ 80 వ దశకంలో అడుగుపెట్టింది. అయితే వారికి ఆదరణ దక్కింది మాత్రం 2018 శబరిమల ఉద్యమం తరువాతనే అని చెప్పవచ్చు. 2019 లో సీట్లు గెలవకపోయినా వారి ఓట్లశాతం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అక్కడి కులరాజకీయ వ్యవస్థలు కూడా రాముడి అక్షితల కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా నాయర్ సర్వీస్ సొసైటీ(NSS), శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం(SNDP) వంటివి దీనిని ఆమోదించాయి. ఈ కార్యక్రమం ద్వారా వారికి నాయర్ ఓట్లు, చాలాకాలంగా సీపీఐ(ఎం) మద్దతుగా ఉన్న ఈజ్వా ఓట్లను పొందవచ్చని అంచనాలున్నాయి. మరోవైపు సీపీఎం ప్రభుత్వంలోని మంత్రి కేజీ గణేష్ కుమార్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి అక్షితలను స్వీకరించారు. దీనితో వామపక్షవాదులు ఇబ్బందులో పడ్డారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ సైతం రామమందిరాన్ని దర్శించి పూజలు చేస్తానని ప్రకటించారు.




సెలబ్రిటీల మద్ధతు ఎందుకంటే..

దేశంలోని మెజారిటీ హిందువులకు రామమందిర నిర్మాణ విషయంలో ఎలాంటి అభ్యంతరాలులేవని బెంగళూర్ లోని యూనివర్శిటీ ప్రొఫెసర్ శ్రీజిత్ కడియాకోల్ అన్నారు. " అప్పట్లో రామజన్మభూమి వివాదం అల్లర్లుగా ముద్ర వేయబడ్డాయి, దాంతో తమ లౌకికి ఇమేజ్ కు డ్యామేజ్ కలుతుందనే భావనలో సెలబ్రీటీలు ఉండేవారు. 2019 లో సుప్రీం కోర్టు దీనిపై తుది తీర్పు ఇవ్వడంతో బహిరంగంగా మద్దతును ప్రకటిస్తున్నారు" అని ఆయన వివరించారు.

వామపక్షాల ప్రతివ్యూహం

జనవరి 20 నుంచి కూడా కేరళలో సీపీఎం పార్టీ మానవహరాన్నిచేపట్టాలని పిలుపునిచ్చింది. తిరువనంతపురం నుంచి కాసర్ గోడ్ వరకూ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రప్రభుత్వం కేరళను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తోంది. అలాగే ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా డీవైఎఫ్ఐ కార్యకర్తలు అనేకమంది ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటోంది. వారి ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చూస్తోంది. అయితే ఇవన్నీ వచ్చే లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న రాజకీయాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read More
Next Story