
డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గురించి 20 ముఖ్యాంశాలు
ప్రముఖ తమిళనటుడు ఒకప్పటి స్ఠార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు.
ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయనకు కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కోలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొంతమంది నటులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయ్ కాంత్ గురించి ఇరవై అంశాలు మీకోసం
1. విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. ఆగష్టు 25, 1952 లో జన్మించారు. తల్లిదండ్రులు కే.ఎన్ అళగర్ స్వామి,అండాళ్.
2. 27 ఏళ్లకు విజయ్ కాంత్ ప్రతినాయక పాత్రలో తెరపై కనిపించారు. ఆయన తొలి సినిమా ‘ఇనిక్కుమ్ ఇలమై’.
3. ‘దూరతు ఇడి ముళక్కం, సత్తం ఓరు ఇరుత్తరై’ అనే రెండు సినిమాలతో హీరోగా విజయం అందుకున్నారు. వీటికి ఏ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
4. ఇప్పటి వరకూ 150 సినిమాల్లో నటించారు. , ఆయన ఆఖరి సినిమా ‘సగప్తం’. ఇది 2015లో విడుదల అయింది.
5. విజయ్ కాంత్ కు పోలీస్ అధికారి పాత్రల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆయన తన సినీ కెరీర్ లో దాదాపు 20 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.
6. విజయ్ కాంత్ రోజుకు మూడు షిప్టుల్లో పని చేసేవారు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదల అయ్యాయి.
7. హీరో, ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు ఎవరైనా సరే ఇతర భాషల్లో కనీసం ఒక్క చిత్రంలో అయినా నటించారు. కానీ విజయ్ కాంత్ తన కెరీర్ లో ఒక్క తమిళ్ లో తప్పా మరో భాషలో నటించలేదు.
8.ఆయన వందో చిత్రం ‘కెప్టెన్ ప్రభాకరన్’, బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించింది. అక్కడి నుంచి విజయ్ కాంత్ ను అభిమానులు కెప్టెన్ గా పిలవడం ప్రారంభించారు.
9. విజయ్ కాంత్ దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ‘విరుధగిరి’. ఇందులో తనే హీరోగా నటించారు.
10. ఒకప్పుడు కమల్, రజనీలకు గట్టి పోటీ ఇచ్చింది విజయ్ కాంత్ సినిమాలే.
11.తమిళనాడులో విజయ్ కాంత్ ‘కరుప్పు ఎంజీఆర్’ గా పిలుస్తారు. కెప్టెన్ కంటే ముందు అభిమానులు ఇదే పేరుతో పిలిచేవారు. కరుప్పు అంటే నల్లనిది, చీకటి అని అర్ధం. ఆయన శరీరం రంగు తో పాటు గుప్త దానాలు చేయడంలో ఆయనకు ఆయనకే సాటి అని ఈ పేరుతో పిలిచేవారు.
12. విజయ్ కాంత్ నిర్మాతగా వల్లారసు, నరసింహం, సగప్తం వంటి చిత్రాలను నిర్మించారు.
13. విజయ్ కాంత్ 1994 లో తమిళనాడు ఫిల్మ్ ఆనరరీ అవార్డు అందుకున్నారు.
14. ఎల్టీటీఈ ప్రభాకరన్ కు , విజయ్ కాంత్ మద్దతుదారుగా నిలబడ్డారు. ప్రభాకరన్ కు మద్దతు ఇవ్వట్లేదని డీఎంకే, అన్నాడీఎంకేలను అనేక సందర్భాల్లో ఇరుకున పెట్టారు.
15.2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 8.38 శాతం ఓట్లను సాధించారు. తరువాత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి 10.39 శాతం ఓట్లను సాధించారు.
16. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఓకే ఒక సీటును డీఎండీకే సాధించింది.
17. 2011 ఎన్నికల్లో డీఎండీకే పార్టీ ఏకంగా 29 స్థానాలు గెలచుకుంది. తమిళనాడులో తన ప్రాభావాన్ని గణనీయంగా పెంచుకుంది.
18. జయలలిత, వీకే శశికళ, చో రామస్వామి కలిసి విజయ్ కాంత్ ను ఈ పొత్తుకు ఒప్పించారు.
19. 2016 ఎన్నికల్లో డీఎండీకే పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అప్పటికే ఆయన విజయ్ కాంత్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభం అయింది.
20. తమిళనాడులో మూడో ఫ్రంట్ నిర్మించి, అధికారంలోకి రావాలనే విజయ్ కాంత్ ఆశలు నెరవేరకుండానే ఆయన మృత్యుముఖంలోకి చేరుకున్నారు.