మరో మలయాళీ దర్శకుడిపై లైంగిక వేధింపుల కేసు
మల్లువుడ్ లో లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా నిర్మాత, దర్శకుడిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.
మలయాళ చిత్రపరిశ్రమను లైంగిక వివాదాలు కుదిపేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జస్టిస్ హేమ కమిటీతో పరిశ్రమలో కల్లోలం రేగిన సంగతి తెలిసిందే. చాలామంది మహిళా నటులు ఏవిధంగా లైంగికంగా వేధించబడ్డారో కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ వివాదం సద్దుమణగకముందే మరో దర్శకుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ వ్యక్తి తాజాగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడు 2012లో బాలకృష్ణన్ రచించి నిర్మించిన చిత్రం 'బవుత్తియుడే నమతిల్' చిత్రీకరణ సమయంలో నటుడు మమ్ముట్టిని కలవడానికి వెళ్ళినప్పుడు కోజికోడ్‌లో దర్శకుడిని కలిశానని పేర్కొన్నాడు.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం, డైరెక్టర్ తన ఫోన్ నంబర్‌ను సంపాదించి, డిసెంబర్ 2012లో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హోటల్‌కు తనను ఆహ్వానించాడని, అక్కడ అతను తనకు మద్యం అందించి లైంగికంగా వేధించాడని ఫిర్యాదుదారు ఆరోపించాడు.
" మొదట కేరళలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేయబడింది. అయితే కేసు బెంగళూరుకు బదిలీ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో లైంగిక వేధింపుల సంఘటన జరిగింది. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
"ఈ సంఘటన 2012లో జరిగిందని తెలుస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలోని అనేక మంది కళాకారుల లైంగిక వేధింపులపై వరుస ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదుదారు ఇప్పుడు బయటకు వచ్చాడు. తన ఫిర్యాదును నమోదు చేయడానికి ధైర్యం ఇచ్చిందని అతను పేర్కొన్నాడు" అని అధికారి తెలిపారు.
"ఫిర్యాదు ఆధారంగా, డైరెక్టర్‌పై BIAL (బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్) పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 26 న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 377 (అసహజ నేరాలు), 66 E (గోప్యత ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు," అని బాధితుడు చెప్పాడు.
Next Story