ప్రకాశ్ రాజ్ కంట తడి పెట్టించిన సినిమా అది...
x

ప్రకాశ్ రాజ్ కంట తడి పెట్టించిన సినిమా అది...

ఉత్సవ్ గోన్వార్ అనే యువ దర్శకుడు తీసిన ఓ 97 నిమిషాల సినిమా ‘ఫొటో’ చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇంతకీ ఏమిటా సినిమా?


అయితే తన మాతృభాష లో కన్నడలో కొత్త దర్శకులు చేస్తున్న ప్రయోగాలు ఆయనను సంతోష పెట్టలేకపోతున్నాయి.

అయితే ఉత్సవ్ గోన్వార్ అనే యువ దర్శకుడు తెరకెక్కించిన ఓ 97 నిమిషాల సినిమా ‘ఫొటో’ మాత్రం తనను కదిలించిందని అంటున్నారు. ఆ చిత్రం చూసి కళ్లు చెమ్మగిల్లాయని, అసలు తనెందుకు ఈ చిత్రాన్ని ఇంత ఆలస్యంగా చూశా అని మదనపడ్డారు. చివరకు ఈ సినిమాను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నారు.

ఇంతకుముందు మార్చిలో జరిగిన ‘బెంగళూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(BIFFS)’ కన్నడ విభాగంలో ప్రదర్శించబడి, అవార్డును కూడా గెలుచుకుంది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే చలన చిత్రోత్సవాల పోటీల్లో పాల్గొనేందుకు సిద్దమైంది. ఈ మధ్య బెంగళూర్ లో సూరి దర్శకత్వం వహించిన బగీరా సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిసిన 'ఫెడరల్' తో పలు విశేషాలు పంచుకున్నారు.

ఫొటో సినిమా గురించి ఆయన మాటల్లో..

బెంగళూర్ లో జరిగిన చలనచిత్ర పోటీల్లో దాదాపు 50 కి పైగా చిత్రాలు ప్రదర్శించారు. అయితే వీటన్నింటిని ఫొటో మైమరిపించింది అంటూ డైరెక్టర్ గురించి వివరించారు. దర్శకుడు ఉత్సవ్ రాయచూర్ చెందిన వాడు.. కోవిడ్ సమయంలో ఓ పత్రికలో రాసిన వార్తను చూసి ఈకథను రాసుకున్నాడు. దాన్ని సినిమాగా మలిచి నాకు ఫోన్ చేసి చూడమన్నాడు.

ఈ సినిమా గురించి సినీ పరిశ్రమ, రంగస్థలం, సాహిత్యం తెలిసిన నా స్నేహితులు కూడా గొప్పగా చెప్పారు. కానీ నాకు తీరిక లేక చూడలేదు. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకుని శ్రీ రంగ పట్టణంలోని లోకపావన నదీ ఒడ్డున ఉన్న కే. శెట్టిహళ్లిలోని నా గార్డెన్ కు ఉత్సవ్ వచ్చాడు. మాటల్లో ఉండగానే నా సినిమా చూడమని కోరాడు. నాతో పాటు కవితా లంకేష్ లాంటి వారు కూడా చూశారు. సినిమా చూస్తుంటే నా కళ్లు చెమ్మగిల్లాయి. ఈ సినిమాను ప్రొత్సహించాలని అనుకున్నానని అంటూ సినిమా కథను చెప్పడం ప్రారంభించారు.

హర్ట్ టచింగ్ స్టోరీ

కోవిడ్ తొలి దశలో ఉన్న పరిస్థితులను ఈ చిత్రంలో చూపించారు. బెంగళూర్ కు నాలుగువందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామం నుంచి పని వెతుక్కుంటూ వచ్చిన ఓ దినసరి కూలీ, తన చిన్న కుమరుడిని కౌగిలించుకుని పడుతున్న వేదన గురించి స్పష్టంగా చూపిన చిత్రమిది. మహమ్మారీ వేగంగా విస్తరిస్తుండడంతో నగరంలోని ఓ రేకుల షెడ్డులో తలదాచుకున్న తండ్రి, కొడుకులు కాలినడకన ఇంటికి ప్రయాణ మవుతారు. అయితే ఈ ప్రయాణంలో కఠిన వాతావరణం, ఆకలి బాధ వల్ల వారు గమ్యం చేరకుండ చేస్తాయి. ఈ చిత్రం ప్రకాష్ రాజ్ ను ఏంటీ మనిషన్న ఎవరినైనా కదిలిస్తాయి.

వెట్రీ మారన్ సాయం

ప్రకాష్ రాజ్ ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి నిశ్చయం చేసుకున్నాక ఇదీ విని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కూడా దీనికి తన వంతు సాయం చేస్తానని మాటిచ్చాడు. మిగిలిన స్నేహితులు సైతం ఈ సినిమాకు సాయం చేస్తామని వాగ్ధానం చేశారని ఆయన చెప్పారు.

ప్రకాష్ రాజ్ చేతిలో మూడు కన్నడ సినిమాలే కాకుండా తెలుగులో పవన్ కల్యాణ్, తమిళంలో ధనుష్ వంటి అగ్ర హీరోలతో నటిస్తున్నాడు. ఈ మధ్య వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదలై’ సినిమా మొదటి భాగంలో విజయ్ సేతుపతితో కలిసి నటించారు. " ఈ మధ్య చిత్రానికి సంబంధించిన వ్యక్తి ఫోన్ చేసి, నీ పాత్ర పరిధి రోజు రోజుకు ఈ సినిమాలో పెరుగుతోంది నాలో ఉత్సాహం పెరుగుతోంది" అని ప్రకాష్ రాజ్ అన్నారట.. ఆయన ఫెడరల్ చెప్పారు.

అలాగే ఓ వెబ్ సిరీస్, మరో ఫ్రెంచ్ సినిమాలో నటిస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ వెబ్ సిరీస్ పేరు చీకు. ఈ కాలానికి తగిన సినిమా అనవచ్చు. దీంట్లో తండ్రి పాత్ర పోషిస్తున్నాను. జనరేషన్ గ్యాప్ కారణంగా 24 ఏళ్ల కొడుకుతో తండ్రికి జరిగే సంఘర్షణ ఈ చిత్రంలో చూపించారు. స్వచ్ఛమైన మట్టిలో నుంచి పుట్టిన కథ

ఫ్రెంచ్ చిత్రం గురించి చెప్పాలంటే చాలా ఉంది. పారిస్ లో నివసిస్తున్న తమిళ మూలాలు ఉన్న శ్రీలంక జాఫ్నాకు చెందిన కొంతమంది యువకులు సినిమా తీస్తున్నారు. తాము శ్రీలంక నుంచి ప్యారిస్ కు వచ్చినప్పటికీ అప్పటి అనుభవాలు ఎలా వేటాడాయో ఇందులో వివరిస్తున్నారు. కథ చెబుతున్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. ఇంతకుముందు మణిరత్నం తీసిన ‘కన్నతిల్ ముత్తమిట్టల్’ లో హెరాల్డ్ విక్రమ సింఘే పాత్ర పోషించాను. ఇదీ కూడా శ్రీలంక జాతికి చెందినదే. కానీ ఈ యువకులు తమ తరంలో దృష్టిలో సినిమా చూస్తున్నారు.

సినిమాలకు విరామం ఇవ్వడానికి కారణం

ఐదు సంవత్సరాల క్రితం బెంగళూర్ సెంట్రల్ నుంచి లోక్ సభ కు పోటీ చేశాను. అప్పుడు దాదాపు పది నెలలు సినిమాలకు దూరంగా ఉన్నాను. అయితే మళ్లీ లోక్ సభ ఎన్నికలు జరగుతున్నాయి కదా అని అపార్థం చేసుకోవద్దు. నేను సాధారణంగా నాలుగు నెలలు అలా దూరంగా ఉన్నాను. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. సాధారణ పౌరుడిగా మాత్రం ఉంటాను. శ్రీరంగ పట్నంలో ప్లాంటేషన్ అభివృద్ది చేసుకుంటున్నాను. కూరగాయాలు సాగు, నాకు ఇష్టమైన రచనా వ్యాసంగం చేసుకుంటున్నానని మనసులో మాట చెప్పారు. రచనలు అన్నీ కూడా ప్రకృతితో సంబంధం ఉన్నవే అన్నారు.

నిర్థిగంట అనే థియోటర్ నా కలల ప్రాజెక్ట్

నిర్థిగంట అనే థియోటర్ ప్రాజెక్ట్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. కొత్తతరం రంగస్థల పరిధిని విస్త్రృతం చేసే ప్రయత్నం. రంగస్థలం మెల్లగా కొల్పోతున్న నమ్మకాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న. దీనికి నా సొంత సంపాదన కేటాయించాను. ఇక్కడ నిర్ఠిష్టంగా సొంత సిలబస్ ఏం లేదు. థియెటర్ వ్యవస్థకు గౌరవం తెస్తుంది. ఇంకో రెండేళ్లలో ఫలితం మీకే తెలుస్తుందని ప్రకాష్ రాజ్ ధీమా గా చెప్పారు. ఇది కూడా మరో అన్వేషణ లాంటిదే అని ముగించారు.

Read More
Next Story