
అమిత్ షా తో భేటీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందన్న పళని స్వామి
తమిళనాడు లో ఎన్డీఏను ముందుకు నడిపిస్తున్న అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి (Edappadi K Palaniswami) బుధవారం రాత్రి (జనవరి 7) ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తన నివాసంలో కలిశారు.
ఆయన తిరుగు ప్రయాణంలో ఢిల్లీ విమానాశ్రాయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి ఈ మధ్య పుదుక్కోట్టేకై వచ్చినప్పుడూ కలవలేకపోయానని, అందుకే ప్రస్తుతం ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు.
తమిళనాడు(Tamil Nadu)లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఇద్దరం చర్చించుకున్నామని చెప్పారు.ఈ భేటీలో ఇతర పార్టీలతో పొత్తుల గురించి తమ మధ్య చర్చ జరగలేదన్నారు. తమిళనాడులో ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేయడమే తమముందున్న ప్రస్తుత లక్ష్యమని పేర్కొన్నారు.
అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకోనని కూడా చెప్పారని పళనిస్వామి వివరించారు.

