అన్నాడీఎంకే ఆందోళనలు.. సీబీఐ విచారణ కోరుతూ నిరసనలు
x

అన్నాడీఎంకే ఆందోళనలు.. సీబీఐ విచారణ కోరుతూ నిరసనలు

కల్తీ మద్యం తాగి హూచ్ లో 60 మంది మరణించిన సంఘటనపై అన్నాడీఎంకే ఆందోళనలు ఉధృతం చేసింది. ఈ ఘటనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని కోరింది.


కల్తీ సారా తాగి తమిళనాడులోని కళ్లకురిచి హూచ్ లో 60 మంది ప్రజలు మరణించిన ఘటనపై ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ ఆందోళనలు ఉధృతం చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు గురువారం ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించారు.

ప్రస్తుతం తమిళనాడులో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే శాసనసభలో ఆందోళనలు చేసినందుకు గాను అన్నాడీఎంకే పార్టీ శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారంతా నల్ల చొక్కాలు ధరించి, చెన్నైలోని రాజరథినం స్టేడియంలో ఉదయం 9 గంటలకు తమ నిరాహార దీక్షను ప్రారంభించారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రకారం, రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడానికి అధికార పక్షం అనుమతి ఇవ్వడం లేదు. అందుకే ఈ దీక్షను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై సీబీఐ విచారణకు అప్పగించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని పళని స్వామి ప్రకటించారు. ‘‘ ఇది తమిళనాడు బర్నింగ్ ఇష్యూ, అయినప్పటికీ అసెంబ్లీలో ఎలాంటి దీనిపై చర్చలు జరపడానికి అధికార పక్షం ఒప్పుకోవడం లేదు’’ అని అన్నాడీఎంకే నేత జయకుమార్ విమర్శించారు.

60 మందికి పైగా మరణించిన హూచ్ దుర్ఘటనపై ' చర్చను తిరస్కరించడం', అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తొలగించడం, సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. హూచ్ మరణాలపై చర్చ జరగకుండా డీఎంకే డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. గురువారం సాయంత్రం తరవాత దీక్ష విరమించే అవకాశం ఉంది.
Read More
Next Story