మీ వల్లె ఇదంతా: స్టాలిన్ సర్కార్ పై ‘తమిళిసై’ పరోక్ష విమర్శలు
x
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

మీ వల్లె ఇదంతా: స్టాలిన్ సర్కార్ పై ‘తమిళిసై’ పరోక్ష విమర్శలు

పుదుచ్చేరికి వచ్చే డ్రగ్స్ మొత్తం కూడా తమిళనాడు కేంద్రంగా ఉందని లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్టాలిన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.


కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈ మధ్య తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక వేధింపులు, హత్య విషయంలో తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లు తమిళనాడులోని మాఫియాతో బలమైన సంబంధాలు పెట్టుకున్నారని పుదుచ్చేరీ లెప్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను వారు తోసిపుచ్చారు. అయితే జరిగిన హత్య మాత్రం పెరుగుతున్న డ్రగ్స్ ముప్పును బయటపెట్టింది. అలర్ట్ సంకేతాలను సమాజానికి, ప్రభుత్వానికి అందించింది.

తమిళనాడు పోలీసులు చెబుతున్న దాని ప్రకారం డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకోవడానికి పాఠశాలలు, కళాశాలల స్థాయి నుంచి నార్కోటిక్ సెల్స్ ను ఉపయోగించాలని చెబుతున్నారు. పక్కరాష్ట్రాలతో వీరికి బలమైన సంబంధాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్ పెడ్లర్లుగా యువతే ఎక్కువగా ఉన్నారని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సౌందరరాజన్ ఆరోపణలకు కారణం ఏమిటి?
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ అయిన తమిళి సై డ్రగ్ మాఫియాకు తమిళనాడు కేంద్రంగా ఉందని పరోక్షంగా స్టాలిన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. పుదుచ్చేరిలో జరుగుతున్న నేరాలకు డ్రగ్ డీలర్ గా ఉన్న జాఫర్ సాధిక్ కు రాజకీయ నాయకులు, అతడి మద్దతుదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ తొమ్మిదేళ్ల బాలిక పై జరిగిన హత్య పై పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారని, ఇందులో 19 ఏళ్ల యువకుడు అసలు సూత్రధారిగా తేలిందని పేర్కొన్నారు.
అయితే లెప్టినెంట్ గవర్నర్ ప్రకటన రాగానేతమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు పుదుచ్చేరిలో నేరాలకు కారణంగా తమిళనాడు కాదని గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని డ్రగ్ నెట్‌వర్క్‌లు అసలు మూలమని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.మాపై నిందలు వేయకుండా దానిని పట్టుకోవడానికి చొరవ చూపాలని కోరారు.
విద్యార్థులే డ్రగ్ పెడ్లర్లు గా..
డ్రగ్స్ ను సరఫరా చేసే నేరాల్లో విద్యార్థులే ముందుంటున్నారని చెన్నైలోని ఆక్టివిస్టు సిరిల్ అలెగ్జాండర్ అంటున్నారు. ఈ మధ్య మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డ పలు కేసులను ఆయన ప్రస్తావించారు.అయితే ఇవి మొత్తం సప్లై లో కేవలం 1 శాతం కూడా ఉండదని, బయట పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నాయని తెలుస్తోంది.
''డ్రగ్స్‌ వ్యాపారం చేసినందుకు మద్రాసు హైకోర్టు ఈ ఏడాది జనవరిలో ఇద్దరు కాలేజీ విద్యార్థులకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పలు డ్రగ్ డీలర్లకు, వీరికి మంచి సంబంధాలుండేవి. మరో కేసులో పుదుచ్చేరిలోని ఇద్దరు వైద్య విద్యార్థులు, వారి స్నేహితులు తమ అపార్ట్‌మెంట్‌కు సమీపంలో గంజాయి మొక్కను నాటారని వారిని అరెస్టు చేశారు. కళాశాల స్థాయి నార్కోటిక్ బృందాలు చురుకుగా లేనందున అనేక వారాల పరిశోధన తర్వాత ఘటనలు బయటకు వచ్చాయి.” అని అలెగ్జాండర్ ఫెడరల్‌తో అన్నారు.
విద్యార్థులను ఎలా..
డ్రగ్ పెడ్లర్లుగా విద్యార్థులను మార్చడానికి ముందు వివిధ కాలేజీలను తరుచూ సందర్శిస్తూ ఉంటారు. అలా మెల్లిగా పరిచయం పెంచుకుని ఉచ్చులోకి లాగుతారు. ఎక్కువసార్లు స్కూల్ డ్రాపౌట్లే ఎక్కువగా డ్రగ్ సరఫరాదారులుగా మారుతున్నారు. పాకెట్ మనీ కోసం త్వరగా డబ్బులు సంపాదించాలనుకునే విద్యార్థులు కొన్ని సందర్భాల్లో ఆపరేటర్‌లుగా వ్యవహరిస్తుండగా, డ్రగ్స్ బానిసలు తమ ముఠాను బలోపేతం చేసేందుకు ఇతర విద్యార్థులను బానిసలుగా మారుస్తారని పాండిచ్చేరి యూనివర్శిటీలోని ఇద్దరు విద్యార్థులు ఈ పరిస్థితిపై చెప్పారు.
“ముఠా నుంచి ఒక వ్యక్తి కొంతమంది విద్యార్థులను తీసుకుని టూర్ ప్లాన్ చేస్తాడు. అది సామాన్యంగా జనం తక్కువగా ఉండే ప్రదేశాలు ఎంపిక చేస్తారు. తరువాత వారికి మెల్లిగా డ్రగ్స్ అలవాటు చేస్తారు. అలా వాళ్ల ట్రాప్‌లో పడిన కొంతమంది విద్యార్థులు నెట్‌వర్క్‌లో భాగమవుతారు, వారిలో కొందరు ఇతర క్రియాశీల ఆపరేటర్‌లను కూడా నియమించుకుంటారు, ”అని విద్యార్థి ఒకరు చెప్పారు.
'కాగితంపై మాత్రమే యాంటీ నార్కోటిక్ సెల్స్'
దాదాపు అన్ని కాలేజీల్లో యాంటీ నార్కోటిక్ సెల్స్ ఉన్నాయి అయితే ఇవన్నీ నామమాత్రం. అసలు ఉన్నట్లే ఎవరికీ తెలియవు.కళాశాలల్లో యాంటీ నార్కోటిక్ సెల్స్ గురించి సౌందరరాజన్‌ని ఫెడరల్ అడిగినప్పుడు , అవి చురుకుగా పనిచేస్తున్నాయని ఆమె వివరించారు. “దాదాపు అన్ని విద్యాసంస్థల్లో యాంటీ నార్కోటిక్ సెల్స్ ఉన్నాయి. అవి చురుకుగా పనిచేస్తాయి. మేము రెగ్యులర్ సమావేశాలు నిర్వహిస్తాము, ”అని ఆమె చెప్పారు.
మాదకద్రవ్యాల ముప్పు మూలాన్ని గుర్తించడానికి యూనియన్ టెరిటరీలో పోలీసింగ్ కొరత ఉందా అని ఫెడరల్ అడిగిన ప్రశ్నకు లెప్టినెంట్ గవర్నర్ సమాధాన మిస్తూ “మా పోలీసింగ్ బలంగా ఉంది. కొన్ని సందర్భాల్లో తమిళనాడులోని డ్రగ్స్ మాఫియా మూలంగా ఇలా నేరాలు జరుగుతున్నాయి.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ అమ్మకాలు తగ్గాయి: తమిళనాడు పోలీసులు
సౌందరరాజన్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన తమిళనాడు డిజిపి శంకర్ జివాల్, వాస్తవానికి, రాష్ట్రంలో మాదకద్రవ్యాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని, దీని కారణంగా సంబంధిత కేసుల సంఖ్య కూడా తగ్గిందని అన్నారు. సౌందరరాజన్‌ ఆరోపిస్తున్నట్లు తమిళనాడు నుంచి డ్రగ్స్‌ సరఫరా అయ్యే అవకాశం లేదని ఆయన అన్నారు. రాష్ట్రం కేవలం ట్రాన్సిట్ పాయింట్ మాత్రమేనని ఆయన అన్నారు.
"మేము వాస్తవానికి 21 ప్రధాన కేసులను విశ్లేషించాం. మా రాష్ట్రం మూల స్థానం కాదని, కేవలం రవాణా మాత్రమే జరుగుతున్నాయని కనుగొన్నాము. పట్టుబడిన డ్రగ్స్‌ను ధ్వంసం చేయడం వల్ల చలామణి కూడా తగ్గింది’’ అని చెప్పారు.


Read More
Next Story