
అల్ఫాహార దౌత్యం: డీకే శివకుమార్ ఇంటికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య
రెండు రోజుల క్రితం సీఎం నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చేసిన డీకే, తమ మధ్య విభేేదాలు మీడియా సృష్టే అన్న ఉప ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్లారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు నాయకులు సీఎం కుర్చీ కోసం గ్రూపులుగా తమ బలప్రదర్శనకు దిగారు.
సిద్ధరామయ్య బెంగళూర్ లోని సదాశివనగర్ లోని డిప్యూటీ సీఎం నివాసానికి కారులో వెళ్లారు. అక్కడ శివకుమార్, ఆయన సోదరుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేష్ ఆయనకు స్వాగతం పలికారు.
శివకుమార్ ఇంట్లో తయారు చేసిన అల్ఫాహారంలో దోశ, ఉప్మా, కంట్రీ చికెన్, ఇడ్లీ, కాఫీ ఉన్నాయి. మూడు రోజుల క్రితం శివకుమార్, సీఎం సిద్ధరామయ్య ఇంటికి వెళ్లి అల్ఫాహారం చేశారు.
ఇది కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇది జరుగుతున్నందున రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు. తమ మధ్య గందరగోళం సృష్టించడానికి మీడియానే కారణమని డీకే ఆరోపించారు. తాను, ముఖ్యమంత్రి ఇద్దరూ ఒక బృందంగా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.
కర్ణాటకకు ఎన్నికల సమయంలోతమ పార్టీ ఇచ్చిన వాగ్థానాలను నెరవేర్చడానికి తాము సమష్టిగా ప్రయత్నాలు చేస్తున్నామని, వాటిని చర్చించడానికి, పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధరామయ్యను అల్ఫాహారానికి ఆహ్వానించానని శివకుమార్ అన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ లో ఎటువంటి గ్రూపులు లేవని తామంతా కలిసి పనిచేస్తున్నామని అన్నారు. మీడియానే ఈ గందరగోళం సృష్టించడానికి కారణం అన్నారు.

