యలహంకలో కూల్చివేతలపై బీజేపీ ఆగ్రహం..
x

యలహంకలో కూల్చివేతలపై బీజేపీ ఆగ్రహం..

కేరళ సీఎం పినరయి విజయన్‌ పోస్టుపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్..


బెంగళూరు(Bangalore) ఉత్తర భాగం యలహంక (Yelahanka) ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను BBMP (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) నేలమట్టం చేస్తోంది. ఇక్కడ 14.36 ఎకరాల ప్రభుత్వ భూముల్లో సుమారు 200 కుటుంబాలు తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. ఈ భూమిని సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగానికి కేటాయించడంతో అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు మూడ్రోజుల క్రితం పేదల షెడ్లను తొలగిస్తున్నారు. ఈ కూల్చివేత కార్యక్రమం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. ‘‘కాంగ్రెస్ పెద్దల నిర్ణయం మేరకే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ "సూపర్ ముఖ్యమంత్రి" లా వ్యవహరిస్తున్నారు? అని ప్రతిపక్ష బీజేపీ నేత ఆర్. అశోక విమర్శించారు.

‘‘కర్ణాటక రాష్ట్ర వ్యవహరాల్లో తలదూర్చడానికి కేసీ వేణుగోపాల్ ఎవరు? ఆయనేమైనా సూపర్ సీఎంమా? కర్ణాటకను రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి, మంత్రివర్గం పాలిస్తుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కాదు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేరళ సీఎం విజయన్ ఆగ్రహం..

ఉత్తరప్రదేశ్‌ తరహాలో కర్ణాటకలోనూ ‘బుల్డోజర్‌ రాజ్‌’ (బుల్డోజర్‌ ప్రభుత్వం) నడుస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఎక్స్ వేదికగా విమర్శించారు.

కర్ణాటక రాష్ట్రం కోగిలు లే ఔట్‌లో అధికారులు ఇటీవల ఇళ్లను కూల్చివేయడంపై ఆయన స్పందించారు. ఇళ్లను కూల్చివేయడంతో ముస్లింలు రోడ్డున పడ్డారని, ప్రత్యామ్నాయంగా వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పినరయి విజయన్ పోస్టును చూశాక కేసీ వేణుగోపాల్ స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడానని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారని పేర్కొన్నారు.

Read More
Next Story