నీళ్లు లేవు.. అయినా జాతికి అంకితం..

వెలిగొండ ప్రాజెక్టు క్రిష్ణా జలాలు అందించే అద్భుతమైన పథకం. ప్రస్తుతం క్రిష్ణా నదిలో నీళ్లులేవు. అయినా సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు.


నీళ్లు లేవు.. అయినా జాతికి అంకితం..
x
వెలిగొండ సొరంగంలో సీఎం వైఎస్ జగన్

దేశంలోనే చెప్పుకోదగ్గ ప్రాజెక్టు. భూగర్భంలో కాలువలు తవ్వి సాగర్ నీటిని ప్రజలకు అందించే ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్దదోర్నా మండలంలో నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు లక్షల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యహ్నం జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుకు నీరు శ్రీశైలం డ్యమ్ లోపలి భాగం నుంచి అందుతాయి. ప్రస్తుతం డ్యామ్ లో నీరు అడుగంటడంతో సొరంగం ద్వారా రావడం అయ్యే పనికాదు. అయినా ముఖ్యమంత్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

టెన్నెల్స్ పొడవు 18.8 కిలో మీటర్లు

పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద నుంచి శ్రీశైలం డ్యామ్ లోకి 18.8 కిలో మీటర్ల పొడవు వుంది. ఈ పొడవుతో రెండు టన్నెల్స్ నిర్మించారు. ప్రకాశం జిల్లాలో 3,36,100 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84వేల ఎకరాలు, కడప జిల్లాలో 27,200 ఎకరాలు కలిపి మొత్తం 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వ హయాం పూర్తయి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం కూడా ముగియనొస్తోంది. గుండ్లం చెర్ల, సుంకేసుల, కాకర్ల వద్ద కొండల మధ్యన మూడు ఆనకట్టలు నిర్మించారు. ఈ ఆనకట్టల నిర్మాణం కూడా వైఎస్సార్ హయాంలోనే పూర్తయింది. మెయిన్ కెనాల్స్ కూడా అప్పట్లోనే తవ్వారు. మూడొంతులు సొరంగ మార్గం కూడా వైఎస్సార్ హయాంలోనే పూర్తయింది. పదేళ్ల కాలంలో ప్రాజెక్టును రెండు ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయి. ఇంకా మేజర్ కాలువలు, మైనర్ కాలువల నిర్మాణాలు జరగాల్సి ఉంది. అయినా ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారు.


పూర్తి కాని పునరావాసం

ప్రాజెక్టు కింద పునరావాసం పూర్తి కాలేదు. మంత్తం 11 గ్రామాలు ముంపుకు గురవుతాయి. ఈ గ్రామాల ప్రజల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీలు సగంలోనే ఉన్నాయి. ప్రజలను పునరావాస గ్రామాల నుంచి తరలించకుండానే ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం విచిత్రంగా వుందని చాలా మంది ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆర్ఆర్ ప్యాకేజీలు కూడా ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఇంత గొప్ప ప్రాజెక్టును పూర్తి చేశామని చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా అని పలువురు రైతులు అంటున్నారు.

ప్రాజెక్టు నీటి నిల్వ కెపాసిటీ

నల్లమల సాగర్ (శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు) ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 53.85 టీఎంసీలు. ప్రాజెక్టు నుంచి 43.50టీఎంసీలు నీటిని వాడుకోవచ్చు. డెడ్ స్టోరేజ్ మైనస్ 10.35 టీఎంసీలు వుంటాయి. ప్రాజెక్టు పరిధిలో 32,482ఎకరాలు భూమి వుంది. అందులో 7,586 ఎకరాల ఫారెస్ట భూమి వుంది.


ప్రాజెక్టు నిర్మాణ వ్యయం

ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించిన మొత్తం రూ. 9,200 కోట్లు. మంజూరు చేసిన మొత్తం రూ. 8,043.85 కోట్లు. 15.25 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది. మూడు జిల్లాల్లో 30 మండలాలకు లాభం చేకూరుతుంది. నిర్మాణ వ్యయం సకాలంలో మంజూరు చేయడం లేదని చాలా రోజులుగా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. లక్షల మంది రైతులు, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును పాలకులు నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు. రెండు ఫేజ్ లుగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి బుధవారం ప్రాజెక్టును సందర్శించి జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించడాన్ని రైతులు జీర్ణించుకోవడం లేదు. ఈ వేసవిలో ప్రభుత్వం మేజర్, మైనర్ కాలువల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తె ప్రజలు హర్షించే వారు.

సీఎం జగన్ ఏమన్నారంటే..

ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు.. ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా.. ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో గతంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయి.

రెండు టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కోటీ 18.8 కి.మీ. పొడవు ఉంటే, రెండు టన్నెళ్లు దాదాపు 37.6 కిలోమీటర్ల టన్నెళ్ల పొడవు అయితే, ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కి.మీ. దివంగత నేత, రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులుతో పనులు చేస్తూ టన్నెళ్లు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడ్డాయి.

2014 నుంచి 2019 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చూస్తే కేవలం 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల పనులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ ఈరోజు దాదాపు మిగిలిపోయిన 11 కిలోమీటర్ల టన్నెళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం.

Next Story