ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానది ఒడ్డున ఉన్న కృష్ణలంకలో అలజడి నెలకొంది. రాత్రి 11 గంటల తరువాత కృష్ణలంక ఇండ్లలోకి నీరు వస్తున్నాయనిపోలీసులు అనౌన్స్ వణికిపోతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణలంకలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక వాహనం ద్వారా అనౌన్స్‌మెంట్‌ చేస్తున్నారు. వరద నీరు కృష్ణలంకలోకి వస్తుందనేది అనౌన్స్‌మెంట్‌. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో గల కృష్ణానది ఒడ్డున ఉన్న కృష్ణలంకలో భయం భయంతో జనం రోడ్లపైకి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి రామలింగేశ్వర నగర్‌ వరకు ఉన్న కృష్ణానదీ తీరంలోని ఇండ్లు వరద నీరుతో ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, నదిలో వరద నీరు పెరిగి నందున వెంటనే ఆయా ప్రాంతాల వారు ఖాళీ చేసి రోడ్డు పైభాగానికి రావాలని పోలీసులు వాహనం ద్వారా చేస్తున్న అనౌన్స్‌మెంట్‌తో జనం బెంబేత్తి పోతున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో నది రిటర్నింగ్‌ వాల్‌కు మూడు మీటర్లలోపులో నీరు ప్రవహిస్తోంది. ఉన్నట్లుండి ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వరదనీరు ఎక్కువ కావడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. బాలాజీ నగర్, రంగుతోట, పోలీసు కాలనీల్లో నీరు రోడ్డపైకి నదిలోనించి రావడంతో వారు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. చాలా మంది గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే ఇండ్లలో నుంచి ఖాళీ చేసి రోడ్లపైకి వెళుతున్నారు. రిటర్నింగ్‌ వాల్‌కు నాలుగు అడుగుల కింది భాగాన రంద్రాలు పెట్టారు. అందువల్ల నీరు ఎక్కువగా ప్రవహిస్తుంటే ఆ రంద్రాల నుంచి బయటకు నీరు వస్తోంది. ఆ రాంద్రాలు పెట్టకుంటే నీటి తన్నుడు వల్ల రిటర్నింగ్‌ వాల్‌ నీటి తాకిడికి కూలిపోయే అకాశం ఉందని ఇంజనీర్లు ఈ విధంగా డిజైన్‌ చేశారు. అయితే పోలీసులు కృష్ణలంక ప్రాతంలో నివాసం ఉంటున్న వారందరినీ ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలోకి జనం వెళ్లిపోయారు.

భయంతో రోడ్లపైకి జనం

కృష్ణలంకలో జనం హైవేపైకి జనం వెళ్లలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. హైవే నదికి పైభాగాన ఉండటం వల్ల మెయిన్‌రోడ్డుపైకి వెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందనే బావనలో ప్రజలు ఉన్నారు. అధికారులు ప్రచారం చేసి వదిలేశారు తప్ప వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిద్దామనే ఆలోచన చేయలేదు. జనాన్ని బయటకు రావాల్సిందిగా చెప్పినప్పుడు వారికి అసరమైన పునరావాసం కల్పిస్తున్నామని, పలానా ప్రాంతానికి రావాలని చెప్పకపోవడంతో రాత్రిపూట ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొందరు ఉన్నారు. కొందరైతే ఇళ్లు ఖాళీ చేసి తమ బందువులు ఉన్న ప్రాంతాలకు వెళ్లిపోయారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. కృష్ణలంక వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెప్పడం కాకుండా చేసి చూపింలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Next Story